Bihar CM Nitish Kumar: బిహార్ సీఎం నితీశ్ కుమార్ కు తప్పిన ముప్పు
Bihar CM Nitish Kumar: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కాన్వాయ్ లో భద్రతాలోపం బయటపడింది. గురువారం ఉదయం మార్నింగ్ వాక్ చేస్తుండగా నితీశ్ కుమార్ సెక్యూరిటీ కవర్ లోకి ఇద్దరు వ్యక్తులు బైక్ పై దూసుకువచ్చారు. ప్రమాదం నుంచి తప్పించుకోవడం కోసం బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఫుట్ పాత్ పైకి దూకేశారు.

పోలీసుల అదుపులో నిందితులు..
బిహార్ సీఎం నితీశ్ కుమార్ గురువారం ఉదయం పట్నాలోని అన్నే మార్గ్ లో మార్నింగ్ వాక్ చేస్తుండగా.. అకస్మాత్తుగా బైక్ పై ఇద్దరు వ్యక్తులు ఆయన కాన్వాయ్ లోకి దూసుకు వచ్చేశారు. వారి బైక్ మార్నింగ్ వాక్ చేస్తున్న తనవైపే వేగంగా రావడం గమనించిన నితీశ్ కుమార్.. సమయస్ఫూర్తితో వెంటనే పక్కనే ఉన్న ఫుట్ పాత్ పైకి దూకేశారు. ఈ ఘటన జరిగిన సర్క్యులర్ రోడ్ ప్రాంతంలో మాజీ సీఎం రబ్రీ దేవి సహా అనేకమంది వీఐపీలు నివాసం ఉంటారు. ఈ ఘటన జరిగిన వెంటనే సీఎం నితీశ్ కుమార్ సెక్యూరిటీ సిబ్బంది ఆ బైక్ పై ఉన్న ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారిని పోలీసులు విచారిస్తున్నారు. ఆ ప్రాంతంలోని సీసీ టీవి ఫుటేజ్ ను స్వాధీనం చేసుకుని, దర్యాప్తు కొనసాగిస్తున్నారు.