తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Arunachal Pradesh Crime News : బావపై బాలిక రేప్​ కేసు.. ఆమె అక్కను జైలుకు పంపించిన కోర్టు!

Arunachal Pradesh crime news : బావపై బాలిక రేప్​ కేసు.. ఆమె అక్కను జైలుకు పంపించిన కోర్టు!

Sharath Chitturi HT Telugu

28 July 2023, 13:44 IST

google News
  • Arunachal crime news : బావపై ఓ బాలిక రేప్​ కేసు పెడితే.. అతని భార్య (మైనర్​ సోదరి)ను ఓ కోర్టు జైలుకు పంపిన ఘటన అరుణాచల్​ ప్రదేశ్​లో చోటుచేసుకుంది. ఇందుకో ఓ కారణం ఉంది.

బావపై బాలిక రేప్​ కేసు.. ఆమె అక్కను జైలుకు పంపించిన కోర్టు!
బావపై బాలిక రేప్​ కేసు.. ఆమె అక్కను జైలుకు పంపించిన కోర్టు!

బావపై బాలిక రేప్​ కేసు.. ఆమె అక్కను జైలుకు పంపించిన కోర్టు!

Arunachal Pradesh crime news : తనను నిత్యం కొట్టి, హింసించే భర్తను వదిలించుకోవాలని చూసింది.. అరుణాచల్​ ప్రదేశ్​కు చెందిన ఓ మహిళ. ఇందుకోసం తన చెల్లి సాయం తీసుకుంది. ఆమె చేత తప్పుడు రేప్​ కేసు పెట్టించింది. చివరికి జైలు పాలైంది.

ఇదీ జరిగింది..

అరుణాచల్​ ప్రదేశ్​లోని తూర్పు సియాంగ్​ జిల్లాలో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన.  ఈ నెల తొలినాళ్లల్లో.. ఓ మైనర్.. పోలీస్​ స్టేషన్​కు వెళ్లి తన బావ (అక్కకు భర్త)పై రేప్​ కేసు పెట్టింది. అతడిని వెంటనే అరెస్ట్​ చేయాలని ఫిర్యాదులో పేర్కొంది. ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సంబంధిత వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కానీ, విచారణలో అసలు విషయం బయటపడింది.

సంబంధిత వ్యక్తి, మైనర్​ను రేప్​ చేయలేదని పోలీసులు తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే ఫిర్యాదు చేసిన బాలికను విచారిచారు. తన అక్క చెప్పడంతో ఇలా చేశానని ఆమె అధికారులకు వివరించింది. ఈ క్రమంలో పోలీసులు మహిళను అరెస్ట్​ చేసి విచారించారు.

"నా చెల్లి చేత నేనే అలా చెప్పించాను. నా భర్త రోజూ నన్ను కొడుతున్నాడు. చిత్రహింసకు గురిచేస్తున్నాడు. పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా.. ఫలితం ఉండటం లేదు. అందుకే ఇలా చేశాను," అని ఆ మహిళ వెల్లడించింది.

ఇదీ చూడండి:- Minor Girl Rape: దళిత బాలికపై సామూహిక అత్యాచారం, అవమానంతో ఆత్మహత్య

మహిళకు వ్యతిరేకంగా పోలీసులు కేసు వేయడంతో.. కొన్ని రోజుల తర్వాత ఈ వ్యవహారం పోక్సో కోర్టు మెట్లకెక్కింది. భర్త నుంచి విముక్తి పొందాలని సంబంధిత మహిళ ఈ ప్రయత్నం చేసిందని, ఆమెను విడిచిపెట్టాలని డిఫెన్స్​ కౌన్సిల్​ పేర్కొంది. మహిళను విడిచిపెడితే.. ఇలాంటి కేసులు చాలా వస్తాయని, సమాజానికి ఇది చెడు ఉదాహరణగా నిలిచిపోతుందని పోక్సో చట్టం కింద ఏర్పాటు చేసిన స్పెషల్​ పబ్లిక్​ ప్రాసిక్యూటర్​ వాదించారు.

Arunachal Pradesh latest news : ఇరు పక్షాల వాదనను విన్న పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్​ తగేంగ్​ పడోహ్​.. మహిళకు నెల రోజుల పాటు జైలు శిక్ష విధించారు. అంతేకాకుండా రూ. 20వేల ఫైన్​ విధించారు.

"గృహ హింస నుంచి బయటపడేందుకు మహిళకు చాలా మార్గాలు ఉన్నాయి. కానీ మైనర్​ చేత తప్పుడు రేప్​ కేసు పెట్టించింది. ఏజెన్సీలను తప్పుదారి పట్టించింది. ఇది సరైనది కాదు. అందుకే ఆమెకు శిక్ష విధిస్తున్నాను. అయితే మైనర్​కు మాత్రం ఎలాంటి శిక్ష వేయడం లేదు. చట్టానికి లోబడే ఈ నిర్ణయం తీసుకున్నాను," అని జస్టిస్​ తగేంగ్​ పడోహ్​ తెలిపారు.

తదుపరి వ్యాసం