Minor Girl Rape: దళిత బాలికపై సామూహిక అత్యాచారం, అవమానంతో ఆత్మహత్య-a dalit girl was gang raped and committed suicide in shame ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Minor Girl Rape: దళిత బాలికపై సామూహిక అత్యాచారం, అవమానంతో ఆత్మహత్య

Minor Girl Rape: దళిత బాలికపై సామూహిక అత్యాచారం, అవమానంతో ఆత్మహత్య

HT Telugu Desk HT Telugu
Jul 24, 2023 09:48 AM IST

Minor Girl Rape: పాఠశాల విద్యార్ధినిని ప్రేమ పేరుతో లొబరుచుకుని సామూహిక అత్యాచారానికి పాల్పడటంతో అవమానం తాళలేక బాలిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కృష్ణాజిల్లా పామర్రులో జరిగింది.

మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం, ఆత్మహత్య
మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం, ఆత్మహత్య

Minor Girl Rape: ప్రేమ పేరుతో పాఠశాల విద్యార్ధినిని లోబరచుకుని, బంధువుతో కలిసి అత్యాచారానికి పాల్పడటంతో మనస్తాపానికి గురైన బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. పాఠశాలకు వెళ్లే విద్యార్ధినిని ప్రేమ పేరుతో లోబరుచుకున్నాడు. పాఠశాల నుంచి తీసుకెళ్లి బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత బాలిక, కాలువలో శవమై తేలడంతో కలకలం రేగింది.

కృష్ణాజిల్లా పామరు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక (14) తొమ్మిదో తరగతి చదువుతోంది. బాలిక నివాసం ఉండే వీధికి తరచుగా వచ్చే లోకేష్ ఆమెను ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పేవాడు. ఈ నెల 20న బాలికకు పోన్ చేసి, బాలికతో కలిసి బయట వెళ్లడానికి రమ్మన్నాడు. దీంతో పాఠశాలకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బాలిక బయటకు వచ్చింది. పుస్తకాల బ్యాగును పాఠశాల బయట వదిలేసింది. పాఠశాల సమీపంలో లిఫ్ట్ అడిగి విజయవాడ- మచిలీపట్నం జాతీయ రహదారి దిగింది. కొద్ది సేపటి తర్వాత లోకేష్ వచ్చి తన వాహనంపై ఆమెను తీసుకెళ్లాడు.

పామర్రు నుంచి బాలికను ఉయ్యూరులోని ఓ లాడ్జికి తీసుకె డు. తనకు వరుసకు సోదరుడయ్యే నరేంద్రను కూడా పోన్ చేసి పిలిచాడు. లాడ్జిలో ఒకరి తర్వాత మరొకరు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. మరోవైపు స్కూలు బయట ఉన్న పుస్తకాల బ్యాగును చూసిన వాచ్ మన్ విషయాన్ని పాఠశాల హెచ్ఎంకు చెప్పాడు. దీంతో ప్రిన్సిపల్ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కంగారుగా పాఠశాలకు వచ్చిన తల్లికి, బాలిక స్కూలుకు రాలేదని ఉపాధ్యాయులు చెప్పారు. ఆమె ఇంటికి తిరిగి వస్తుండగా బాలికకు లిఫ్ట్ ఇచ్చిన యువకుడు వంతెన వద్ద దింపిన తర్వాత తన ఫోన్ నుంచి లోకేష్ అనే యువకుడికి కాల్ చేసిందని చెప్పాడు.

దీంతో బాలిక తల్లిదండ్రులు లోకేష్ కు ఫోన్ చేసి నిలదీశారు. లాడ్జిలో ఉన్న లోకేష్‌ బాలికను ఆమె ఇంటి సమీపంలో దించి వెళ్లిపోయాడు. బాలిక రాత్రి ఆయినా ఇంటికి రాకపోయేసరికి తల్లిదండ్రులు పామర్రు స్టేషన్లో ఫిర్యాదుచే శారు. పోలీసులు కేసు నమోదుచేశారు.ఆ తర్వాత పోలీసులు లోకేష్, నరేంద్రలను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తాను బాలికను ఆమె ఇంటి సమీపంలో వదిలివెళ్లానని విచారణలో చెప్పాడు. ఈ క్రమంలో మొవ్వ మండలం సూరసానిపల్లి సంతకాలువలో ఆదివారం రాత్రి బాలిక మృతదేహం లభ్యమైంది. మనస్థాపంతో కాలువలోకి దూకి ఉంటుందని పోలీసులు అనుమా నిస్తున్నారు. నిందితులపై సామూహిక అత్యా చారం, ఆత్మహత్యకు ప్రేరేపణ, ఎస్సీ, ఎస్టీ నిరోదక చట్టం, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు.

నిందితుల్ని కఠినంగా శిక్షిస్తామన్న ఎస్పీ…

బాలిక ఆత్మహత్యపై రాజకీయ విమర్శలు రావడంతో జిల్లా ఎస్పీ వివరణ ఇచ్చారు. పామర్రు మండలం నిభానుపూడి గ్రామానికి చెందిన బాలిక నిమ్మకూరు జడ్పీ హై స్కూలులో తొమ్మిదవ తరగతి చదువుతోందని, కొంత కాలంగా నిందితుడు లోకేష్ బాలికను ప్రేమ పేరుతో చాటింగ్ చేస్తూ పరిచయం పెంచుకున్నాడని ఎస్పీ వివరించారు.

20 వ తేదీన స్కూలుకు బయలుదేరిన బాలిక తన తాతయ్య ఫోన్ ద్వారా మాట్లాడి స్కూలుకు వెళ్లకుండా నిందితుడితో మోటార్ సైకిల్ పై ఉయ్యురులోని రామ చంద్ర లాడ్జికి వెళ్లిందని, అక్కడ నిందితుడు తన సోదరుడి వరుస అయ్యే మరో ముద్దాయితో నరేంద్రతో కలిసి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపారు. తల్లి దండ్రులు ఫోన్ చేయడంతో బాలికను గ్రామ సమీపంలో వదిలి పరారయ్యారని వివరించారు.

20వ తేదీ సాయంత్రం బాలిక కనపించడం లేదని తల్లి పామర్రు పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేయడంతో ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసి ఆరుగురు సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ముద్దాయిలను అదుపులోనికి తీసుకున్నామని ఎస్పీ జాషువా తెలిపారు.

బాాలిక కోసం గాలింపు చర్యలు కూడా చేపడుతూ ఉన్న క్రమంలో మృత దేహం కూచిపూడి మండలంలోని సూరసానిపల్లి వద్ద పంట కాలువలో ఆదివారం మధ్యాహ్నం లభ్యమైంది. నిందితుల పై రౌడీ షీట్లు తెరుస్తామని ప్రకటించారు.

Whats_app_banner