Gangster shot dead: గ్యాంగ్ స్టర్ హత్య; భక్తుడిలా కాషాయం ధరించి గుడిలో పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్పులు
Gangster shot dead: ‘కావడియా’ల మాదిరిగా కాషాయ దుస్తులు ధరించి, గుడిలో పాయింట్ బ్లాంక్ రేంజ్ లో ఒక గ్యాంగ్ స్టర్ ను ఒక వ్యక్తి కాల్చి చంపేశాడు. ఈ ఘటన శుక్రవారం జార్ఖండ్ లో జరిగింది.
Gangster shot dead: ‘కావడియా’ల మాదిరిగా కాషాయ దుస్తులు ధరించి, గుడిలో పాయింట్ బ్లాంక్ రేంజ్ లో ఒక గ్యాంగ్ స్టర్ ను ఒక వ్యక్తి కాల్చి చంపేశాడు. ఈ ఘటన జార్ఖండ్ లో జరిగింది. ఆ గ్యాంగ్ స్టర్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. దాదాపు 30 తీవ్రమైన నేరాల్లో నిందితుడిగా ఉన్నాడు.
శివ భక్తులు..
శ్రావణ మాసంలో శివ భక్తులు దీక్ష చేపట్టి గంగా నది నీటిని స్వయంగా కిలోమీటర్ల దూరం నుంచి కాలి నడకన మోసుకువచ్చి, శివాలయాల్లో శివ లింగానికి అభిషేకం చేస్తారు. ఈ దీక్ష చేసేవారిని కావడియా (kanwariya) లు అంటారు. వీరు సాధారణంగా కాషాయ దుస్తులు ధరిస్తారు. శ్రావణ మాసంలో లక్షలాది మంది భక్తులు ఇలా కావడి యాత్ర (Kanwar Yatra) చేపడ్తారు.
కావడియాల వేషధారణలో..
జార్ఖండ్ లోని దుంకా జిల్లాలో కూడా ఇలా దీక్షలు చేపడ్తారు. అలా కావడియాల మాదిరిగా దుస్తులు ధరించి, కొందరు వ్యక్తులు జార్ఖండ్ లోని దుంకా జిల్లాలో ఉన్న ఒక శివాలయం సమీపంలో ఒక గ్యాంగ్ స్టర్ ను హతమార్చారు. జంషెడ్ పూర్ లో అమర్నాథ్ సింగ్ పెద్ద పేరుమోసిన గ్యాంగ్ స్టర్. వాంటెడ్ క్రిమినల్. అతడిపై 30 కి పైగా క్రిమినల్ కేసులున్నాయి. శుక్రవారం అతడు తన కుటుంబంతో కలిసి, దుంకాలోని నందీ చౌక్ సమీపంలో ఉన్న బాసుకీనాథ్ ఆలయానికి పూజలు చేయడం కోసం వచ్చాడు. ఆ సమయంలో కావడియాల వేషంలో వచ్చిన కొందరు వ్యక్తులు అతడిపై అత్యంత సమీపం నుంచి బుల్లెట్ల వర్షం కురిపించారు. దాంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. ఆ ప్రాంతంలో ఆరు ఖాళీ క్యాట్రిజ్ లు లభించాయని పోలీసులు తెలిపారు. గ్యాంగ్ వార్ లో భాగంగా ఈ హత్య జరిగినట్లు భావిస్తున్నామన్నారు. దర్యాప్తు ముగిసిన తరువాత పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. అదే రోజు అమర్నాథ్ సింగ్ అనుచరులు ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైవే పై కారులో వెళ్తున్న వారిని పోలీసులు అడ్డుకోవడంతో, వారు పోలీసులపై కాల్పులు జరిపారు. వారి కాల్పుల్లో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. పోలీసుల ఎదురు కాల్పుల్లో ఆ గ్యాంగ్ సభ్యులకు కూడా తీవ్రంగా గాయాలయ్యాయి.