Crime news: భార్య, కన్నతల్లి, కన్నబిడ్డలను గొంతు కోసి చంపేసిన వ్యక్తి; అక్రమ సంబంధం అనుమానంతో..
13 August 2024, 19:35 IST
- బిహార్ లోని భగల్ పూర్ ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. ఒక వ్యక్తి సొంత కుటుంబంలోని నలుగురిని గొంతు కోసం హతమార్చాడు. ఆ తరువాత తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీస్ కానిస్టేబుల్ అయిన తన భార్య అక్రమ సంబంధం కొనసాగిస్తోందన్న అనుమానంతో ఆ వ్యక్తి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు.
సామూహిక హత్యాకాండపై మీడియాకు సమాచారం అందిస్తున్న ఎస్ఎస్పీ ఆనంద్ కుమార్
Mass murder in Bihar: పోలీస్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుందన్న అనుమానం ఆ భర్తను రాక్షసుడిని చేసింది. ఆ భార్యతో పాటు కన్న తల్లిని, కన్న బిడ్డలను గొంతు కోసి చంపేశాడు. ఆ తరువాత తను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన బిహార్ లోని భగల్ పూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. భగల్పూర్లోని పోలీస్ లైన్లో ఉన్న ఆ కానిస్టేబుల్ నివసించే ప్రభుత్వ క్వార్టర్స్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్న తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని భర్త అనుమానించాడు. భార్య, ఇద్దరు పిల్లలు, తల్లి గొంతు కోసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కానిస్టేబుల్ గా జాబ్
ఈ ఘటన సోమ, మంగళవారాల్లో అర్ధరాత్రి జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాలను చూసిన పాల వ్యాపారి నీతూ కుమారి ఇరుగుపొరుగు వారికి సమాచారం అందించాడని భాగల్పూర్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (డీఐజీ) వివేకానంద్ తెలిపారు. మృతి చెందిన కానిస్టేబుల్ ను నీతూ కుమారిగా, ఆమె భర్తను పంకజ్ గా గుర్తించారు. పంకజ్ తన భార్య నీతూ కుమారిని, తన తల్లిని, ఇద్దరు పిల్లలను గొంతు కోసి చంపేశాడని, ఆ తరువాత తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ప్రాథమికంగా భావిస్తున్నామని తెలిపారు.
ఇంట్లోనే మృతదేహాలు..
ఆ కానిస్టేబుల్ భగల్పూర్ లోని ఎస్ఎస్పీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తోంది. పోలీస్ లైన్ లోని ఆ కానిస్టేబుల్ నివసిస్తున్న ప్రభుత్వ క్వార్టర్స్ లో ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయని భాగల్ పూర్ ఎస్ఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు. వీరిలో నలుగురిని గొంతు కోసి హత్య చేశారని, మహిళా పోలీసు అధికారి భర్త మృతదేహం పైకప్పుకు వేలాడుతూ కనిపించిందని తెలిపారు.
అక్రమ సంబంధం అనుమానంతో..
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా మంచంపై కొన్ని మృతదేహాలు, నేలపై కొన్ని మృతదేహాలు ఉండగా, పంకజ్ మృతదేహం పైకప్పుకు వేలాడుతూ కనిపించింది.
ఇంటి బయట గొడవ
ఈ ఘాతుకానికి పాల్పడిన ఆ కానిస్టేబుల్ భర్త రాసిన సూసైడ్ నోట్ ను కూడా స్వాధీనం చేసుకున్నామని, అందులో మహిళా పోలీసు అధికారికి ఎవరితోనో అక్రమ సంబంధం ఉందని అతడు పేర్కొన్నారని కుమార్ తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. సోమవారం రాత్రి పోలీస్ లైన్స్ లోని తమ క్వార్టర్స్ బయట నీతూ, పంకజ్ ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని స్థానికులు తెలిపారు.