Illegal Affair: వివాహేతర సంబంధంతో భర్తను చంపేసి.. కట్టుకథతో అంత్యక్రియలు పూర్తి, మూడ్నెల్ల తర్వాత నిందితుడు లొంగుబాటు-murdered husband due to extra marital affair funeral rites complete with fake story ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Illegal Affair: వివాహేతర సంబంధంతో భర్తను చంపేసి.. కట్టుకథతో అంత్యక్రియలు పూర్తి, మూడ్నెల్ల తర్వాత నిందితుడు లొంగుబాటు

Illegal Affair: వివాహేతర సంబంధంతో భర్తను చంపేసి.. కట్టుకథతో అంత్యక్రియలు పూర్తి, మూడ్నెల్ల తర్వాత నిందితుడు లొంగుబాటు

Sarath chandra.B HT Telugu
May 17, 2024 12:28 PM IST

Illegal Affair: వివాహేతర సంబంధంతో కట్టుకున్న భర్తను కడతేర్చిన భార్య గుండెపోటుతో మృతి చెందాడని అందరిని నమ్మించింది. మూడు నెలల తర్వాత హంతకుల్లో ఒకరు పశ్చాత్తాపంతో పోలీసులకు లొంగిపోవడంతో ఈ ఘటన వెలుగు చూసింది.

భార్య కిరాతకానికి బలైపోయిన విజయ్‌కుమార్‌
భార్య కిరాతకానికి బలైపోయిన విజయ్‌కుమార్‌

Illegal Affair: కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి హతమార్చిన భార్య ఆపై గుండెపోటుతో చనిపోయాడని అందరిని నమ్మించింది. ఆమె మాటలు నమ్మిన బంధువులు కుటుంబ ఆచారాలకు విరుద్ధంగా దహన సంస్కరాలు పూర్తి చేశారు. అప్పుడు కూడా ఎవరు ఆమెను అనుమానించలేదు. ఫిబ్రవరి 1న హత్య జరగ్గా మూడు నెలల తర్వాత నిందితులో ఒకరు పశ్చాత్తాపంతో పోలీసులకు లొంగిపోవడంతో ఈ ఘటన వెలుగు చూసింది.

మేడ్చల్‌కు చెందిన విజయ్‌కుమార్‌కు మేడ్చల్‌తో పాటు ఎల్లారెడ్డిగూడలో సొంత ఇళ్లు ఉన్నాయి. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. మేడ్చల్‌లో ఉంటున్న నివాసానికి మరమ్మతులు జరుగుతుండటంతో కొద్ది రోజులుగా ఎల్లారెడ్డిగూడలో నివాసం ఉంటున్నారు.

విజయ్‌కుమార్‌ భార్య శ్రీలక్ష్మీతో పాటు వారి ఇద్దరు పిల్లలతో కలిసి ఎల్లారెడ్డిగూడలో నివాసం ఉంటున్నారు. శ్రీలక్ష్మీకి పెళ్లికి ముందే రాజేశ్‌ అనే వ్యక్తిని ప్రేమించింది. పెళ్లి తర్వాత కూడా సంబంధం కొనసాగించింది. ఈ క్రమంలో అతనితో కలిసి జీవించడానికి భర్తను అడ్డు తొలగించుకోవాలని భావించింది. పథకాన్ని పక్కాగా అమలు చేసింది. హత్య జరిగిన మూడు నెలల తర్వాత నిందితుల్లో ఒకరు ఎప్పటికైనా విషయం బయట పడుతుందని భావించి మధురానగర్‌ పోలీసులకు లొంగిపోయాడు. హత్య సంగతి బయటపెట్టేశాడు. దీంతో మూడున్నర నెలల క్రితం జరిగిన దారుణం వెలుగు చూసింది.

ఎల్లారెడ్డిగూడ జయప్రకాశ్‌ నగర్‌లోని ఓ అపార్టుమెంటులో విజయ్ కుమార్, శ్రీలక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. శ్రీలక్ష్మికి రాజేశ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. పెళ్లికి ముందు ఇద్దరు ప్రేమించుకున్నారు. ఆ తర్వత కూడా ఆ సంబంధాన్ని కొనసాగించారు. భర్తకు తెలిస్తే ఇబ్బంది కలుగుతుందని భావించిన శ్రీలక్ష్మి భర్తను అడ్డు తొలగిం చాలని భావించింది. ప్రియుడితో చెప్పడంతో అతను కూడా సరేనన్నాడు.

రాజేశ్‌ సనత్‌నగర్‌కు చెందిన చెందిన పటోళ్ల రాజేశ్వర్‌ రెడ్డి సాయం కోరాడు. రౌడీషీటర్ రాజేశ్వర్ రెడ్డిపై ఇప్పటికే 8 కేసులున్నాయి. ఇతని ద్వారా మహ్మద్ మైతాబ్ అలియాస్ బబ్బన్ వారితో కలిశాడు. గత ఫిబ్రవరి 1న విజయ్‌ కుమార్‌ తన పిల్లల్ని స్కూలులో దింపడానికి వెళ్లిన సమయంలో అప్ప టికే ఇంటికి దగ్గర మాటువేసిన రాజేశ్, పటోళ్ల రాజేశ్వర్ రెడ్డి, మైతాబ్‌లను శ్రీలక్ష్మి ఇంట్లోకి రప్పించింది. వారిని బాత్‌రూమ్‌లో ఉంచింది.

పిల్లల్ని బడిలో దింపిన విజయ్ ఇంటికి రాగానే శ్రీలక్ష్మి లోపల నుంచి తలుపులకు గడియ పెట్టింది. బాత్‌రూమ్‌లో నక్కి ఉన్న రాజేశ్, రాజేశ్వర్ రెడ్డి, మైతాబ్‌లు బయటకు వచ్చి డంబెళ్లు, ఇనుపరాడ్లతో విజయ్‌కుమార్‌పై దాడి చేశారు. దాడిజరుగుతుండగా 'తనను చంపొద్దని వేడుకున్నాడు. కొట్టి వదిలేయాలని వారిని బ్రతిమాలాడు. అతను వేడుకుంటున్నా కర్కశంగా మట్టుబెట్టారు.

విజయ్ చనిపోయిన తర్వాత బాత్‌రూమ్‌లో శవాన్ని పడేసి వెళ్లిపోయారు. ఇంట్లో రక్తపు మరకలను తుడిచేసి, శవంపై దుస్తులను మార్చేసిన శ్రీలక్ష్మి.. భర్త గుండెపోటుతో బాత్‌రూమ్‌లో మరణించాడని అందరికి చెప్పింది. అదే రోజు కుటుంబ సభ్యులు, బంధువులకు చెప్పి అంత్యక్రియలు జరిపించారు. విజయ్‌ కుటుంబ సంప్రదాయం ప్రకారం ఖననం చేయాల్సి ఉన్నా ఆధారాలు దొరక్కుండా ఉండటానికి శవాన్ని దహనం చేయించారు.

హత్య తర్వాత నిందితుడు రాజేశ్వర్‌ రెడ్డి వికారాబాద్ పారిపోయాడు. మూడున్నర నెలలుగా అజ్ఞాతంలో ఉన్నాడు. విజయ్‌ను కొడుతున్నపుడు చంపొద్దని వేడుకోవడం గుర్తుకొచ్చి అపరాధభావనతో కుంగి పోయాడు. గురువారం మధురాన గర్ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి హత్య గురించి చెప్పాడు. హత్య తర్వాత మానసిక ప్రశాంతత లేదని, పశ్చాత్తా పంతో లొంగిపోయినట్టు చెప్పాడు. నిందితుడిని అదు పులోకి తీసుకున్న పోలీసులు..హత్యకు పాల్పడిన నలుగురిపై కేసు నమోదు చేశారు.