తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Crime News : తన తాగుడు అలవాటు గురించి భార్యకు చెప్పాడని.. స్నేహితుడి దారుణ హత్య!

Crime news : తన తాగుడు అలవాటు గురించి భార్యకు చెప్పాడని.. స్నేహితుడి దారుణ హత్య!

Sharath Chitturi HT Telugu

22 September 2024, 6:41 IST

google News
  • Man kills friend in Maharashtra : తనకున్న మద్యపానం అలవాటు గురించి భార్య, తల్లికి చెప్పాడన్న కారణంతో ఓ వ్యక్తి, తన స్నేహితుడిని చంపేశాడు! మరో మిత్రుడితో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టాడు. మహారాష్ట్రలో జరిగింది ఈ ఘటన.

మద్యం అలవాటు గురించి భార్యకు చెప్పాడని..
మద్యం అలవాటు గురించి భార్యకు చెప్పాడని..

మద్యం అలవాటు గురించి భార్యకు చెప్పాడని..

మహారాష్ట్రలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తన తాగుడు అలవాటు గురించి తన తల్లి, భార్యకు చెప్పాడన్న కారణంతో.. ఓ వ్యక్తి, తన స్నేహితుడుని కిరాతకంగా చంపేశాడు. చివరికి పోలీసులు అతడిని అరెస్ట్​ చేశారు.

ఇదీ జరిగింది..

మహారాష్ట్ర పూణెకి సమీపంలో ఉన్న హదాప్సర్​ అనే ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. నిందితులు వైభవ్ గణేష్ లబ్దే (31), ధ్యానేశ్వర్ దత్తు (27), మృతుడు అమోల్ మానే (39) మంచి స్నేహితులు. కాగా లబ్దేకి ఉన్న మద్యం అలవాటు గురించి అమోల్​ మాటిమాటికి అతని ఇంట్లో చెప్పేవాడు. అతని భార్య, తల్లికి ఫిర్యాదు చేసేవాడు. స్నేహితుడి తాగుడు అలవాటును దూరం చేయాలని భావించాడేమో! కానీ ఇది లబ్దేకి నచ్చలేదు. సొంత విషయాల్లో జోక్యం చేసుకుంటున్నాడని అమోల్​పై కోపం పెంచుకున్నాడు.

మానే జోక్యంతో కోపోద్రిక్తులైన ఇద్దరు నిందితులు అతన్ని చంపాలని పథకం వేశారు. గురువారం వారిద్దరూ మానే నివాసానికి వెళ్లారు. మాట్లాడుతూ, మాట్లాడుతూ.. హఠాత్తుగా అతని తలపై ఇనుప రాడ్డుతో కొట్టారు. తీవ్ర రక్తస్రావం అనంతరం అమోల్​ అక్కడికక్కడే మరణించాడు.

ఇదీ చూడండి:- Crime news : సెక్స్​ వర్కర్​ని చంపి.. శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసిన కిరాతకుడు!

అమోల్​ మరణం స్థానికంగా కలకలం సృష్టించింది. చివరికి ఈ విషయం పోలీసులకు తెలిసింది. ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. మరోవైపు నిందితులు గణేశ్​ లబ్దే, ధ్యానేశ్వర్​ దత్తులను అరెస్ట్​ చేశారు. విచారణలో నిందితులిద్దరూ నేరాన్ని అంగీకరించారు. బీఎన్ఎస్ సెక్షన్ 103(1) కింద హదాప్సర్ పోలీస్ స్టేషన్​లో వీరిపై కేసు నమోదైంది.

ఈ వార్త ఇప్పుడు వైరల్​గా మారింది. మద్యపానం అలవాటు గురించి మాట్లాడాడు అన్న కారణంతో స్నేహితుడిని చంపేశారన్న వార్త విని ప్రజలు షాక్​కి గురవుతున్నారు.

బెంగళూరులో దారుణం..

29 ఏళ్ల మహిళ మృతదేహాన్ని 30కి పైగా ముక్కలుగా కోసి రిఫ్రిజిరేటర్​లో కుక్కిన దారుణం బెంగళూరులో బయటపడింది. ఈ ఘటన వ్యాలికావల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో జరిగిందని పోలీసులు శనివారం తెలిపారు. ఈ రోజు ఉదయం ఆ ఇంటి నుంచి భరించలేని దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులు, ఇతర అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులకు ఆ ఇంట్లో 30 ముక్కలుగా నరికిన ఒక యువతి మృతదేహం ఫ్రిజ్​లో కనిపించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం