Crime news : సెక్స్​ వర్కర్​ని చంపి.. శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసిన కిరాతకుడు!-chennai crime news womans severed body parts found in abandoned suitcase ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Crime News : సెక్స్​ వర్కర్​ని చంపి.. శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసిన కిరాతకుడు!

Crime news : సెక్స్​ వర్కర్​ని చంపి.. శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసిన కిరాతకుడు!

Sharath Chitturi HT Telugu
Oct 01, 2024 11:52 AM IST

Chennai crime news : చెన్నైలో ఓ వ్యక్తి, ఓ సెక్స్​ వర్కర్​ని కిరాతకంగా చంపాడు. అనంతరం మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేసి సూట్​కేస్​లో పెట్టాడు. ఆ సెక్స్ వర్కర్ తన నుంచి ఎక్కువ డబ్బు డిమాండ్ చేయడంతో హత్య చేసినట్టు అతను చెప్పాడు!

పోలీసుల అదుపులో నిందితుడు
పోలీసుల అదుపులో నిందితుడు

తమిళనాడు రాజధాని చెన్నైలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక సెక్స్​ వర్కర్​ని, ఓ వ్యక్తి అతి కిరాతకంగా చంపాడు. అనంతరం ఆమెమ శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి, సూట్​కేస్​లో పెట్టాడు! ఎక్కువ డబ్బులు అడిగిందన్న కారణంగా ఈ దారుణానికి ఒడిగట్టాడు.

ఇదీ జరిగింది..

చెన్నైలోని తొరైపాక్కం ప్రాంతంలో ఓ మహిళ శరీర భాగాలతో కూడిన సూట్​కేస్​ని పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు.

సూట్​కేస్​లో నుంచి రక్తం కారుతుండటాన్ని ఉదయం 5:30 గంటల సమయంలో గమనించిన ఓ స్థానికుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వార్త వెంటనే స్థానికంగా కలకలం సృష్టించింది.

ఈ హత్యకు సంబంధించి శివగంగ జిల్లాకు చెందిన మణికందన్ అనే వ్యక్తిని కొన్ని గంటల్లోనే పోలీసులు అరెస్టు చేశారు. సూట్​కేస్ దొరికిన ప్రదేశానికి 100 మీటర్ల దూరంలో ఆయన నివాసం ఉంది.

మృతురాలిని మాధవరం జిల్లాకు చెందిన దీప అలియాస్ వెల్లయమ్మాళ్ (32)గా పోలీసులు గుర్తించారు. విచారణలో భాగంగా నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. దీప తన నుంచి ఎక్కువ డబ్బులు డిమాండ్ చేయడంతో గొడవ జరిగిందని, అనంతరం ఆమెని సుత్తితో హత్య చేసినట్లు పోలీసులకు చెప్పాడు.

అనంతరం సెక్స్​ వర్కర్​ మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి సూట్​కేస్​లో పడేసి నిందుతుడు పరారయ్యాడు.

దీప అనే సెక్స్ వర్కర్​ను మణికందన్ ఓ వ్యక్తి ద్వారా కలిశాడని, ఆమె బుధవారం తొరైపాక్కం వెళ్లిందని పోలీసులు తెలిపారు. దీప ఇంటికి రాకపోవడంతో ఆమె సోదరుడు కంగారుపడ్డాడు. ఆమెను సంప్రదించేందుకు ప్రయత్నించగా ఫోన్​ స్విఛాప్​ చేసి ఉందని తెలిసింది.

'ఫైండ్ మై డివైజ్' ఆప్షన్ ఉపయోగించి తన సోదరి మొబైల్ ఫోన్​ని ట్రాక్ చేశాడు. తర్వాత ఆమె చివరిసారిగా తొరైపాక్కం సమీపంలో ఉందని తెలుసుకున్నాడు. అనంతరం దీప సోదరుడు బుధవారం రాత్రి తొరైపాక్కం పోలీస్ స్టేషన్​కు సమాచారం అందించాడు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా.. గురువారం ఉదయం మృతదేహం లభించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. మరోవైపు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టి, అరెస్ట్​ చేశారు.

పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీపను హంతకుడికి పరిచయం చేసిన ఆ వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

పెరిగిపోతున్న నేరాలు..!

చెన్నైలో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి! గత నెలలో చెన్నైలోని ట్రిప్లికేన్ ప్రాంతంలోని ఓ హోటల్ గదిలో 28 ఏళ్ల యువతిని ఓ వ్యక్తి గొంతు నులిమి హత్య చేశాడు.

2023లో చెన్నైలోని ఓ హోటల్​లో 20 ఏళ్ల నర్సింగ్ విద్యార్థినిని ఆమె ప్రియుడు హత్య చేశాడు. ఆమెను చంపిన తర్వాత ప్రియుడు మృతదేహం ఫొటోను తన వాట్సప్ స్టేటస్​గా పోస్ట్ చేయడం గమనార్హం!

నిందితుడి వాట్సప్ స్టేటస్​ను గమనించిన బాధితురాలి స్నేహితులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది.

సంబంధిత కథనం