Mahindra Bolero and Bolero Neo prices increased : మహీంద్రా బొలేరో ధరలు పెరిగాయి!
20 September 2022, 13:15 IST
- Mahindra Bolero price increased : మహీంద్రా బొలేరో, బొలేరో నియో వాహనాల ధరలు పెరిగాయి. ఆ వివరాలు..
మహీంద్రా బొలేరో ధరలు పెరిగాయి!
Mahindra Bolero price : బొలేరో, బొలేరో నియో ధరలను పెంచుతున్నట్టు దేశీయ దిగ్గజ ఆటో సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా ప్రకటించింది. మహీంద్రా బొలేరోపై రూ. 22వేలు, బొలేరో నియోపై రూ. 21,007 వరకు పెంచుతున్నట్టు పేర్కొంది.
మహీంద్రా బొలేరో బీ4 వేరియంట్‌పై రూ. 20,701.. బొలేరో బీ6(ఓ) వేరియంట్‌పై రూ. 22 వేలు పెంచారు. ఫలితంగా.. ధరల పెంపు అనంతరం మహీంద్రా బొలేరో రూ. 9.45లక్షలకు(ఎక్స్ షోరూమ్) అందుబాటులోకి రానుంది. ఇక బొలేరో నియో ఎన్4పై రూ. 18,800.. ఎన్10పై రూ. 21,007.. నియో10(ఓ)పై రూ. 20,502ని పెంచింది మహీంద్రా. ఫలితంగా ఇప్పుడు మహీంద్రా బలేరో నియో ధర రూ. 9.48లక్షలు- రూ. 11.99లక్షల(ఎక్స్ షోరూమ్) మధ్య ఉండనుంది.
Mahindra Bolero Neo price : మహీంద్రా బొలేరోకి 1.5లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది. దీని పవర్ 75బీహెచ్పీ, టార్క్ 210ఎన్ఎం. 5స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ దీని సొంతం. మరోవైపు 100బీహెచ్పీ, 240ఎన్ఎం టార్క్‌ను జెనరేట్ చేసే 1.5లీటర్ డీజిల్ మోటార్.. మహీంద్రా బొలేరో నియోలో ఉంటుంది. దీనికి కూడా 5స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ లభిస్తుంది.
మహీంద్రా వాహనాల ధరల పెంపు..
M & M prices increased : మహీంద్రా వాహనాల ధరలు ఇటీవలి కాలంలో పెరుగుతున్నాయి. మహీంద్రా ఎక్స్‌యూవీ700 ధర రూ. 37,000 వరకు పెరిగింది. పెట్రోల్ వేరియంట్ ప్రైజ్ హైక్ రూ. 22,000- రూ. 35000 మధ్యలో ఉంది. ఇక డీజిల్ వేరియంట్ ప్రైజ్ హైక్ రూ. 20వేలు- రూ. 37వేల మధ్యలో ఉంది. మహీంద్రా ఎక్స్‌యూవీ వాహనాల ధరల పెంపు.. ఇప్పటికే ఇది మూడోసారి కావడం గమనార్హం.
ఇక మహీంద్రా థార్ ధర రూ. 28వేలు పెరిగింది.
ఇక ఎక్స్‌యూవీ400 ఈవీతో ఎలక్ట్రిక్ వాహనాల సెగ్నెంట్లోకి కూడా ప్రవేశించింది మహీంద్రా అండ్ మహీంద్రా. ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.