తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Viral Video : కష్టపడి చదివించిన కుమారుడు సీఏ పాస్​ అయ్యాడని తెలిసి తల్లి భావోద్వేగం!

Viral video : కష్టపడి చదివించిన కుమారుడు సీఏ పాస్​ అయ్యాడని తెలిసి తల్లి భావోద్వేగం!

Sharath Chitturi HT Telugu

16 July 2024, 7:20 IST

google News
    • Vegetable vendor son become CA : కష్టపడి చదివించిన కుమారుడు సీఏ పాస్​ అయ్యాడని తెలిసి ఓ తల్లి భావోద్వేగానికి గురైంది. కంటతడి పెట్టుకుంది. మహారాష్ట్రలో జరిగింది ఈ ఘటన.
కష్టపడి చదివించిన కుమారుడు సీఏ పాస్​ అయ్యాడని తెలిసి..
కష్టపడి చదివించిన కుమారుడు సీఏ పాస్​ అయ్యాడని తెలిసి..

కష్టపడి చదివించిన కుమారుడు సీఏ పాస్​ అయ్యాడని తెలిసి..

పిల్లల కోసం తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేస్తారు. తాము ఎంత కష్టపడినా పర్లేదు పిల్లలు మాత్రం బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలని ఆకాంక్షిస్తుంటారు. అనుకున్నట్టుగనే పిల్లలు ఉన్నతస్థాయికి చేరుకుంటే చూసి మురిసిపోతుంటారు. మహారాష్ట్రలో జరిగిన ఇలాంటి ఘటనే ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. కూరగాయలు విక్రయిస్తూ జీవించే ఓ మహిళ కుమారుడు సీఏ ఫైనల్​ పరీక్ష పాసైయ్యాడు. ఇప్పుడు ఆమె ఆనందానికి హద్దులు లేవు!

ఇదీ జరిగింది..

మహారాష్ట్ర డోంబివ్లిలోని కూని అనే గ్రామంలో నివాసముంటున్న నీరా థొంబారే, 25ఏళ్లుగా కూరగాయలు విక్రయిస్తూ జీవితాన్ని సాగిస్తోంది. తాను ఎంత కష్టపడినా పర్లేదు, బిడ్డకు మంచి చదువు ఇవ్వాలని ఆమె తహతహలాడేది. అందుకు తగ్గుట్టుగానే థొంబారే కుమారుడు యోగేశ్​ వృద్ధిలోకి వచ్చాడు. కఠిన శ్రమతో ఒక్కో మెట్టు ఎక్కాడు. బాగా చదువుకుని తాజాగా సీఏ ఫైనల్​ పరీక్ష పాస్​ అయ్యాడు.

పరీక్ష పాసైనట్టు తెలుసుకున్న యోగేశ్​.. నేరుగా తల్లి దగ్గరికి వెళ్లాడు. అప్పటికి ఆమె మార్కెట్​లో కూరగాయలు విక్రయిస్తోంది. తాను సీఏ పాసైనట్టు చెప్పాడు. ఆమె ఒక్కసారిగా లేచి, కుమారుడిని కౌగిలించుకుంది. చాలా భావోద్వేగానికి గురైంది. కంటతడి పెట్టుకుంది. తన కష్టానికి ప్రతిఫలం దక్కిందని కుమారుడిని చూసి మురిసిపోయింది.

ఇందుకు సంబంధించిన వీడియోని మహారాష్ట్ర పీడబ్ల్యూడీ మంత్రి రవింద్ర చవాన్​ ట్విట్టర్​లో షేర్​ చేశారు.

"నిన్ను చూస్తే గర్వంగా ఉంది యోగేశ్​. సంకల్పం, కఠోర శ్రమతో ప్రతికూల పరిస్థితులను జయించి విజయం సాధించావు యోగెశ్​," అని రవింద్ర చవన్​ తన పోస్ట్​లో చెప్పారు.

ట్విట్టర్​లో వైరల్​ అయిన ఈ వీడియోపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్​ సైతం స్పందించారు. "యోగేశ్​కి శుభాకాంక్షలు" అన్నారు.

డబ్బు ఉన్నా, లేకపోయినా.. ఎన్ని ప్రతికూల పరిస్థితులెదురైనా కష్టపడితే జీవితంతో సక్సెస్​ సాధించవచ్చు అనేందుకు యోగేశ్​, థొంబారే జీవితం ఒక ఉదాహరణ.

సీఏ ఫైనల్​ క్లియర్​ చేసిన అనంతరం యోగేశ్​ తన తల్లికి ఒక చీరని బహుమతిగా ఇచ్చాడు.

వీడియో ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. నెటిజన్లు యోగేశ్​ని అభినందిస్తున్నారు. కష్టపడి కుమారుడిని పెంచిన థొంబారేని అభినందిస్తున్నారు. ఆమె కంటతడి పెట్టుకోవడాన్ని చూసి భావోద్వేగానికి గురవుతున్నారు.

సోషల్​ మీడియాలో వైరల్​గా మారిన వీడియోని ఇక్కడ చూడండి :

తదుపరి వ్యాసం