మన శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు కూరగాయల నుంచి లభిస్తాయి.  అయితే ఈ కూరగాయలను పచ్చిగా తినాలా? ఉడికించి తినాలా? అనే చర్చ ఎప్పటి నుంచో జరుగుతోంది.  

pexels

By Bandaru Satyaprasad
Jul 09, 2024

Hindustan Times
Telugu

స్టీమింగ్ మినహా అన్ని వంట పద్ధతులు విటమిన్ సి, క్లోరోఫిల్ కు నష్టాన్ని కలిగించాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఉడికించిన ఆహారాలు ఆరోగ్యానికి మంచిదని నిపుణులు అంటున్నారు. ఉడికించిన కూరగాయల వల్ల ప్రయోజనాలు తెలుసుకుందాం.  

pexels

త్వరిత వంట పద్ధతి - ఇతర వంట పద్ధతులతో పోలిస్తే కూరగాయలను ఆవిరిపై ఉడికించడం సురక్షితమైన వంట పద్ధతి. కూరగాయలను స్టీమింగ్ చేయడానికి కేవలం కొన్ని నిమిషాలు పడుతుంది. వీటిల్లో పోషకాలకు నష్టం కలగదు.   

pexels

పోషకాల రిటైన్ - కూరగాయలలో ఉండే నియాసిన్, బీటా కెరోటిన్, పాంతోతేనిక్ యాసిడ్ అలాగే విటమిన్ సి వంటి చాలా పోషకాలను స్టీమింగ్ రిటైన్ చేస్తుంది. ఇవి నీటిలో కరిగేవి కాబట్టి ఉడికించినప్పుడు నీటి నుంచి తిరిగి శోషిస్తాయి.   

pexels

జీర్ణక్రియను సులభతరం- బ్రోకలీ, క్యాబేజీ, కాలీఫ్లవర్ వంటి కొన్ని కూరగాయలు జీర్ణక్రియను సులభం చేస్తాయి. ఉడికిస్తే కూరగాయలు మృదువుగా మారి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పట్టదు. పచ్చి కూరగాయలు జీర్ణ క్రియను ఆలస్యం చేస్తాయి.  

pexels

కూరగాయలను ఉడికించినప్పుడు వాటి రంగు, ఆకృతి మారదు. అతిగా స్టీమింగ్ చేస్తే రంగు మారతాయి. జీర్ణశక్తిని మెరుగుపరచడానికి స్టీమింగ్ వంట పద్ధతుల ద్వారా కొన్ని ఎంజైమ్‌లను యాక్టివేట్ చేయాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు.   

pexels

చాలా మంది తమ రోజును పచ్చి మొలకలు తినడంతో ప్రారంభిస్తారు. పచ్చిగా తినడం కంటే ఉడికించిన మొలకలు విటమిన్ సి లెవల్స్ పెంచుతాయని నిపుణులు అంటున్నారు.  ఇవి జీర్ణక్రియను 100 శాతం సురక్షితంగా చేస్తాయి.   

pexels

పచ్చి కూరగాయలు తింటే బ్యాక్టీరియా, కాలుష్యంతో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.  

pexels

నెట్‍ఫ్లిక్స్‌లో ఈనెల వచ్చిన టాప్-5 సినిమాలు