Healing baths: అదృష్టం, విజయం, ప్రేమ కోసం స్నానం చేసే నీటిలో వీటిని కలుపుకోండి-add these things to bath water you will get success love and luck ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Healing Baths: అదృష్టం, విజయం, ప్రేమ కోసం స్నానం చేసే నీటిలో వీటిని కలుపుకోండి

Healing baths: అదృష్టం, విజయం, ప్రేమ కోసం స్నానం చేసే నీటిలో వీటిని కలుపుకోండి

Gunti Soundarya HT Telugu
Jul 13, 2024 12:35 PM IST

Healing baths: జీవితంలో అదృశం, విజయం, ప్రేమను ఆకర్షించేందుకు స్నానం చేసే నీటిలో కొన్ని కలుపుకుంటే మంచిది. ఇది పురాతన కాలం నుంచి వస్తున్న సంప్రదాయం. ఇది ఆధ్యాత్మికతను కూడా పెంపొందిస్తుంది.

వీటిని స్నానం నీటిలో కలుపుకుంటే అదృష్టం, విజయం
వీటిని స్నానం నీటిలో కలుపుకుంటే అదృష్టం, విజయం (pixabay)

Healing baths: స్నానం చేయడం రోజువారి దినచర్యలో ఒక భాగం అని మాత్రమే అనుకుంటారు. కానీ పురాతన సంప్రదాయాలు దీనికి భిన్నంగా ఉంటాయి. స్నానం చేయడం అనేది ఒక ఆత్మ పరిశీలన చేసుకోవడానికి, తమతో సమయం గడిపేందుకు ఉపయోగపడుతుందని భావిస్తారు.

ఇది ఒక చికిత్స, ఆధ్యాత్మిక భావనను మేల్కొల్పుతుంది. స్నానం చేసే నీటిలో సరైన పదార్థాలు జోడించడం వల్ల మీ జీవితమే మారిపోతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏ వస్తువులు స్నానం చేసే నీటిలో కలుపుకుంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో చూద్దాం.

ఉప్పు

ఉప్పులో శుద్ధి చేసే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. స్నానం నీటిలో ఉప్పును కలుపుకొని చేయడం వల్ల ప్రతికూల శక్తులు, శరీరంలోని మలినాలు తొలగిపోతాయి. మీకు మంచి అనుభూతి కలుగుతుంది. అనేక సంస్కృతుల్లో ఆధ్యాత్మిక సాంప్రదాయాలలో ఉప్పు స్నానం ఒక భాగం. స్పష్టత, శాంతి, రక్షణ భావాన్ని ప్రోత్సహిస్తుందని నమ్ముతారు. సాధారణంగా స్నానం చేసే నీటిలో ఒక చిన్న కప్పు లేదా రెండు స్పూన్ల హిమాలయన్ ఉప్పు కలుపుకొని చేస్తే మంచిది. ఇలా చేయడం వల్ల ప్రతికూల శక్తి మీ శరీరంలో నుంచి బయటికి తొలగిపోతుంది.

అదృష్టం కోసం యాలుకలు

యాలకుల అదృష్టం, శ్రేయస్సుతో నిండి ఉంటాయని నమ్ముతారు. స్నానపు నీటిలో యాలకులు జోడించడం వల్ల జీవితంలో అదృష్టం, సానుకూల శక్తి లభిస్తుంది. మీ మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మంచి సువాసన కూడా వస్తుంది. కొన్ని యాలకులు తీసుకొని పొడి చేసుకొని వాటిని ఒక చిన్న కాటన్ క్లాత్ లో వేసి గోరువెచ్చని నీటిలో వేయాలి. నీరు కొద్దిగా రంగు మారి సువాసన వచ్చినప్పుడు ఆ నీటితో స్నానం చేయడం వల్ల అదృష్టం పొందుతారు.

దీర్ఘాయువు కొరకు పాలు

స్నానం చేసే నీటిలో పాలు కలుపుకొని చేయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది. ఇది పురాతన కాలం నాటి సాంప్రదాయం. అది మాత్రమే కాకుండా పాలు మంచి ఆరోగ్యం, దీర్ఘాయువుతో ముడిపడి ఉన్నాయి. స్నానం చేసే నీటిలో నాలుగు నుంచి ఆరు టేబుల్ స్పూన్ల పాలని జోడించడం వల్ల చర్మసంబంధిత సమస్యలతో పాటు ఆరోగ్యకరమైన దీర్ఘకాల జీవితాన్ని గడపవచ్చు అని నమ్ముతారు. కొద్దిగా నీటిలో పాలు వేసి బాగా కలపాలి. 20 నిమిషాల తర్వాత ఆ నీటితో స్నానం చేస్తే మంచిది. ఈ పాలతో స్నానం చేయడం వల్ల శరీరం నుంచి మలినాలు బయటకు పోతాయి.

సానుకూల శక్తి కోసం పసుపు

పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. కొన్ని సాంప్రదాయాల ప్రకారం పసుపును నీటిలో కలుపుకొని స్నానం చేయడం చాలా మందికి ఉన్న అలవాటు. స్నానం నీటిలో పసుపును జోడించడం వల్ల జీవితంలో సానుకూల శక్తి నిండుతుంది. ఒక బకెట్ నీటిలో ఒక టేబుల్ స్పూన్ పసుపు పొడి వేసి 15 నిమిషాలు అలాగే ఉంచాలి. అవి లేత పసుపు రంగులోకి మారిన తర్వాత స్నానం చేయాలి. ఆ తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకుంటే చాలా మంచిది.

విజయం కోసం గంధం

చాలామంది స్నానం చేసే ముందు శరీరానికి చందనం అప్లై చేసుకుంటారు. అయితే స్నానం చేసే నీటిలో చందనం వేసుకొని చేయడం వల్ల అంతర్గత శాంతి పెంపొందించడానికి, ఆధ్యాత్మిక అభ్యాసానికి ఉపయోగపడుతుంది. విజయాన్ని ఆకర్షిస్తుంది. గంధం నీటికి జోడించడం వల్ల మనసు కేంద్రీకృతం అవుతుంది. ఒత్తిడి తగ్గిపోతుంది. మీ లక్ష్యాలు సాధించేందుకు సహాయపడుతుంది. స్నానం నీటిలో కొన్ని చుక్కల గంధపు నూనె వేసుకుని చేయవచ్చు. ఇది చర్మానికి మంచి సువాసనను అందిస్తుంది.

ప్రేమ కోసం గులాబీ రేకులు

గులాబీ రేకులు స్నానం చేసే నీటిలో వేసుకోవడం వల్ల ప్రేమ, శృంగారంతో జీవితం నిండిపోతుంది. వాటి మృదువైన సువాసన మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. గులాబీ రేకులతో స్నానం చేస్తే చర్మం మృదువుగా మారేందుకు సహాయపడుతుంది. శ్రేయస్సును ఆకర్షించేందుకు ఉపయోగపడుతుంది. స్నానం నీటిలో కొన్ని తాజా గులాబీ రేకులు లేదా రోజ్ వాటర్ వేసుకొని చేయవచ్చు. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ప్రేమ ఆనందం నిండిపోతుంది .

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

Whats_app_banner