తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  'మహా' సంక్షోభానికి ముందు ఫడణవీస్​కు ఉద్ధవ్​ ఠాక్రే ఫోన్! తెరవెనుక ఏం జరిగింది?

'మహా' సంక్షోభానికి ముందు ఫడణవీస్​కు ఉద్ధవ్​ ఠాక్రే ఫోన్! తెరవెనుక ఏం జరిగింది?

Sharath Chitturi HT Telugu

17 July 2022, 17:55 IST

google News
    • Maharashtra political crisis : మహా సంక్షోభానికి ముందు దేవేంద్ర ఫడణవీస్​కు ఉద్దవ్​ ఠాక్రే ఫోన్​ చేసినట్టు తెలుస్తోంది. కీలక విషయంపై మాట్లాడినట్టు సమాచారం.
'మహా' సంక్షోభానికి ముందు ఫడణవీస్​కు ఉద్ధవ్​ ఠాక్రే ఫోన్! తెరవెనుక ఏం జరిగింది?
'మహా' సంక్షోభానికి ముందు ఫడణవీస్​కు ఉద్ధవ్​ ఠాక్రే ఫోన్! తెరవెనుక ఏం జరిగింది? (PTI)

'మహా' సంక్షోభానికి ముందు ఫడణవీస్​కు ఉద్ధవ్​ ఠాక్రే ఫోన్! తెరవెనుక ఏం జరిగింది?

Maharashtra political crisis : మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై ఇప్పటికీ అనేక ఊహాగానాలు బయటకొస్తూనే ఉన్నాయి. మాజీ సీఎం ఉద్ధవ్​ ఠాక్రేకు సంబంధించి ఇప్పుడు ఒక వార్త వైరల్​గా మారింది. ఆయన బీజేపీ నేత దేవేంద్ర ఫడణవీస్​తో మాట్లాడినట్టు వార్తలు వచ్చాయి. అసలేం జరిగిందంటే..

ఎందుకు ఫోన్​ చేశారు?

2019 ఎన్నికల అనంతరం బీజేపీతో సంబంధం తెంచుకుని బయటకు వచ్చేసింది శివసేన. సీఎం కూర్చీని పంచుకునేందుకు బీజేపీ అంగీకరించకపోవడమే ఇందుకు కారణం. ఆ తర్వాత.. ఎన్​సీపీ- కాంగ్రెస్​తో కలిసి మహా వికాస్​ అఘాడీని ఏర్పాటు చేసింది. ఉద్ధవ్​ ఠాక్రే సీఎంగా ప్రమాణం చేశారు.

దాదాపు మూడేళ్ల పాలన సాగిపోయింది. కానీ గత నెలలో శివసేనలో పెద్ద కుదుపు! పార్టీపై తీవ్ర అసంతృప్తితో బయటకొచ్చేశారు సీనియర్​ నేత ఏక్​నాథ్​ షిండే. గుజరాత్​లోని సూరత్​కు మకాం మార్చేశారు. ఎవరి ఫోన్లూ ఎత్తలేదు. ఆయనతో పాటు 10-11మంది ఎమ్మెల్యేలు కూడా వెళ్లారు. వారందరు.. అక్కడి నుంచి అసోంకు వెళ్లారు. వారికి రోజురోజుకు మద్దతు పెరిగింది. ఈ వ్యవహారం ముగిసే సమయానికి దాదాపు 40ఎమ్మెల్యేలు.. ఏక్​నాథ్​కు మద్దతుగా నిలిచారు.

Uddhav Thackerey : మరోవైపు ఉద్ధవ్​ ఠాక్రేకు నిద్రలేని రోజులు తప్పలేదు. పార్టీపై పట్టుకోల్పోయారు. ఒకరకంగా చెప్పాలంటే.. పార్టీ రెండుగా చీల్చిపోయింది. ఆయన స్థానం ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. చివరికి.. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఏక్​నాథ్​ షిండే. సీఎంగా ప్రమాణం చేశారు. మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్​.. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.

ఇదంతా అందరికి తెలిసిన విషయమే. కాగా.. ఇప్పుడు ఎవరికీ తెలియని విషయం ఒకటి బయటకొచ్చింది. మహా సంక్షోభానికి ముందు.. దేవేంద్ర ఫడణవీస్​కు ఉద్ధవ్​ ఠాక్రే ఫోన్​ చేసినట్టు సమాచారం.

ఏక్​నాథ్​ షిండే వ్యవహారంపై ఫడణవీస్​కు ఉద్ధవ్​ ఠాక్రే ఫోన్​ చేసినట్టు తెలుస్తోంది. ఏదైనా ఉంటే.. తనతో మాట్లాడాలని, పార్టీ మొత్తాన్ని తీసుకొస్తానని ఉద్ధవ్​ చెప్పినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఏక్​నాథ్​ షిండేకు మద్దతివ్వకూడదని ఉద్ధవ్​ అన్నట్టు వెల్లడించాయి. కానీ ఉద్ధవ్​ను బీజేపీ పట్టించుకోలేదు!

ఆ తర్వాత.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి అమిత్​ షాతో మాట్లాడేందుకు ఉద్ధవ్​ ఠాక్రే ప్రయత్నించినట్టు తెలుస్తోంది. కానీ వారెవ్వరు.. ఆ అవకాశం ఇవ్వలేదు!

2019లో ఇదే జరిగింది! మహా వికాస్​ అఘాడీ ఏర్పాటుకు కొన్ని రోజుల ముందు.. ఉద్ధవ్​ ఠాక్రేను సంప్రదించేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నించినట్టు అప్పట్లో వార్తలొచ్చాయి. ఆ సమయంలో బీజేపీని ఉద్ధవ్​ ఠాక్రే పట్టించుకోలేదని సమాచారం. ఇప్పుడు ఉద్ధవ్​ ఠాక్రేకు అదే పరిస్థితి ఏర్పడింది. ఈ వార్తలే నిజమైతే.. ఒకరకంగా.. ఉద్ధవ్​ ఠాక్రేపై బీజేపీ రివేంజ్​ తీర్చుకున్నట్టే..!

తదుపరి వ్యాసం