తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Maharashtra Cm : సోమవారమే బలపరీక్ష.. కొత్త సీఎం​ సిద్ధమేనా?

Maharashtra CM : సోమవారమే బలపరీక్ష.. కొత్త సీఎం​ సిద్ధమేనా?

Sharath Chitturi HT Telugu

01 July 2022, 13:42 IST

google News
    • Maharashtra CM : మహారాష్ట్రలో బలపరీక్షకు ఏక్​నాథ్​ షిండే సిద్ధమవుతున్నారు. సోమవారం బలపరీక్ష జరగనుంది.
ఏక్​నాథ్​ షిండే- దేవేంద్ర ఫడణవీస్​
ఏక్​నాథ్​ షిండే- దేవేంద్ర ఫడణవీస్​ (HT_PRINT)

ఏక్​నాథ్​ షిండే- దేవేంద్ర ఫడణవీస్​

Maharashtra CM : మహారాష్ట్ర రాజకీయ ఉత్కంఠ ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే రాష్ట్ర సీఎంగా శివసేన కీలక నేత ఏక్​నాథ్​ షిండే ప్రమాణ చేసేశారు. కాగా.. సోమవారం ఆయన అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కోనున్నారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే.. బలపరీక్షలో ఆయన గెలవడం సులభమే!

ఏక్​నాథ్​ షిండే బలపరీక్ష కోసం ఆది, సోమవారాల్లో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించనున్నారు. వాస్తవానికి ఇది శని, ఆదివారాల్లో జరగాల్సి ఉంది. వాటిని ఒక రోజు మార్చారు. ఇక శనివారం కొత్త స్పీకర్​ నామిషన్​ ప్రక్రియ ఉంటుంది.

మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. శివసేనకు 55, ఎన్​సీపీకి 54, కాంగ్రెస్​కు 44 సీట్లు దక్కాయి. ఫలితంగా మహా వికాస్​ అఘాడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇక ఇప్పుడు ఆ 55మందిలో 39మంది శివసేన ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉందని ఏక్​నాథ్​ షిండే చెబుతున్నారు. సోమవారం జరిగే బలపరీక్షలే ఇదే నిరూపితమైతే.. ఏక్​నాత్​ షిండే గెలవడమే కాదు.. ఉద్ధవ్​ ఠాక్రే ఓటమి కూడా లాంఛనంగా ఖారారైనట్టే! సీఎంగా రాజీనామా చేసిన సమయంలో.. శాసన మండలి సభ్యుడిగా కూడా తప్పుకున్నారు ఉద్దవ్​ ఠాక్రే. శివసేన అధ్యక్షుడిగా కొనసాగుతానని చెప్పారు. కానీ ఇప్పుడు బలపరీక్షలో విజయం సాధిస్తే.. 'శివసైనికులు' ఏక్​నాథ్​ పక్షాన ఉన్నట్టు రుజువవుతుంది. ఉద్ధవ్​ ఠాక్రే.. తన పార్టీని కోల్పోయే ప్రమాదం ఉంటుంది.

సుప్రీంకోర్టుకు ఉద్ధవ్​ ఠాక్రే..

మరోవైపు ఉద్ధవ్​ ఠాక్రే బృందం మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్లింది. బీజేపీ చేతుల్లో కీలుబొమ్మలుగా ఉంటూ అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యేలను శాసనసభ కార్యకలాపాలకు అనుమతించకూడదని సర్వోన్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసింది. వాళ్లకి అసెంబ్లీలో కొనసాగే నైతిక అర్హత లేదని ఆరోపించింది.

ఈ పిటిషన్​పై సుప్రీంకోర్టు జులై 11న విచారించే అవకాశం ఉంది.

తదుపరి వ్యాసం