Maharashtra CM : బీజేపీ భారీ 'స్కెచ్'.. అందుకే ఏక్నాథ్ షిండేకు సీఎం పదవి!
Maharashtra CM : మహారాష్ట్ర సీఎంగా ఏక్నాథ్ షిండే ప్రమాణం చేయడంతో అందరు షాక్‌కు గురయ్యారు. బీజేపీ నేత దేవేంద్ర ఫడణవీస్ ఆ బాధ్యతలు చేపడతారని భావించడమే ఇందుకు కారణం. కానీ దీని వెనుక బీజేపీ భారీ స్కెచ్ వేసినట్టు కనిపిస్తోంది.
Maharashtra CM : అనుకున్నట్టుగానే మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కుప్పకూలింది. శివసేన కీలక నేత ఏక్నాథ్ షిండే ప్లాన్స్ ఫలించాయి. బీజేపీ ఆనందానికి అవధులే లేవు. కానీ మహారాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తున్న వారికి ఊహించని విధంగా ట్విస్ట్ ఎదురైంది. బీజేపీ కీలక నేత దేవేంద్ర ఫడణవీస్.. సీఎం కుర్చీలో కూర్చుంటారు అని అనుకుంటే.. ఆ స్థానంలో ఏక్నాథ్ వచ్చి చేరారు. ఫడణవీస్‌కు ఇష్టం లేకపోయినా.. ఆయనకు డిప్యూటీ సీఎం పదవిని ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఏక్నాథ్ను సీఎం చేయడంతో బీజేపీ భారీ స్కెచ్ వేసినట్టే తెలుస్తోంది. అదేంటంటే..
ఏక్నాథ్.. అందుకే!
శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేను దెబ్బతీసేందుకే.. ఏక్నాథ్ను సీఎం చేసినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే ఉద్ధవ్ ఠాక్రేకు పెద్దగా ఆప్షన్లు లేవు. భవిష్యత్తులో ఉద్ధవ్ నుంచి ఏక్నాథ్ షిండే.. పార్టీని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకునే అవకాశాలను కొట్టిపారేయలేము.
Eknath Shinde cm : పార్టీని స్థాపించిన నాటి నుంచి.. శివసేనకు అంతా 'ఠాక్రే' కుటుంబమే. వారి చేతుల్లో పార్టీ అధికారాలు ఉండేవి. ఆ కుటుంబం ఏం చెబితే అది జరగాల్సిందే! ఇక ఏక్నాథ్ షిండేను సీఏం చేయడంతో.. 'ఠాక్రే' కుటుంబం నుంచి శివసేనను తీసేయాలని కమలదళం వ్యూహం రచించినట్టు ఊహాగానాలు జోరందుకున్నాయి.
మరోవైపు ఏక్నాథ్ షిండేను సీఎం చేసి, ఉద్ధవ్ ఠాక్రేపై బీజేపీ రివేంజ్ తీర్చుకుందని చెప్పుకోవచ్చు. 2019 వరకు బీజేపీ మిత్రపక్షంగానే ఉన్న శివసేన.. ఆ తర్వాత అనూహ్యంగా జెండా ఎత్తేసింది! సీఎం కుర్చీ విషయంలో గొడవలతో కూటమి నుంచి వైదొలిగింది. అప్పటి నుంచి ఉద్ధవ్ ఠాక్రేపై ఆగ్రహంతో ఉన్న బీజేపీ.. సరైన సమయం చూసి కోలుకోలేని దెబ్బతీసింది అని రాజకీయ విశ్లేషకుల భావన.
Devendra Fadnavis news : 'ఠాక్రేలు లేకుండా శివసేనను ఊహించలేరు' అన్న స్థాయి నుంచి ‘శివసేనలో ఠాక్రేలు ఉంటారా?’ అన్న పరిస్థితులు ఏర్పడ్డాయి. వాస్తవానికి.. శివసేన అంతర్గత గొడవలతోనే ఇది జరిగినా.. ఈ పూర్తి వ్యవహారం బీజేపీకి కలిసివచ్చేదే. రాష్ట్రంలో బీజేపీ, తన పట్టుసాధించుకునేందుకు పని మరింత సులభమైపోయింది. ఇక రాష్ట్రంలో అసలు పోరు ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేనల మధ్యే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అధికార దాహం లేదు..!
మహా వికాస్ ఆఘాడీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ సర్వ ప్రయత్నాలు చేస్తోందని.. మూడేళ్లుగా ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఇక ప్రభుత్వం కూలిన అనంతరం బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్.. ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టడం ఖాయం అని అందరు భావించారు. ఇదే జరిగి ఉంటే.. బీజేపీ ప్లాన్లతోనే మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కుప్పకూలిందని అందరు ఫిక్స్ అయ్యేవారు.
Uddhav Thackeray resign : ఇక ఏక్నాథ్ను సీఎం చేయడంతో ఆ ఆరోపణలను బీజేపీ తిప్పికొట్టింది! తమకు అధికార దాహం లేదని నిరూపించుకునే ప్రయత్నం చేసింది. ఇక దేవేంద్ర ఫడణవీస్‌ను డిప్యూటీ సీఎం కూర్చీలో కూర్చొబెట్టి.. మహా వికాస్ అఘాడీ పతనానికి తాము బాధ్యులము కాదు అని తేల్చిచెప్పేసింది.
సంబంధిత కథనం