Kolkata Durga Puja : అమ్మవారి ముందు రివీలింగ్ దుస్తులతో ఫొటోలు.. ‘కామెన్ సెన్స్ లేదా?’
12 October 2024, 8:30 IST
- Durga Puja pandal viral photo : కోల్‌కతాలోని ఓ దుర్గా పూజ మండపం వద్ద ఓ మోడల్, ఆమె స్నేహితురాళ్లు దిగిన ఫొటో ఒకటి వైరల్‌గా మారింది. వారు రివీలింగ్ దుస్తులు ధరించి అమ్మవారి ముందు ఫొటోలు దిగారు. ఇది చాలా మందికి నచ్చలేదు.
అమ్మవారి ముందు రివీలింగ్ దుస్తులు ధరించి..
కోల్‌కతాకు చెందిన ఓ మోడల్, ఆమె స్నేహితురాళ్లు రివీలింగ్ దుస్తులు ధరించి అమ్మవారి దర్శనానికి వెళ్లారు. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారయి. ఫలితంగా వారిపై అనేక మంది విమర్శలు చేస్తున్నారు. అసలేం జరిగిందంటే..
అమ్మవారి ముందు రివీలింగ్ దుస్తులతో ఫొటోలు..
పశ్చిమ్ బెంగాల్లో దుర్గా పూజ అత్యంత ఘనంగా జరుగుతుంది. కోల్‌కతాలో వేడుకలు తారస్థాయిలో ఉంటాయి. వీటి మధ్య ఓ మోడల్ రివీలింగ్ దుస్తులు ధరించి, మండపం వద్దకు వెళ్లడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ‘డ్రెస్సింగ్ సెన్స్’పై చర్చ జరుగుతోంది. నగరంలోని దుర్గా పూజ మండపం వద్దకు ఆ కోల్‌కతా మోడల్ క్లీవేజ్-బేరింగ్ క్రాప్ టాప్వేసుకుని వెళ్లింది. మిస్ కోల్‌కతా 2016 టైటిల్ విజేతగా చెప్పుకుంటున్న హేమశ్రీ భద్ర తన దుస్తులపై సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురైంది.
కోల్‌కతాలోని దుర్గాపూజ మండపంలో మరో ఇద్దరు స్నేహితులతో కలిసి దిగిన ఫొటోలను హేమశ్రీ భద్ర తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆమె స్నేహితురాళ్లల్లో ఒకరు థై- హై స్లిట్తో కూడిన లాంగ్ బ్లాక్ గౌన్ ధరించింది. మరొకరు ఆరెంజ్ కలర్ మినీ డ్రెస్ ధరించి మోకాలి పొడవు బూట్లు వేసుకుని కనిపించింది. మతపరమైన ప్రదేశంలో ఈ ముగ్గురు మహిళలు అనుచితంగా దుస్తులు ధరించారని సోషల్ మీడియా యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మూడు దుస్తులను “అసభ్యంగా”, "అశ్లీలంగా" పరిగణిస్తున్నారు.
మహిళల దుస్తులపై ఆగ్రహం..
ఈ మూడు దుస్తులు అనుచితంగా ఉన్నాయని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో విమర్శలు వెల్లువెత్తున్నాయి. సామాజిక కార్యకర్త దీపికా భరద్వాజ్ సహా పలువురు ఎక్స్‌లో షేర్ చేసిన ఈ ఫొటోకు పదుల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి.
"నన్ను తిట్టండి, కానీ ఇది పూర్తిగా మూర్ఖత్వం," అని ఒక ఎక్స్ యూజర్ రాశారు.
"ప్రతి ఒక్కరికీ వారు కోరుకున్న విధంగా దుస్తులు ధరించే హక్కు ఉందని నాకు తెలుసు. కానీ మీరు ఆలయాన్ని సందర్శించినప్పుడు దానికి అనుగుణంగా దుస్తులు ధరించడం బేసిక్ కామన్ సెన్స్ కాదా?" అని మరొక వ్యక్తి ప్రశ్నించారు.
"ఎంత ఆధునికంగా లేదా ఓపెన్ మైండెడ్‌గా ఉన్నప్పటికీ, దేవాలయాలు వంటి పవిత్ర ప్రదేశాలలో ఇలాంటి దుస్తులను వేసుకోవడం అనేది నేను కూడా ఇష్టపడను. దీన్ని ఆమోదించను" అని ఒక ఎక్స్ యూజర్ అంగీకరించారు.
వాస్తవానికి ఈ ఫొటోను తొలుత చూస్తే ఎడిటెడ్‌గా అనిపిస్తుందని, కానీ అది నిజమైన ఫొటో అని తెలిసి ఆశ్చర్యపోతున్నామని పలువురు అభిప్రాయపడుతున్నారు.
"మొదట్లో ఇది ఎడిటెడ్ ఫొటో అనుకున్నాను. కానీ అది నిజమైన ఫొటో. వీటిని సమాజం ఎలా అనుమతిస్తుంది?' అని ఓ ఎక్స్ యూజర్ ప్రశ్నించారు.
అయితే ఈ మోడల్స్‌కి మద్దతిస్తూ కామెంట్ చేసిన వారూ ఉన్నారు!
“బట్టలు అసభ్యంగా ఉన్నాయని ఏడ్చే వారు, శాస్త్రాల ప్రకారం దేవుడు అన్ని చోట్లా ఉన్నాడని గుర్తుంచుకోవాలి. అందువల్ల మండపంలో ఫలానా దుస్తులు ధరించకూడదు అన్న మాటల్లో అర్థం లేదు. మీరు ఎక్కడ, ఏం ధరించినా ప్రతిదీ భగవంతుడు చూడగలడు. మీకు నచ్చినది ధరించండి. దేవుడు పట్టించుకోడు,” అని మరొకరు కౌంటర్ ఇచ్చారు.
ఈ ఫోటో వైరల్ కావడంతో మోడల్ సైతం స్పందించి తన వాదనను చెప్పింది.
“అక్కడ డ్రెస్ కోడ్ లేదు. మేము కళ్లకు కనిపించని జీవులం కాదు. మేము వేదికలోకి ఎగురుకుంటూ వెళ్లలేదు. వారు (సెక్యూరిటీ అండ్ పెండల్ అడ్మినిస్ట్రేషన్) మమ్మల్ని చూసిన తర్వాతే ఇలా లోపలికి అనుమతించారు. ఎవరికైనా నచ్చకపోతే అది మా బాధ్యత ఎలా అవుతుంది?,” అని ఆమె ప్రశ్నించింది.