తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Dressing Tips : బొద్దుగా ఉండేవాళ్లు పొడుగ్గా, సన్నగా కనిపించేందుకు ఇలా డ్రెస్ చేసుకోండి

Dressing Tips : బొద్దుగా ఉండేవాళ్లు పొడుగ్గా, సన్నగా కనిపించేందుకు ఇలా డ్రెస్ చేసుకోండి

Anand Sai HT Telugu

24 February 2024, 10:00 IST

    • How To Look Slim : మనం వేసుకునే డ్రెస్సులతో అందంగా కనిపిస్తాం. అలాగే కొందరు బొద్దుగా ఉన్నవారు పొడుగ్గా, సన్నగా కనిపించేందుకు కొన్ని చిట్కాలు పాటించాలి.
డ్రెస్సింగ్ చేసుకునేందుకు చిట్కాలు
డ్రెస్సింగ్ చేసుకునేందుకు చిట్కాలు (Unsplash)

డ్రెస్సింగ్ చేసుకునేందుకు చిట్కాలు

అందరూ ఒకేలా ఉండలేరు. ఒక్కొక్కర శరీరం ఒక్కోరకం. శరీరం అందంగా కనిపించాలంటే మనం వేసుకునే డ్రెస్సింగ్ మీదనే ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమ సొంత కోణంలో అందంగా కనిపించాలనుకుంటారు. కానీ బొద్దుగా ఉండేవాళ్లకు మాత్రం సమస్యలు వస్తుంటాయి. ఎలాంటి డ్రెస్ వేసినా లావుగా కనిపిస్తుంటామని బాధపడిపోతుంటారు. దీంతో పొట్టిగా కనిపిస్తారు. పొడుగ్గా, నాజూగ్గా ఉండాలని కోరుకుంటారు. అయితే అందరికీ ఒకే రకమైన బాడీ ఉండదు. మీ డ్రెస్సింగ్‌తో మీరు పొడవుగా, సన్నగా కనిపించవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

Cherakurasam Paramannam: పంచదారకు బదులు చెరుకు రసంతో పరమాన్నాన్ని వండి చూడండి, ఎంతో ఆరోగ్యం

Garlic Peel: వెల్లుల్లిని పొట్టు తీసి వాడుతున్నారా? ఎన్ని పోషకాలను నష్టపోతున్నారో తెలుసా?

World Hypertension Day 2024: ఇవి కూడా హైబీపీ లక్షణాలే, కానీ చాలా మందికి తెలియవు

Gongura Chepala Pulusu: గోంగూర రొయ్యల్లాగే గోంగూర చేపల పులుసు వండి చూడండి, రుచి మామూలుగా ఉండదు

మీ బట్టలు, ఉపకరణాలలో కొన్ని మార్పులు చేయడం ద్వారా మిమ్మల్ని మీరు సన్నగా, పొడవుగా కనిపించేలా చేసుకోవచ్చు. మీ దుస్తుల కలర్, వాటి పొడవు, కేశాలంకరణ నుండి మీ పాదరక్షల వరకు మీ దుస్తులకు సంబంధించిన ప్రతిదీ మీ రూపాన్ని మార్చగలదు. ఎలాంటి డ్రెస్ వేసుకుంటే బొద్దుగా ఉన్నవారు సన్నగా, పొడవుగా కనిపిస్తారో చూద్దాం..

చారల చొక్కా బెస్ట్

నిలువుగా చారల చొక్కా, ప్యాంటు ఇతరుల చూపులను ఆకర్శిస్తుంది. ఇది పై నుండి కిందికి కంటికి ఒక భ్రమను కలిగిస్తుంది. చూసేవారికి మనం పొడుగ్గా కనిపిస్తుంటాం. ఇది మిమ్మల్ని పొడవుగా, సన్నగా కనిపించేలా చేస్తుంది. మహిళలకు కూడా ఇలాంటి డ్రెస్సులో మార్కెట్లో దొరుకుతున్నాయి.

మోనోక్రోమ్ దుస్తులు

మోనోక్రోమాటిక్ లేదా టోనల్ డ్రెస్సింగ్ అనేది స్లిమ్‌గా రూపాన్ని సృష్టించడానికి ఒక గొప్ప మార్గం. పై నుండి కిందికి ఒకే రంగును ఉపయోగించడం ఇతరుల చూపులతో ఆకర్శించడానికి మరొక మార్గం. ఈ రకమైన దుస్తులను ధరించినప్పుడు అందరినీ మీరు ఆకర్శించవచ్చు. ఇది మిమ్మల్ని పొడవుగా, సన్నగా కనిపించేలా చేస్తుంది.

ప్యాంట్ పైకి లాగండి

వేసుకున్న ప్యాంటు పైకి లాగితే కూడా ఉపయోగం ఉంటుంది. నడుము పైన తక్కువ శరీర వస్త్రాన్ని ధరించడానికి ఇది ఒక గొప్ప సూచన. ఇలా డ్రెస్సింగ్ చేసుకుంటే మీ కాళ్లు పొడవుగా అగుపిస్తాయి.

బెల్డ్ ధరిస్తే మంచిది

బెల్ట్ ధరించడం కూడా మీరు పొడవుగా, నాజుగ్గా కనిపించేలా చేస్తుంది. మీ నడుము చుట్టూ బెల్ట్ ధరించడం వలన ఇతరుల దృష్టి అక్కడికే వెళ్తుంది. మీ శరీరంలోని నడుము భాగంపై దృష్టిని ఆకర్షించేలా చేయవచ్చు. బెల్డ్ ధరిస్తే మీ కాళ్లు పొడవుగా కనిపిస్తాయి. తద్వారా మీరు సన్నగా, పొడవుగా కనిపిస్తారు. అయితే బెల్ట్ కూడా లావుగా ఉండేది ధరించకూడదు. సన్నని బెల్ట్‌ను ఎంచుకోవాలి. లేకుంటే లుక్ పూర్తిగా తప్పుగా మారుతుంది. ఇది మిమ్మల్ని సన్నగా కాకుండా బొద్దుగా కనిపించేలా చేస్తుంది.

ఫ్లేర్డ్ జీన్స్ మిమ్మల్ని పొడవుగా, సన్నగా కనిపించేలా చేస్తుంది. మీ తుంటితో పోల్చితే ఇది చాలా వెడల్పుగా ఉంటుంది. కాస్త లూజ్‌గా కనిపించినా.. ఇది మీ లుక్ ను మెుత్తం మార్చేస్తుంది. సన్నగా కనిపించేలా చేస్తుంది.

సరైన షూలు వేసుకోవాలి. పాయింటెడ్ హీల్ అయినా లేదా వేరే ఆకారంలో ఉన్న ఏదైనా షూ అయినా మీ స్కిన్ టోన్‌కి సరిపోలాలి. ఈ ట్రిక్ మిమ్మల్ని పొడవుగా కనిపించేలా చేస్తుంది. హీల్స్ వేసుకున్నప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి.

V నెక్ డ్రెస్సులు తప్పనిసరి

V-నెక్ మీరు పొడవుగా కనిపించేలా చేయడానికి ఎంచుకోవాల్సిన వాటిలో ఒకటి. ఇది మిమ్మల్ని ఎత్తుగా కనిపించడమే కాకుండా సన్నగా కనిపించేలా చేస్తుంది. పెద్ద గడ్డం, భుజాలు ఎక్కువగా ఉండేవాడు కచ్చితంగా దీన్ని ప్రయత్నించాలి. స్లిమ్‌గా కనిపించడానికి మరొక సులభమైన మార్గం మీ నడుము దాచడానికి మీ చొక్కాను టక్ చేయడం, ఇది మీరు సన్నగా కనబడేలా చేస్తుంది.

తదుపరి వ్యాసం