iPhone 16 launch : ఐఫోన్​ 16 సిరీస్ మోడల్స్​- వాటి ఫీచర్స్​.. పూర్తి వివరాలివే..-iphone 16 series new airpods and everything else announced at apple event 2024 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Iphone 16 Launch : ఐఫోన్​ 16 సిరీస్ మోడల్స్​- వాటి ఫీచర్స్​.. పూర్తి వివరాలివే..

iPhone 16 launch : ఐఫోన్​ 16 సిరీస్ మోడల్స్​- వాటి ఫీచర్స్​.. పూర్తి వివరాలివే..

Sharath Chitturi HT Telugu
Sep 10, 2024 06:01 AM IST

యాపిల్ సంస్థ తన కొత్త ఐఫోన్ 16 సిరీస్, యాపిల్​ వాచ్​ సిరీస్ 10, ఎయిర్​పాడ్స్​ 4 ని తన ఈవెంట్​లో లాంచ్​ చేసింది. ఈ నేపథ్యంలో ఐఫోన్​ 16 సిరీస్​ స్మార్ట్​ఫోన్స్​, వాటి ఫీచర్స్​తో పాటు ఇతర గ్యాడ్జెట్స్​కి చెందిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

యాపిల్​ గ్లోటైమ్​ ఈవెంట్​ హైలైట్స్​..
యాపిల్​ గ్లోటైమ్​ ఈవెంట్​ హైలైట్స్​.. (Apple)

నెలల తరబడి ఊహాగానాలు, లీక్స్​ అనంతరం యాపిల్​ ఐఫోన్​ 16 సిరీస్​ లాంచ్​ అయ్యింది. గ్లోటైమ్​ 2024 ఈవెంట్​లో ఐఫోన్​ 16 సిరీస్​ స్మార్ట్​ఫోన్స్​తో పాటు యాపిల్​ వాచ్​ సిరీస్ 10, ఎయిర్​పాడ్స్​ 4, మరెన్నో అప్​గ్రేడ్స్​, స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, సాఫ్ట్​వేర్​, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అప్డేట్స్​ బయటకు వచ్చాయి. గత ఏడాది మాదిరిగానే కొత్త తరం ఐఫోన్లలో ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ అనే నాలుగు మోడళ్లు ఉన్నాయి. కానీ కొత్త విషయం ఏమిటంటే.. యాపిల్ ఏ 18 సిరీస్​తో కొత్త చిప్​సెట్​ను ఇంటిగ్రేట్ చేసింది. కొత్త “కెమెరా కంట్రోల్ బటన్”ని ఈ స్మార్ట్​ఫోన్స్​కి యాడ్​ చేసింది. ఈ నేపథ్యంలో యాపిల్​ గ్లోటైమ్​ ఈవెంట్​ హైలైట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు

ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ కొత్త డిజైన్, యాక్షన్ బటన్, కెమెరా కంట్రోల్ బటన్​తో లాంచ్ అయ్యాయి. ఇంతకుముందు లీకైనట్లుగా, ఈ స్మార్ట్​ఫోన్స్​ వర్టికల్ కెమెరా మాడ్యూల్​ని కలిగి ఉన్నాయి. ఇవి సరికొత్త రూపాన్ని ఇస్తాయి. స్టాండర్డ్ ఐఫోన్ 16 మోడళ్లు సెకండ్ జనరేషన్ 3ఎన్ఎమ్ చిప్​తో తయారు చేసిన ఏ18 చిప్​సెట్​తో పనిచేస్తాయి. రాబోయే యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లకు మద్దతు ఇవ్వడానికి ఈ చిప్​సెట్​ 16-కోర్ న్యూరల్ ఇంజిన్​ని అందిస్తుంది.

ఫోటోగ్రఫీ కోసం, ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరాను కలిగి ఉన్నాయి. కొత్త కెమెరా ప్లేస్మెంట్ యాపిల్ విజన్ ప్రో హెడ్​సెట్​లో ప్లేబ్యాక్ కోసం స్పేషియల్​ ఫోటోలు, వీడియోలను క్యాప్చర్ చేసే సామర్థ్యాన్ని ఈ స్మార్ట్​ఫోన్స్​కి ఇస్తుంది.

ఐఫోన్​ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు..

ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ కూడా ఇంతకుముందు ఊహించినట్లుగానే 6.3 ఇంచ్​, 6.9 ఇంచ్​ భారీ డిస్​ప్లేలతో విడుదలయ్యాయి. కొత్త ప్రో మోడళ్లు స్లిమ్​ బెజెల్స్, టైటానియం ఫ్రేమ్​లతో కొత్త బ్లాస్ట్ ఫినిషింగ్​తో వస్తాయి. కొత్త తరం ఐఫోన్ ప్రో మోడళ్లలో కొత్త 16-కోర్ న్యూరల్ ఇంజిన్​తో కూడిన ఏ18 ప్రో చిప్​సెట్ ఉంది. ఇది ఏ17 ప్రో చిప్​ కంటే 15% వేగంగా ఏఐ ఆధారిత పనులను పూర్తిచేస్తుందని సమాచారం.

ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ వేగవంతమైన క్వాడ్-పిక్సెల్ సెన్సార్​తో కొత్త 48 ఎంపీ ఫ్యూజన్ కెమెరాను కలిగి ఉన్నాయి. 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 5ఎక్స్ టెలిఫోటో కెమెరా, లెన్స్​ల మధ్య జూమింగ్ లేదా స్విచ్చింగ్ వంటి వాటిని నిర్వహించడానికి హాప్టిక్ ఫీడ్ బ్యాక్ ఫీచర్, టచ్ కంట్రోల్స్​తో వచ్చే కొత్త "కెమెరా కంట్రోల్" బటన్​తో కెమెరాను కంట్రోల్​ చేయగలగడం హైలైట్​!

ఇండియాలో ఐఫోన్​ 16, ఐఫోన్​ 16 ప్లస్​, ఐఫోన్​ 16 ప్రో, ఐఫోన్​ 16 ప్రో మ్యాక్స్​ ధరల వివరాలను తెలుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

యాపిల్​ వాచ్​ సిరీస్ 10..

యాపిల్​ గ్లోటైమ్​ ఈవెంట్​లో లాంచ్​ అయిన మరో ఆసక్తికర గ్యాడ్జెట్​ ఈ యాపిల్​ వాచ్​ సిరీస్​ 10. ఇది అతిపెద్ద డిస్​ప్లే, స్లిమ్​ వాచ్ డిజైన్​ కలిగి ఉంది. ఇది స్మార్ట్​వాచ్​ని మరింత ప్రీమియంగా చేస్తుంది. ఈ వాచ్ థిక్​నెస్​ 9.7 మిల్లీమీటర్లుగా ఉందని , మునుపటి మోడల్​తో పోల్చితే ఇది 10% సన్నగా, 20% తక్కువ బరువు కలిగి ఉంటుందని యాపిల్ వెల్లడించింది. కొత్త యాపిల్​ వాచ్​ స్పీకర్ ప్లేబ్యాక్ ఫీచర్​ని అందిస్తుంది. వినియోగదారులు మణికట్టు నుంచి నేరుగా సంగీతాన్ని వినొచ్చు. యాపిల్​ వాచ్​ సిరీస్ 10 18 గంటల బ్యాటరీ లైఫ్​ని అందిస్తుంది. ఇది టైడ్స్ యాప్, డెప్త్ యాప్స్​తో వస్తుంది.

కొత్త యాపిల్​ వాచ్​ సిరీస్ 10 ప్రారంభ ధర $ 399గా ఉంది. అంటే రూ. 33,508!

యాపిల్​ ఎయిర్​పాడ్స్​ 4..

యాపిల్​ ఎయిర్​పాడ్స్​ 4కి చెందిన రెండు మోడళ్లను కూడా ఈ టెక్​ సంస్థ ప్రకటించింది. ఇందులో.. ఏఎన్​సీకి తొలిసారి సపోర్ట్ చేసే వేరియంట్ కూడా ఉంది. యాపిల్ ఎయిర్ 4 కొత్త హెచ్ 2 చిప్​తో పనిచేస్తుంది. ఇది హెడ్ జెస్చర్స్​, వాయిస్ ఐసోలేషన్ వంటి అధునాతన ఫీచర్లతో ఇంటెలిజెంట్ ఆడియో అనుభవాలను అందిస్తుంది. ఇయర్ బడ్​పై ఫాస్ట్​ ట్యాప్​తో మీడియాను ప్లే చేయడానికి లేదా పాజ్ చేయడానికి వినియోగదారులను అనుమతించే కొత్త ఫోర్స్ సెన్సార్ కూడా ఇందులో ఉంది.

Whats_app_banner