iPhone 16 price in India : ఇండియాలో ఐఫోన్​ 16 సిరీస్​ స్మార్ట్​ఫోన్స్​ ధరలు ఇవే..-iphone 16 series price in india see how much new smartphones cost and their release date ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Iphone 16 Price In India : ఇండియాలో ఐఫోన్​ 16 సిరీస్​ స్మార్ట్​ఫోన్స్​ ధరలు ఇవే..

iPhone 16 price in India : ఇండియాలో ఐఫోన్​ 16 సిరీస్​ స్మార్ట్​ఫోన్స్​ ధరలు ఇవే..

Sharath Chitturi HT Telugu
Sep 10, 2024 06:02 AM IST

iPhone 16 price in india : భారతదేశంలో ఐఫోన్ 16, ఐఫోన్​ 16 ప్లస్​ ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్​ 16 ప్రో మ్యాక్స్​ వేరియంట్లు, వాటి ధరల వివరాలు బయటకు వచ్చాయి. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఐఫోన్​ 16 సిరీస్​ వేరియంట్లు, వాటి ధరలు..
ఐఫోన్​ 16 సిరీస్​ వేరియంట్లు, వాటి ధరలు.. (Apple)

ఈ ఏడాది మచ్​ అవైటెడ్​ ఐఫోన్​ 16 సిరీస్​ని ‘గ్లోటైమ్​’ ఈవెంట్​లో లాంచ్​ చేసింది దిగ్గజ టెక్​ సంస్థ యాపిల్​. ఐఫోన్​ 16తో పాటు యాపిల్​ వాచ్​ సిరీస్ 10, ఎయిర్​పాడ్స్​ 4ని ప్రకటించింది. కానీ మొత్తం ఈవెంట్​లో ఐఫోన్​ 16 హైలైట్​గా నిలిచిందనడంలో సందేహమే లేదు. ఏ18 సిరీస్​ ప్రాసెసర్​, కొత్త కెమెరా ఫీచర్స్​, ఆర్టిఫీషియెల్​ ఇంటెలిజెన్స్​ ఫీచర్స్​ ఉండటంతో ఐఫోన్​ 16 హైలైట్​గా మారింది. ఫలితంగా భారతదేశంలో ఐఫోన్ 16 సిరీస్ ధరల గురించి వినియోగదారుల్లో ఆసక్తిగా మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో ఐఫోన్​ 16 సిరీస్​ స్మార్ట్​ఫోన్స్​, వాటి స్టోరేజ్​ వేరియంట్లు, వాటి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

భారతదేశంలో ఐఫోన్ 16, ఐఫోన్​ 16 ప్లస్ ధరలు..

ఐఫోన్ 16 ధర: వెనీలా ఐఫోన్ 16 మూడు స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది0 128 జీబీ, 256 జీబీ, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్. ప్రారంభ ధర రూ.79900 నుంచి రూ.109900 వరకు వెళుతుంది.

ఐఫోన్​ 16 ప్లస్ ధర: భారత్​లో ఐఫోన్ 16 ప్లస్ 128 జీబీ, 256 జీబీ, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. ప్లస్ వేరియంట్ ప్రారంభ ధర రూ.89,900 నుంచి రూ.119,900 వరకు వెళుతుంది.

ఇదీ చూడండి:- ఇక బీమా ప్రీమియంలపై తగ్గనున్న పన్ను.. తదుపరి జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో నిర్ణయం!

భారత్​లో ఐఫోన్ 16 ప్రో, 16 ప్రో మ్యాక్స్ ధరలు..

ఐఫోన్ 16 ప్రో ధర: ఐఫోన్ 16 ప్రో మోడల్ నాలుగు స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది: 128 జీబీ, 256 జీబీ, 512 జీబీ, 1 టీబీ. ఈ మోడళ్ల ధరలు.. రూ.119900, రూ.129900, రూ.149900, చివరగా రూ.169900.

ఐఫోన్​ 16 ప్రో మ్యాక్స్ ధర: ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ 256 జీబీ, 512 జీబీ, 1 టీబీ అనే మూడు స్టోరేజ్ వేరియంట్లలో విడుదలైంది. ఈ స్మార్ట్​ఫోన్ ధరలు వరుసగా రూ.144900, రూ.164900, రూ.184900.

ఇప్పుడు ఐఫోన్ 16 సిరీస్ ఇండియా ధరలను ఐఫోన్​ 15 ధరలతో పోల్చితే.. యాపిల్ కొత్త తరం మోడళ్ల రేట్లను దాదాపు పెంచలేదని స్పష్టమవుతోంది. ఇది కొనుగోలుదారులకు విలువైన అప్​గ్రేడ్​గా మారుతుంది. ఫలితంగా ఐఫోన్​ 16 సిరీస్​కి మంచి డిమాండ్​ కనిపించే అవకాశం ఉంది. ఇప్పుడు ఐఫోన్లు ఇండియాలోనే తయారవుతుండటంతో ధరలు పెరగకపోవడం విశేషం.

ఐఫోన్ 16 ప్రీ-ఆర్డర్లు- లభ్యత..

ఐఫోన్​ 16 ప్రీ ఆర్డర్స్​పైనా సంస్థ ప్రకటన చేసింది. ఐఫోన్ 16 సిరీస్ సెప్టెంబర్ 13 సాయంత్రం 5:30 గంటలకు ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంటుంది. అయితే, అధికారిక సేల్ సెప్టెంబర్ 20, 2024 నుంచి ప్రారంభం కానుంది.

మరి కొత్త ఐఫోన్​ 16 సిరీస్​ని మీరు కొంటున్నారా?

ఇంకో విషయం! హెచ్​టీ తెలుగు ఇప్పుడు వాట్సాప్​ ఛానెల్స్​లో అందుబాటులో ఉంది. టెక్​ ప్రపంచం నుంచి లేటెస్ట్​ అప్డేట్స్​ కోసం వాట్సాప్​లో హెచ్​టీ తెలుగు ఛానెల్​ని ఫాలో అవ్వండి. నిరంతరం అప్డేటెడ్​గా ఉండండి.

సంబంధిత కథనం