Kia EV9 : కియా ఈవీ9 ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ ఇండియా లాంచ్​పై కీలక అప్డేట్​..-kia ev9 electric suv listed on india website ahead of launch on october 3 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Kia Ev9 : కియా ఈవీ9 ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ ఇండియా లాంచ్​పై కీలక అప్డేట్​..

Kia EV9 : కియా ఈవీ9 ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ ఇండియా లాంచ్​పై కీలక అప్డేట్​..

Sharath Chitturi HT Telugu
Sep 08, 2024 05:36 AM IST

Kia EV9 India launch : ఇండియాలో లాంచ్​కి రెడీ అవుతున్న కియా ఈవీ9కి సంబంధించి కీలక అప్డేట్​ బయటకు వచ్చింది. సంస్థకు చెందిన ఇండియన్​ వెబ్​సైట్స్​లో ఈ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ లిస్ట్​ అయ్యింది. పూర్తి వివరాలు..

ఆల్​ న్యూ కియా ఈవీ9
ఆల్​ న్యూ కియా ఈవీ9 (Kia India)

మచ్​ అవైటెడ్​ కియా ఈవీ9 ఎలక్ట్రిక్​ ఎస్​యూవీపై కీలక అప్డేట్​! రాబోయే కియా ఈవీ9 ఇప్పుడు దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థకు చెందిన భారతీయ వెబ్​సైట్స్​లో లిస్ట్​ అయ్యింది. కియా ఇండియా ఇన్​స్టాగ్రామ్ పేజీలో ఇటీవల ఈ ఎలక్ట్రిక్ ఎస్​యూవీని టీజ్ చేశారు. మీరు కొత్త మోడల్ పేజీని క్లిక్ చేసిన తర్వాత టీజర్ క్లిప్​ను ఫుల్ ఫోకస్​లో ఉంచుతుంది.

అప్డేట్ చేసిన మూడు వరుసల కార్నివాల్ ఎంపీవీ అప్​డేటెడ్ వెర్షన్​తో పాటు కియా ఈవీ9.. అక్టోబర్​ 3న లాంచ్​ అవుతోంది. కియా ఇండియా నెక్ట్స్​ జనరేషన్​ కియా కార్నివాల్​తో పాటు ఈవీ9 జిటి-లైన్ ఏడబ్ల్యూడీ వేరియంట్​ను విడుదల చేయడం ద్వారా కొత్త మోడల్ లైన్​ను ప్రారంభించాలని భావిస్తున్నారు.

ఈ మోడల్ ఇప్పటికే ప్రపంచ మార్కెట్లలో లాంచ్ అయ్యింది. కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ (సిబియు)గా భారత్​లోకి చేరుకుంటుంది. కియా కార్నివాల్​ను సీబీయూగా ప్రారంభించి, తరువాత భారతదేశంలో స్థానికంగా అసెంబ్లింగ్ చేసే అవకాశం ఉంది.

కియా ఈవీ9 ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ టీజర్​లో రెండు భాగాల పానోరమిక్​ సన్​రూఫ్​ కనిపిస్తుంది. కియా ఈవీ9 జీటీ-లైన్ టాప్-ఆఫ్-రేంజ్ వేరియంట్ గ్లోబల్ మార్కెట్లలో ఇది సుమారు 434 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. కియా ఈవీ9 నెక్ట్స్​ జనరేషన్​ కార్నివాల్ ఎంపీవీ మొదట 2023 ఆటో ఎక్స్​పోలో భారతదేశంలో ప్రదర్శించడం జరిగింది.

కియా ఈవీ9 ఏడబ్ల్యూడీ జీటీ లైన్: ముఖ్యాంశాలు

కియా ఈవీ9 ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ, దాని మాతృ సంస్థ హ్యుందాయ్ రెండింటి మోడళ్ల మధ్య పంచుకున్న ఈ-జీఎంపీ ఆర్కిటెక్చర్ ఆధారంగా నిర్మించడం జరిగింది. జీటీ-లైన్ ఏడబ్ల్యూడీ ముసుగులో ఉన్న ఈ ఎలక్ట్రిక్ ఎస్​​యూవీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 270 మైళ్లు (సుమారు 434 కిలోమీటర్లు) పరిధిని అందిస్తుంది. 350 కిలోవాట్ల డీసీ ఫాస్ట్ ఛార్జింగ్​తో 24 నిమిషాల్లో 10-80 శాతం ఛార్జ్ చేయవచ్చు.

బేస్ మోడల్ ఆర్​డబ్ల్యుడీ.. 201 బీహెచ్​పీ సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్ తో వస్తుంది. జీటీ-లైన్ ఏడబ్ల్యూడీ డ్యూయెల్-మోటార్ కాన్ఫిగరేషన్​తో వస్తుంది. ఇది 379 బీహెచ్​పీ పవర్​ని 700 ఎన్ఎమ్ టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది. ఈవీ9 కేవలం 5 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, పార్కింగ్ కొలిషన్ అవాయిడెన్స్, లేన్ డ్రైవింగ్ ఎయిడ్స్, నావిగేషన్ ఆధారిత క్రూయిజ్ కంట్రోల్​తో కూడిన 360 డిగ్రీల కెమెరా, లెవల్-3 ఏడీఏఎస్ సూట్ సేఫ్టీ ఫీచర్లు ఈ మోడల్లో ఉన్నాయి.

కియా యూఎస్ ఈవీ9 ఏడబ్ల్యూడీ జీటీ-లైన్​ను 73,900 డాలర్లుగా లిస్ట్​ చేసింది. ఇది సుమారు రూ .62.06 లక్షలు! భారతదేశానికి ధరలను ఇంకా ప్రకటించలేదు. వచ్చే నెలలో క్లారిటీ వస్తుంది. ఈ మోడల్​ని సీబీయూగా తీసుకువస్తున్నందున రేటు ఎక్కువగానే ఉంటుందని భావిస్తున్నారు. కియా ఇండియా ఈవీ9ని స్థానికంగా అసెంబ్లింగ్ చేసే అవకాశాలపై సంస్థ ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు.

లాంచ్​ తర్వాత ఈ మోడల్​ ఫీచర్స్​, రేంజ్​పై మరింత క్లారిటీ వస్తుంది.