Kia EV9 India Launch : ఇండియాలో కియా ఈవీ9 టెస్ట్ డ్రైవ్.. లాంచ్ త్వరలోనే!
Kia EV9 electric SUV : ఇండియాలో కియా ఈవీ9 టెస్ట్ డ్రైవ్ జరిగింది. అంటే.. ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ, ఇండియాలో లాంచ్‌కు సిద్ధమవుతున్నట్టు!
Kia EV9 price in India : ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లోని ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్‌పై కియా మోటార్స్ ఫోకస్ చేసింది. తమ ప్లాన్స్‌లో భాగంగా.. అంతర్జాతీయంగా బెస్ట్ సెల్లింగ్‌గా ఉన్న కియా ఈవీ9 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని.. 2024లో ఇండియాలో లాంచ్ చేస్తామని గతేడాది చెప్పింది ఈ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ. ఇక ఇప్పుడు.. ఈ కియా ఈవీ9కి సంబంధించిన కీలక అప్డేట్ బయటకి వచ్చింది. ఇండియా రోడ్లపై టెస్ట్ డ్రైవ్ చేస్తూ కనిపించింది ఈ 3 రో ఈవీ. ఈ నేపథ్యంలో ఈ ఎలక్ట్రిక్ వెహికిల్ ఫీచర్స్ వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
కియా ఈవీ9 ఫీచర్స్..
కియా ఈవీ9 అనేది ఒక ప్రీమియం కారు. ఇందులో బ్లాంక్డ్ ఆఫ్ గ్రిల్, వర్టికల్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్స్, స్లీక్ ఎల్ఈడీ టెయిల్‌లైట్స్, ఫ్లష్ ఫిట్టెడ్ డోర్ హ్యాండిల్స్ వంటివి వస్తున్నాయి. ఇందులో 21 ఇంచ్ డ్యూయెల్ టోన్ వీల్స్ ఉంటాయి.
ఇక ఈ 3 రో ఎలక్ట్రిక్ వెహికిల్ ఇంటీరియర్ చాలా స్పేషియస్గా ఉంటుంది. డిజైన్ మినిమలిస్ట్‌గా ఉంటుంది. 4 స్పోక్ స్టీరింగ్ వీల్, పానారోమిక్ సన్‌రూఫ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్- ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్ కోసం భారీ స్క్రీన్ వంటివి వస్తున్నాయి.
ఈ-జీఎంపీ (ఎలక్ట్రిక్ గ్లోబల్ మాడ్యులర్ ప్లాట్‌ఫామ్)పై ఈ కియా ఈవీ9 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని రూపొందించింది కియా మోటార్స్. దీని పొడవు 5,000ఎంఎం. వీల్‌బేస్ 3,1000ఎంఎం. సైజు పరంగా చూసుకుంటే.. ఈ వెహికిల్ చాలా పెద్దదే!
అంతర్జాతీయంగా ఉన్న కియా ఈవీ9లో రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ ఉన్నాయి. అవి.. 76.1 కేడబ్లూహెచ్, 99.8 కేడబ్ల్యూహెచ్. ఈ ఈవీ రేంజ్ 540కి.మీలు. 800వోల్ట్ అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఈ కియా ఎలక్ట్రిక్ వెహికిల్‌కి లభిస్తోంది. మరి ఇండియాలో.. ఏ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది? అనేది వేచి చూడాలి.
కియా ఈవీ9 ధర ఎంత ఉండొచ్చు..?
కియా ఈవీ9 ధరకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. కానీ ఇదొక ప్రీమియం కారు కాబట్టి.. దీని ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 40లక్షల కన్నా ఎక్కువగానే ఉంటుంది మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
కియా ఈవీ9 ఇతర ఫీచర్స్, లాంచ్ డేట్‌పైనా క్లారిటీ లేదు. త్వరలోనే ఈ మోడల్‌పై సంస్థ ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది.
ఈ కియా ఈవీ9 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని.. 2023 జనవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించింది సంస్థ. అప్పటి నుంచి ఈ మోడల్‌పై మంచి బజ్ నెలకొంది. వాస్తవానికి.. 2025లో ఈ మోడల్ని లాంచ్ చేస్తామని, ఆ సమయంలో చెప్పింది కియా మోటార్స్. కానీ ఇప్పుడు.. ఆ టైమ్‌ని 2024లోకి తీసుకొచ్చింది. టాటా మోటార్స్ ఆధిపత్యం అధికంగా ఉన్న ఇండియా ఈవీ సెగ్మెంట్లో 15శాతం మార్కెట్ వాటాను సంపాదించడమే లక్ష్యంగా పనిచేస్తోంది కియా మోటార్స్. టార్గెట్‌లో భాగంగా.. ఇండియాలో వరుసగా ఈవీలను లాంచ్ చేయాలని సంస్థ చూస్తోంది. మొదట వచ్చేదే ఈ కియా ఈవీ9!
సంబంధిత కథనం