Kia Sonet Gravity : కియా సోనెట్ ఎస్యూవీ కొత్త వేరియంట్- 'గ్రావిటీ' ఫీచర్స్, ధర వివరాలు..
Kia Sonet Gravity price : కియా భారతదేశంలో తన ఐదవ వార్షికోత్సవాన్ని సోనెట్ ఎస్యూవీ కొత్త గ్రావిటీ వేరియంట్‌తో జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ కొత్త వేరియంట్ ఫీచర్స్, ధరతో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
ఇండియా ఆటోమొబైల్‌లో బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీల్లో ఒకటైన కియా సోనెట్‌లో సరికొత్త వేరియంట్‌ని ఇటీవలే లాంచ్ చేసింది కియా మోటార్స్. ఈ వేరియంట్ పేరు 'గ్రావిటీ'. ఈ సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీకి కాస్మెటిక్ మెరుగుదలలతో పాటు కొత్త ఫీచర్స్‌ని తీసుకువచ్చింది. కొత్త కియా సోనెట్ గ్రావిటీ వేరియంట్ ధర రూ .10.50 లక్షలు (ఎక్స్-షోరూమ్). భారతదేశంలో వాహన తయారీదారు ఐదొవ వార్షికోత్సవం, ఈ కాలంలో ఒక మిలియన్ యూనిట్ల అమ్మకాలను జరుపుకున్న నేపథయ్యంలో ఈ వేరియంట్‌ని సంస్థ విడుదల చేసింది. కొత్త వేరియంట్ కియా సెల్టోస్ ఎస్యూవీ,కియా కారెన్స్ ఎంపీవీల్లో కూడా లభిస్తుంది.
సోనెట్ గ్రావిటీ ట్రిమ్‌లో లెథరెట్ సీట్లు, కొత్త అల్లాయ్ వీల్ ఆప్షన్లు, ఫ్రంట్- రేర్ డాష్‌క్యామ్‌లు, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ ఉన్నాయి. ఈ ఎస్‌యూవీలో అడ్జెస్టెబుల్ హెడ్‌రెస్ట్‌లు, కప్ హోల్డర్ అమర్చిన ఆర్మ్ రెస్ట్లు, లెథర్ చుట్టిన స్టీరింగ్ వీల్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా, గ్రావిటీ ట్రిమ్‌తో సోనెట్ ఎస్యూవీ పొందే కొత్త ఫీచర్లు ఇతర మోడల్స్‌లో కనిపించకపోవచ్చు.
కియా సోనెట్ గ్రావిటీ: ఫీచరలు..
కేబిన్‌లో నేవీ స్టిచ్చింగ్‌తో కూడిన ఇండిగో పేరా లెథరేట్ సీట్లు వస్తాయి. లెథరేట్ వ్రాప్డ్ స్టీరింగ్ వీల్, గేర్ నాబ్ కూడా ఉన్నాయి.
కియా సోనెట్ ఎస్యూవీ కొత్త వేరియంట్లో అదనపు ఇంటీరియర్ ఫీచర్లలో కప్ హోల్డర్లతో రేర్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్, రేర్ అడ్జెస్టెబుల్ హెడ్రెస్ట్ ఉన్నాయి. రెండో వరుస సీట్లను 60:40 నిష్పత్తిలో రూపొందించడం జరిగింది. కియా సోనెట్ గ్రావిటీలో సిల్వర్ పెయింటెడ్ డోర్ హ్యాండిల్స్, బాడీ కలర్లో రేర్ స్పాయిలర్, క్రిస్టల్ కట్ ఫినిష్‌లో 16 ఇంచ్ అలాయ్ వీల్స్ వస్తున్నాయి.
కియా సోనెట్ ధరలు
వేరియంట్లు | ధరలు (ఎక్స్‌షోరూం) |
Smartstream G1.2 5MT | ₹10.50 lakh |
Smartstream G1.0 T-GDi 6iMT | ₹11.20 lakh |
1.5L CRDi VGT 6MT | ₹12.0 lakh |
కియా సోనెట్ కొత్త వేరియంట్- వాటి ధరలు..
కియా సోనెట్ గ్రావిటీ ట్రిమ్ మూడు ఇంజిన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇది 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో ప్రారంభమవుతుంది, 5-స్పీడ్ మాన్యువల్ రూ .10.50 లక్షలకు లభిస్తుంది. 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ యూనిట్ 6-స్పీడ్ ఐఎంటీతో రూ .11.20 లక్షలు, 6-స్పీడ్ 1.5-లీటర్ డీజిల్ మోటార్ రూ .12.0 లక్షలకు లభిస్తుంది. పైన పేర్కొన్న అన్ని ధరలు ఎక్స్-షోరూమ్. కొత్త సోనెట్ గ్రావిటీ వేరియంట్ హెచ్టీకే + ట్రిమ్ పైన పొజీషన్ చేసి ఉంటుంది.