తెలుగు న్యూస్ / ఫోటో /
Upcoming Flagship mobiles: ఐఫోన్ 16 నుంచి వన్‍ప్లస్ 13 వరకు.. ఈ ఏడాది లాంచ్ కానున్న ఫ్లాగ్‍షిప్ మొబైళ్లు ఇవే
ఈ ఏడాది మరో నాలుగు నెలలు మిగిలి ఉంది. ఇంకా కొన్ని ఫ్లాగ్‍షిప్ స్మార్ట్‌ఫోన్లు వచ్చేయనున్నాయి. యాపిల్, వివో, వన్‍ప్లస్ నుంచి ప్రీమియం మొబైళ్లు లాంచ్ కానున్నాయి. అవేవో ఇక్కడ చూడండి.
(1 / 5)
ఐఫోన్ 16 సిరీస్‍ను సెప్టెంబర్ 9వ తేదీన యాపిల్ లాంచ్ చేయనుంది. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ మోడళ్లు విడుదల కానున్నాయి. సరికొత్త శక్తివంతమైన ప్రాసెసర్, కెమెరా అప్‍గ్రేడ్స్, ఏఐ ఫీచర్లతో ఈ నయా ఐఫోన్లు వస్తున్నాయి. (Hindustan Times Tech)
(2 / 5)
వన్‍ప్లస్ 12 బాగా హిట్ అయింది. ఇక వన్‍ప్లస్ 13ను లాంచ్ చేసేందుకు ఆ కంపెనీ రెడీ అయింది. ఈ ఏడాది నవంబర్ నెలలో వన్‍ప్లస్ 13 సిరీస్ లాంచ్ కానుంది. స్నాప్‍డ్రాగన్ 8 జెన్ 4 ప్రాసెసర్ సహా చాలా అప్‍గ్రేడ్లతో ఈ 13 సిరీస్ ఫ్లాగ్‍షిప్ స్మార్ట్‌ఫోన్లు రానున్నాయి. (OnePlus)
(3 / 5)
వివో ఎక్స్200 సిరీస్ ఫ్లాగ్‍షిప్ మొబైళ్లు ఈ ఏడాదిలోనే లాంచ్ కానున్నాయి. ఈ సిరీస్‍లో వివో ఎక్స్200, వివో ఎక్స్200 ప్లస్, వివో ఎక్స్200 ప్రో ఫోన్లు ఉండనున్నాయి. 200 మెగాపిక్సెల్ టెలిఫొటో కెమెరాతో వివో ఎక్స్200 ప్రో ఉంటుందనే లీకులు వచ్చాయి. ఫ్లాగ్‍షిప్ స్పెసిఫికేషన్లు, ప్రీమియం ఫ్రీచర్లతో ఈ మొబైళ్లు ఉండనున్నాయి. (Vivo)
(4 / 5)
టెక్నో ఫాంటమ్ వీ ఫోల్డ్ 2, వీ ఫ్లిప్ 2 ఫ్లాగ్‍షిప్ ఫోల్డబుల్ ఫోన్లను లాంచ్ చేసేందుకు టెక్నో కంపెనీ రెడీ అయింది. ఇండియాలో అతిత్వరలో ఈ మొబైళ్లు అడుగుపెట్టే అవకాశం ఉంది. మీడియాటెక్ డైమన్సిటీ 9000+, డైమన్సిటీ 8020 పవర్ ఫుల్ ప్రాసెసర్లతో ఈ మొబైళ్లు రానున్నాయి. (Amazon)
(5 / 5)
ఒప్పో ఫైండ్ ఎక్స్8 ఫ్లాగ్‍షిప్ సిరీస్ ఇండియాలో ఈ ఏడాది అక్టోబర్‌లో విడుదల కానుంది. ఈ సిరీస్‍లో ఒప్పో ఫైండ్ ఎక్స్8, ఒప్పో ఫైండ్ ఎక్స్8 ప్రో, ఒప్పో ఫైండ్ ఎక్స్8 అల్ట్రా ఉండనున్నాయి. మీడియాటెక్ డైమన్సిటీ 9400 ప్రాసెసర్‌ను అల్ట్రా వైరియంట్ కలిగి ఉంటుందని సమాచారం. ఈ మూడు మోడళ్లు ప్రీమియం ఫ్లాగ్‍షిప్ స్పెసిఫికేషన్లతో వస్తాయి. (HT Tech)
ఇతర గ్యాలరీలు