మేం సనాతనీయులం.. ఐక్య బంగ్లాదేశ్ కోరుకుంటున్నాం : చిన్మోయ్ కృష్ణ దాస్
Chinmoyi Krishna Das : ఇస్కాన్ సభ్యుడు చిన్మోయ్ కృష్ణ దాస్ అరెస్టు ఉద్రిక్త పరిస్థితులకు దారితీసిన విషయం తెలిసిందే. తాజాగా కోర్టు వెలుపల వ్యాను నుంచి విక్టరీ సంకేతాన్ని చూపుతూ కృష్ట దాస్ కనిపించారు. శాంతి భద్రతలకు విఘాతం కగిలిగంచొద్దని కోరారు.
బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ సభ్యుడు చిన్మోయ్ కృష్ణ దాస్‌ను ఢాకాలో అరెస్టు చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బంగ్లాదేశ్ జెండాను అవమానించారనే ఆరోపణలో అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆయనను ఎక్కడకు తీసుకెళ్లారని తెలియలేదు. దీంతో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైంది. తాజాగా చిట్టగాంగ్ కోర్టు వెలుపల తన అనుచరులను ఉద్దేశించి కృష్ణ దాస్ విక్టరీ సంకేతాన్ని చూపారు. PTI నివేదిక ప్రకారం తన మద్దతుదారులను ప్రశాంతంగా ఉండాలని, శాంతిని కాపాడాలని, లాండ్ ఆర్డర్‌కు అంతరాయం కలిగించకుండా ఉండాలని కోరారు.
'మేము దేశానికి, ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. మేం సనాతనీయులం, దేశంలో భాగమే. ఐక్య బంగ్లాదేశ్ కోరుకుంటున్నాం. దేశాన్ని అస్థిరపరిచేందుకు, శాంతిని ధ్వంసం చేసేందుకు మేం ఏమీ చేయం. భావోద్వేగాలను అదుపులో ఉంచుకుని వాటిని శక్తిగా మార్చుకుని శాంతియుతంగా నిరసనలు తెలుపుతాం.' అని కృష్ణ దాస్ చెప్పారు.
చిన్మోయ్ కృష్ణ దాస్‌ను తీసుకెళ్తున్న వ్యాన్ వచ్చినప్పుడు జై శ్రీరామ్ అని నినాదాలు చేస్తూ చిట్టగాంగ్ కోర్టు వెలుపల పెద్ద సంఖ్యలో జనాలు గుమిగూడారు. భద్రతా బలగాలు సౌండ్ గ్రెనేడ్లను కాల్చి, లాఠీలను ప్రయోగించాయి
కృష్ణ దాస్‌కు చిట్టగాంగ్ కోర్టు బెయిల్ నిరాకరించడంతో బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. దేశద్రోహం కేసులో భాగంగా ఆయన విచారణలో ఉన్నారు. బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్(బిజిబి)తో సహా భద్రతా బలగాలు నిరసనకారులను చెదరగొట్టడానికి సౌండ్ గ్రెనేడ్లు, లాఠీలను ప్రయోగించాయి. చివరికి మధ్యాహ్నం 3 గంటలకు వ్యాన్ కోర్టు ప్రాంగణం నుండి బయలుదేరింది. చిన్మోయ్ కృష్ణ అరెస్ట్ తర్వాత బంగ్లాదేశ్‌లో మంగళవారం జరిగిన ఘర్షణల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ సైఫుల్ ఇస్లాం అలీఫ్ మరణించినట్లు ఏఎఫ్‌పీ నివేదిక పేర్కొంది.
చిన్మోయ్ దాస్‌తో సహా మరో 18 మందిపై దేశద్రోహం కేసు నమోదైంది. ర్యాలీలో చటోగ్రామ్‌లోని న్యూ మార్కెట్ ప్రాంతంలో బంగ్లాదేశ్ జాతీయ జెండాను అగౌరవపరిచారని మొహోరా వార్డ్ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్‌పీ) ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ ఖాన్ తన ఫిర్యాదులో ఆరోపించారు.
టాపిక్