తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Jee Advanced 2024: ఐఐటీ జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలను ప్రకటించే తేదీ ఇదే.. ఈ ముఖ్యమైన డేట్స్ ను గుర్తుంచుకోండి..

JEE Advanced 2024: ఐఐటీ జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలను ప్రకటించే తేదీ ఇదే.. ఈ ముఖ్యమైన డేట్స్ ను గుర్తుంచుకోండి..

HT Telugu Desk HT Telugu

28 May 2024, 15:39 IST

google News
    • JEE Advanced 2024: జేఈఈ అడ్వాన్స్ డ్ 2024 ఆన్సర్ కీ, ఫలితాలను ఐఐటీ మద్రాస్ త్వరలో విడుదల చేయనుంది. జేఈఈ అడ్వాన్స్ డ్ 2024 పరీక్ష మే 26 వ తేదీన రెండు సెషన్లలో జరిగింది. జేఈఈ అడ్వాన్స్ డ్ 2023 పరీక్షలో హైదరాబాద్ కు చెందిన వావిలాల చిద్విలాస్ రెడ్డి టాపర్ గా నిలిచారు.
జూన్ 9న జేఈఈ అడ్వాన్స్ డ్ 2024 ఫలితాల వెల్లడి
జూన్ 9న జేఈఈ అడ్వాన్స్ డ్ 2024 ఫలితాల వెల్లడి

జూన్ 9న జేఈఈ అడ్వాన్స్ డ్ 2024 ఫలితాల వెల్లడి

JEE Advanced 2024: జేఈఈ అడ్వాన్స్డ్ 2024 పరీక్షల ఆన్సర్ కీ, ఫలితాలను మద్రాస్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ త్వరలో విడుదల చేయనుంది. మే 26 తేదీన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండు సెషన్లలో ఈ పరీక్షలను నిర్వహించారు. ఫలితాలు ప్రకటించిన తర్వాత అభ్యర్థులు తమ ఫలితాలను జేఈఈ అడ్వాన్స్డ్ అధికారిక వెబ్ సైట్లో అంటే jeeadv.ac.in చూసుకోవచ్చు. గతేడాది జేఈఈ అడ్వాన్స్డ్ 2023 ఫలితాలను 2023, జూన్ 18న విడుదల చేసిన సంగతి తెలిసిందే.

జూన్ 9న ఫలితాల ప్రకటన, రిజల్ట్ చూసుకునేందుకు స్టెప్స్

జేఈఈ అడ్వాన్స్డ్ (JEE Advanced 2024) అధికారిక వెబ్సైట్ jeeadv.ac.in ప్రకారం, ఈ సంవత్సరం తుది ఆన్సర్ కీని, అలాగే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఫలితాలను జూన్ 9 వ తేదీన ఉదయం 10 గంటలకు ప్రకటించనున్నారు. ఈ ఫలితాలను జేఈఈ అడ్వాన్స్డ్ (JEE Advanced 2024) అధికారిక వెబ్ సైట్ లో విద్యార్థులు చెక్ చేసుకోవచ్చు. తమ ఫలితాలను చూసుకునేందుకు విద్యార్థులు ఈ కింది స్టెప్స్ ఫాలో కావాలి.

  • జేఈఈ అడ్వాన్స్ డ్ అధికారిక వెబ్ సైట్ jeeadv.ac.in ను ఓపెన్ చేయాలి.
  • వెబ్ సైట్ హోం పేజీలో కనిపిస్తున్న జేఈఈ అడ్వాన్స్డ్ 2023 రిజల్ట్ లింక్ పై క్లిక్ చేయండి.
  • లాగిన్ వివరాలను ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి.
  • మీ రిజల్ట్ స్క్రీన్ పై కనిపిస్తుంది.
  • రిజల్ట్ చెక్ చేసుకుని పేజీని డౌన్ లోడ్ చేసుకోండి.
  • తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని భద్రపర్చుకోండి.

గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన తేదీలు

జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు రాసిన విద్యార్థులు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన తేదీలు ఇవే..

  • మే 31 (సాయంత్రం 5 గంటలు): జేఈఈ (అడ్వాన్స్డ్) 2024 (JEE Advanced 2024) వెబ్సైట్లో క్యాండిడేట్స్ రెస్పాన్సెస్ అందుబాటులో ఉంటాయి.
  • జూన్ 02 (ఉదయం 10 గంటలు): ప్రొవిజనల్ ఆన్సర్ కీ విడుదల.
  • జూన్ 2-3 (సాయంత్రం 5 గంటలు): ప్రొవిజనల్ ఆన్సర్ కీ పై ఫీడ్ బ్యాక్, కామెంట్స్ కు అవకాశం.
  • జూన్ 9 (ఉదయం 10 గంటలకు): ఫైనల్ ఆన్సర్ కీ విడుదల. అలాగే, జేఈఈ (అడ్వాన్స్డ్) 2024 ఫలితాల వెల్లడి.
  • జూన్ 9-10: ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఏఏటీ) 2024 కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్
  • జూన్ 10: జాయింట్ సీట్ అలకేషన్ (JoSAA) 2024 ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం.
  • జూన్ 12 (ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటలు): ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (AAT) 2024.
  • జూన్ 14 (సాయంత్రం 5 గంటలు): ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (AAT) 2024 ఫలితాల వెల్లడి

జేఈఈ అడ్వాన్స్డ్ 2023 ఫలితాల వివరాలు

జేఈఈ అడ్వాన్స్డ్ 2023 లో హైదరాబాద్ కు చెందిన వావిలాల చిద్విలాస్ రెడ్డి టాపర్ గా నిలిచారు. పరీక్షలో 360 మార్కులకు గాను 341 మార్కులు సాధించాడు. జేఈఈ అడ్వాన్స్డ్ 2023 పరీక్షల్లో జనరల్ కేటగిరీకి చెందిన 13828 మంది, ఓబీసీ-ఎన్సీఎల్ కేటగిరీ (9029 మంది), జనరల్-ఈడబ్ల్యూఎస్ కేటగిరీ (5363 మంది), ఎస్సీ కేటగిరీ (10993 మంది), ఎస్టీ కేటగిరీ (4081 మంది విద్యార్థులు) ఉత్తీర్ణత సాధించారు.

తదుపరి వ్యాసం