JEE Advanced 2024 AAT : జేఈఈ అడ్వాన్స్డ్ ఏఏటీ రిజిస్ట్రేషన్ షురూ..
09 June 2024, 17:20 IST
జేఈఈ అడ్వాన్స్ డ్ 2024 ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఏఏటీ) రిజిస్ట్రేషన్ విండోను ఐఐటీ మద్రాస్ jeeadv.ac.in తెరిచింది. జూన్ 10న సాయంత్రం 5 గంటలకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగుస్తుంది.
జేఈఈ అడ్వాన్స్డ్ ఏఏటీ 2024 రిజిస్ట్రేషన్ ప్రారంభం..
JEE Advanced AAT 2024 : జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఏఏటీ) రిజిస్ట్రేషన్ విండోను ఐఐటీ మద్రాస్ ఓపెన్ చేసింది. jeeadv.ac.in లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 10న సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని, జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఏఏటీ జూన్ 12న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుందని నోటిఫికేషన్లో పేర్కొంది.
ఐఐటీ (బీహెచ్‌యూ) వారణాసి, ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ రూర్కీలో మాత్రమే అందుబాటులో ఉన్న బీఆర్క్ (ఆర్కిటెక్చర్) ప్రోగ్రామ్‌లో చేరాలనుకునే అభ్యర్థులు ఈ జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఏఏటీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి.
జేఈఈ అడ్వాన్స్డ్ ఏఏటీ 2024: అర్హత..
JEE Advanced AAT eligibility : నోటిఫికేషన్ ప్రకారం.. జేఈఈ అడ్వాన్స్డ్ 2024లో అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే ఏఏటీ 2024కు హాజరు కావడానికి అర్హులు.
జేఈఈ అడ్వాన్స్ డ్ఏఏటీ 2024: ఇలా అప్లై చేసుకోండి..
- అధికారిక వెబ్సైట్లోకి వెళ్లండి.
- హోమ్ పేజీలోఅందుబాటులో ఉన్న జేఈఈ అడ్వాన్స్ డ్ 2024 ఏఏటీ రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.
- JEE Advanced AAT syllabus : కొత్త విండో ఓపెన్ అవుతుంది; జేఈఈ అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి.
- లాగిన్ పై క్లిక్ చేయండి.
- దరఖాస్తు ఫారం స్క్రీన్‌పై కనిపిస్తుంది.
- జేఈఈ అడ్వాన్స్డ్ ఏఏటీ 2024 దరఖాస్తు ఫారంనింపండి.
- సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి.
- కన్ఫర్మేషన్ పేజీని డౌన్లోడ్ చేసుకోండి.
జేఈఈ అడ్వాన్స్డ్ ఏఏటీ 2024: అడ్మిట్ కార్డు..
ఏఏటీకి ప్రత్యేక అడ్మిట్ కార్డును జారీ చేయడం జరగదు. జేఈఈ అడ్వాన్స్డ్ 2024 అడ్మిట్ కార్డును ప్రింట్ తీసి ఒరిజినల్ ఫొటో గుర్తింపు కార్డుతో పాటు ఏఏటీ పరీక్ష హాల్లో సమర్పించాలి.
జేఈఈ అడ్వాన్స్డ్ ఏఏటీ 2024: ముఖ్యమైన తేదీలు..
JEE Advanced AAT registration : ఏఏటీ 2024 కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్: జూన్ 09, 2024 (10:00 భారత కాలమానం ప్రకారం) నుంచి జూన్ 10, 2024 (17:00 భారత కాలమానం ప్రకారం) వరకు.
ఏఏటీ 2024 పరీక్ష తేదీ: జూన్ 12, 2024 (ఉదయం 09:00 నుంచి 12:00 వరకు).
ఫలితాలను జూన్ 14న విడుదల చేస్తారు.
జేఈఈ అడ్వాన్స్ డ్ ఏఏటీ 2024 పరీక్షను కేవలం ఏడు ఐఐటీల్లో మాత్రమే నిర్వహిస్తారు. ఐఐటీ-బాంబే, ఐఐటీ-ఢిల్లీ, ఐఐటీ-గౌహతి, ఐఐటీ-కాన్పూర్, ఐఐటీ-భువనేశ్వర్, ఐఐటీ-మద్రాస్, ఐఐటీ-రూర్కీ.
ఈ పరీక్షలో ఒక మూడు గంటల పేపర్ ఉంటుంది. ఏఏటీ ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు చెక్ చేసుకున్నారా?
జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాలను ఆదివారం విడుదల చేసింది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మద్రాస్. పరీక్షకు హాజరైన అభ్యర్థులు jeeadv.ac.in జేఈఈ అడ్వాన్స్డ్ అధికారిక వెబ్ సైట్ లో తమ ఫలితాలను చూసుకోవచ్చు.
అభ్యర్థులు తమ స్కోర్ కార్డులను చెక్ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ నంబర్ లేదా అధికారిక వెబ్సైట్ కోరిన సమాచారం వంటి లాగిన్ వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.