JEE Advanced Resuts : జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల- టాపర్స్ లిస్ట్ ఇదే! మీ రిజల్ట్ ఇలా చెక్ చేసుకోండి..
JEE Advanced result : జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాలు విడుదలయ్యాయి. మీ స్కోర్ కార్డ్‌ని ఎలా చెక్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి..
JEE Advanced results link : జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాలను ఆదివారం విడుదల చేసింది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మద్రాస్. పరీక్షకు హాజరైన అభ్యర్థులు jeeadv.ac.in జేఈఈ అడ్వాన్స్డ్ అధికారిక వెబ్ సైట్ లో తమ ఫలితాలను చూసుకోవచ్చు.
అభ్యర్థులు తమ స్కోర్ కార్డులను చెక్ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ నంబర్ లేదా అధికారిక వెబ్సైట్ కోరిన సమాచారం వంటి లాగిన్ వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలతో పాటు ఆలిండియా టాపర్ల జాబితా, జోన్ల వారీగా టాపర్ల జాబితా, వారు సాధించిన మార్కులు సహా వివిధ కేటగిరీలకు కటాఫ్ మార్కులు, సంబంధిత సమాచారాన్ని వెల్లడించింది ఐఐటీ మద్రాస్.
How to check JEE Advanced 2024 results : ఈ ఏడాది ఐఐటీ దిల్లీ జోన్‌కు చెందిన వేద్ లహోతి 336 మార్కులకు గాను 355 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచాడు. మహిళా అభ్యర్థుల్లో ద్విజా ధర్మేష్ కుమార్ పటేల్ ఆలిండియా 7వ ర్యాంకుతో అగ్రస్థానంలో నిలిచింది. ఆమెకు 360 మార్కులకు గాను 332 మార్కులు వచ్చాయి.
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో టాప్ 10 టాపర్ల జాబితా:
వీడ్ లాహోటి |
ఆదిత్య |
భోగలపల్లి సందేశ్ |
రిథమ్ కేడియా |
పుట్టి కుశాల్ కుమార్ |
రాజ్ దీప్ మిశ్రా |
ద్విజా ధర్మేష్ కుమార్ పటేల్ |
కోడూరు తేజేశ్వర్ |
ధృవిన్ హేమంత్ దోషి |
అల్లాడబోయిన ఎస్ ఎస్ డీబీ ఎస్ సిద్విక్ సుహాస్ |
జేఈఈ అడ్వాన్స్ డ్ 2024 పరీక్షలో మొత్తం 48248 మంది అర్హత సాధించగా.. వీరిలో 40284 మంది పురుషులు, 7964 మంది మహిళా అభ్యర్థులు ఐఐటీ జేఈఈ పరీక్షలో ఉత్తీర్ణతులయ్యారు.
JEE Advanced 2024 : ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఐటీలు వంటి ఇతర కేంద్ర నిధులతో నడిచే సాంకేతిక సంస్థలకు ఆన్లైన్ కౌన్సెలింగ్ ప్రక్రియ అయిన జాయింట్ సీట్ల కేటాయింపు (జోసా) 2024 తాత్కాలిక ప్రారంభం జూన్ 10, 2024 న జరుగుతుందని అధికారిక వెబ్సైట్ తెలిపింది.
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల డైరక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
జేఈఈ అడ్వాన్స్డ్ 2024 స్కోర్‌ని ఇలా చెక్ చేసుకోండి..
- JEE Advanced 2024 results date : స్టెప్ 1:- జేఈఈ అడ్వాన్స్డ్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లండి.
- JEE Advanced Results 2024 :స్టెప్ 2:- మీ 7 డిజిట్ రోల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, 10 డిజిట్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి, సబ్మీట్ చేయండి.
- స్టెప్ 3:- మీ జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాలు డిస్ప్లే అవుతాయి.
- స్టెప్ 4:- ఫలితాలను చెక్ చేసుకుని, వాటిని డౌన్లోడ్ చేసుకోండి.
ఇంజినీరింగ్ కోసం దేశంలో ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీల్లో చేరేందుకు ఈ జేఈఈ పరీక్షలను నిర్వహిస్తారు. తొలుత జేఈఈ మెయిన్స్ పరీక్ష ఉంటుంది. అందులో ఉత్తీర్ణులైన వారికి.. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహిస్తారు. పాసైన వారికి వివిధ ఐఐటీలు, ఎన్ఐటీల్లో సీటు దక్కుతుంది.
సంబంధిత కథనం