JEE Advanced Results : రేపే జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు- ఇలా చెక్ చేసుకోండి..
JEE Advanced Results 2024 : జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు ఆదివారం విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో గత కటాఫ్‌లు, టాపర్లు, వారి మార్కులతో పాటు జోసా కౌన్సెలింగ్‌కు సంబంధించిన సమాచారం ఇక్కడ తెలుసుకోండి..
JEE Advanced Results date 2024 : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్డ్ ఫలితాలు.. జూన్ 9, ఆదివారం విడుదలకానున్నాయి. ఈ నెల 9న.. ఉదయం 10 గంటలకు తుది ఆన్సర్ కీతో పాటు జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలను ఐఐటీ మద్రాస్ విడుదల చేయనుంది. జేఈఈ అడ్వాన్స్డ్ 2024 స్కోర్ కార్డులను jeeadv.ac.inలో చూసుకోవచ్చు.
జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాలతో పాటు.. ఆల్ ఇండియా టాపర్ల జాబితా, జోన్ల వారీగా టాపర్ల జాబితా, వారు సాధించిన మార్కులు, వివిధ కేటగిరీలకు కటాఫ్ మార్కులు, పరీక్షకు సంబంధించిన ఇతర వివరాలను పంచుకుంటుంది ఐఐటీ మద్రాస్.
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు- ఇలా చెక్ చేసుకోండి..
స్టెప్ 1:- జేఈఈ అడ్వాన్స్డ్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లండి.
JEE Advanced Results 2024 :స్టెప్ 2:- మీ 7 డిజిట్ రోల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, 10 డిజిట్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి, సబ్మీట్ చేయండి.
స్టెప్ 3:- మీ జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాలు డిస్ప్లే అవుతాయి.
స్టెప్ 4:- ఫలితాలను చెక్ చేసుకుని, వాటిని డౌన్లోడ్ చేసుకోండి.
జేఈఈ అడ్వాన్స్ డ్ కటాఫ్ అంటే ఏమిటి?
జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్షలో కటాఫ్ మార్కులు అంటే సంబంధిత కేటగిరీకి చెందిన ర్యాంకు జాబితాలో లేదా కామన్ ర్యాంక్ లిస్ట్ (సీఆర్ ఎల్ )లో చేర్చాలంటే అభ్యర్థి పొందాల్సిన కనీస మార్కులు.
గతేడాది.. కామెన్ ర్యాంక్ లిస్ట్‌లో జేఈఈ అడ్వాన్స్డ్ కటాఫ్ మార్కులు ప్రతి సబ్జెక్టులో 6.83 శాతం, మొత్తంగా 23.89 శాతం మార్కులు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టులకు 120 మార్కులు (పేపర్ 1లో 60, పేపర్ 2లో 60) కలిపి మొత్తం 360 మార్కులకు పరీక్ష నిర్వహించారు.
గతేడాది.. జేఈఈ అడ్వాన్స్డ్ కటాఫ్ మార్కులు..
How to check JEE Advanced Results : ఓపీసీ- ఎన్సీఎల్ ర్యాంక్ లిస్ట్:- 6.15శాతం, 21.5శాతం
జెనరల్- ఈడబ్ల్యూఎస్ ర్యాంక్ లిస్ట్- 6.15శాతం, 21.5శాతం
ఎస్సీ ర్యాంక్ లిస్ట్- 3.42శాతం, 11.95శాతం
ఎస్టీ ర్యాంక్ లిస్ట్- 3.42శాతం, 11.95శాతం
కామన్ పీడబ్ల్యూడీ ర్యాంక్ లిస్ట్- 3.42శాతం, 11.95శాతం,
ఓబీసీ-ఎల్సీఎల్-పీడబ్ల్యూడీ ర్యాంక్ లిస్ట్- 3.42శాతం, 11.95శాతం
ఎస్సీ-పీడబ్ల్యూడీ ర్యాంక్ లిస్ట్- 3.42శాతం, 11.95శాతం
ఎస్టీ- పీడబ్ల్యూడీ ర్యాంక్ లిస్ట్- 3.42శాతం, 11.95శాతం
ప్రిపరేటరీ కోర్స్ ర్యాంక్ లిస్ట్- 1.71శాతం, 5.98శాతం
JEE Advanced Results : జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు వెలువడిన తర్వాత ఐఐటీలు, ఎన్ ఐటీలు, ఐఐఐటీలు వంటి కేంద్ర నిధులతో నడిచే ఇతర సాంకేతిక సంస్థలకు ఆన్లైన్ కౌన్సెలింగ్ ప్రక్రియను జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జేఓఎస్ఏఏ) ప్రారంభించనుంది.
జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్డ్ లో అర్హత సాధించిన అభ్యర్థులు జోసా కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అర్హులు. అయితే, జేఈఈ అడ్వాన్స్డ్ క్వాలిఫైడ్ అభ్యర్థులు ఐఐటీ, ఎన్ ఐటీ+ సీట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు కానీ జేఈఈ మెయిన్ క్వాలిఫైడ్ అభ్యర్థులు ఎన్ఐటీ+ అంటే అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల కోసం 31 ఎన్ఐటీలు, ఐఐఈఎస్టీ షిబ్పూర్, 26 ఐఐఐటీలు, 33 ఇతర జీఎఫ్‌టీఐల సీట్లకు అర్హులు.
జోసా రౌండ్ల తర్వాత నిట్ ప్లస్‌లో మిగిలిపోయిన సీట్లకు సెంట్రల్ సీట్ అలకేషన్ బోర్డు (సీఎస్ ఏబీ) మరో కౌన్సెలింగ్ నిర్వహించనుంది.
గత ఏడాది టాపర్లు ఎవరు, ఎన్ని మార్కులు సాధించారు?
గత ఏడాది ఐఐటీ ప్రవేశ పరీక్షలో ఐఐటీ హైదరాబాద్ జోన్‌కు చెందిన వావిలాల చిద్విలాస్ రెడ్డి టాపర్‌గా నిలిచాడు. అభ్యర్థి 360 మార్కులకు గాను 341 మార్కులు సాధించాడు.
మహిళా అభ్యర్థుల్లో అదే మండలానికి చెందిన నాయకంటి నాగ భవ్యశ్రీ 360కి 298 మార్కులతో టాపర్‌గా నిలిచింది. ఆమె ఓవరాల్ ర్యాంక్ 56వ స్థానంలో ఉంది.
టాప్-10 ర్యాంకు హోల్డర్లలో ఆరుగురు ఐఐటీ-హైదరాబాద్ జోన్‌కు చెందినవారు కాగా, ఇద్దరు ఐఐటీ ఢిల్లీ, రూర్కీ జోన్లకు చెందినవారు కావడం గమనార్హం.
సంబంధిత కథనం