NEET UG 2024 : నీట్​ పేపర్​ లీక్​ అయ్యిందా? 67మందికి ఫస్ట్​ ర్యాంక్​పై ఎన్​టీఏ స్పందన ఇది..-neet ug 2024 nta explains why an unprecedented 67 students got air 1 rank ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Neet Ug 2024 : నీట్​ పేపర్​ లీక్​ అయ్యిందా? 67మందికి ఫస్ట్​ ర్యాంక్​పై ఎన్​టీఏ స్పందన ఇది..

NEET UG 2024 : నీట్​ పేపర్​ లీక్​ అయ్యిందా? 67మందికి ఫస్ట్​ ర్యాంక్​పై ఎన్​టీఏ స్పందన ఇది..

Sharath Chitturi HT Telugu
Jun 07, 2024 06:06 AM IST

NEET UG 2024 results : నీట్​ యూజీ 2024 కోసం మొత్తం 20.38 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు రిజిస్టర్ చేసుకోగా 11.45 లక్షల మంది అర్హత సాధించారు. 67 మంది విద్యార్థులు ఆలిండియా ర్యాంక్ (ఏఐఆర్) 1 సాధించారు.

నీట్​ యూజీ 2024పై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో అనుమానాలు!
నీట్​ యూజీ 2024పై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో అనుమానాలు!

NEET UG 2024 scam : నీట్ యూజీ 2024లో 67 మంది విద్యార్థులు ఆలిండియా ఫస్ట్​ ర్యాంకును సాధించడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దఫా జరిగిన నీట్​ పరీక్షలో పేపర్​ లీక్​ అయ్యిందని కొందరు, భారీ స్కామ్​ జరిగిదని ఇంకొందరు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఈ నీట్​ యూజీ 2024 వివాదంపై ఎన్​టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) తాజాగా స్పందించింది.

నీట్​ యూజీ 2024లో స్కామ్​ జరిగిందా?

సులువైన పరీక్ష, రిజిస్ట్రేషన్లు పెరగడం, రెండు సరైన సమాధానాలతో కూడిన ప్రశ్న, పరీక్ష సమయం తగ్గడం వల్ల గ్రేస్ మార్కులు ఇవ్వడం వంటివి.. నీట్​ యూజీ 2024లో విద్యార్థులు ఎక్కువ మార్కులు సాధించడానికి కారణాలుగా ఎన్​టీఏ పేర్కొంది.

నీట్ యూజీ 2024 పరీక్షకు మొత్తం 20.38 లక్షల మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, వారిలో 11.45 లక్షల మంది అర్హత సాధించారు.

Neet UG paper leak : “ఎన్​సీఈఆర్​టీ పుస్తకంలో మార్పు ప్రకారం ఒక ప్రశ్నకు రెండు సరైన సమాధానాలు ఉన్నాయి. ఇచ్చిన రెండు ఆప్షన్లను ఎన్​సీఈఆర్​టీ తమ పాత, కొత్త పుస్తకాల్లో సరిగ్గా గుర్తించింది. నీట్ యూజీ 2024లో ఒరిజినల్ వన్ ఆన్సర్ నుంచి రెండు ఆప్షన్లు సరైనవిగా ప్రకటించాము. 44 మంది అభ్యర్థుల మార్కులు 715 నుంచి 720కి పెరిగాయి,” అని ఎన్​టీఏ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

ఫలితాలు వెలువడిన తర్వాత నీట్​ యూజీ 2024లో రికార్డు స్థాయిలో టాపర్లు నమోదవ్వడం, రూల్స్​ ప్రకారం ఇప్పటివరకు ఎప్పుడు లేని విధంగా 718, 719 మార్కులు కూడా కొందరు సాధించడంపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన పెరిగింది. పరీక్షల సమయంలో భారీ అవకతవకలు జరిగాయని సోషల్ మీడియా యూజర్లు ఆరోపిస్తున్నారు. మొత్తం 720 మార్కులతో రెండో అత్యధిక స్కోరు 716 సాధించగలిగినప్పటికీ.. కొందరు విద్యార్థులు 718, 719 మార్కులు ఎలా సాధించారని ఇతరులు అయోమయానికి గురవుతున్నారు.

అంతేకాకుండా.. టాపర్స్​లో కొందరు ఒకే ఎగ్జామ్​ సెంటర్​ నుంచి వచ్చిన వారు కూడా ఉండటంతో నీట్​ పేపర్​ లీక్​/ నీట్​ స్కామ్​పై ఆందోళనలు పెరిగాయి.

Neet paper leak scam : కానీ.. నీట్ యూజీ 2024 పరీక్షలో సమయం కోల్పోయినట్లు నివేదించిన అభ్యర్థులకు గ్రేస్ మార్కులు ఇవ్వడం వల్ల ఇలా 718, 719 మార్కులు వచ్చాయని ఎన్​టీఏ వివరించింది. కానీ ఏ ప్రాతిపదికన, ఎంత గ్రేస్​ మార్క్​లు ఇచ్చారో చెప్పలేదు.

"నీట్ యూజీ 2024 అభ్యర్థుల నుంచి ఎన్​టీఏకు కొన్ని విజ్ఞప్తులు/కోర్టు కేసులు వచ్చాయి. 2024 మే 5 న పరీక్ష నిర్వహణ సమయంలో సమయం వృధా అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి కేసులు/ విజ్ఞప్తులను ఎన్​టీఏ పరిగణనలోకి తీసుకుంది. నీట్ (యూజీ) 2024 అభ్యర్థులు ఎదుర్కొంటున్న సమయ నష్టాన్ని పరిష్కరించడానికి జూన్ 13, 2018 నాటి తీర్పు ద్వారా గౌరవ సుప్రీంకోర్టు రూపొందించి ఆమోదించిన నార్మలైజేషన్ ఫార్ములాను అమలు చేశాము," అని ఎన్​టీఏ ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది.

"కొన్ని కేంద్రాల్లో పరీక్షను ప్రారంభించడంలో జాప్యం కారణంగా గ్రేస్ మార్కులు ఇచ్చినట్లు ఎన్​టీఏ అంగీకరించింది. ఎన్ని మార్కులు ఇచ్చినా ఒక్క గ్రేస్ మార్కు కూడా ప్రశ్నార్థకమే. ఒకవేళ పరీక్ష ఆలస్యంగా ప్రారంభమైతే గ్రేస్ మార్కులు ఇవ్వడానికి బదులు ఎన్​టీఏ పరీక్షను రీషెడ్యూల్ చేసి ఉండాల్సింది," అని కాంపెటిషున్ ఫౌండర్, సీఈఓ మోహిత్ కుమార్ త్యాగి అన్నారు.

NEET UG 2024 : నీట్ యూజీ 2024 రిజిస్ట్రేషన్లు ఈ ఏడాది 16.85 శాతం పెరిగాయి. గతేడాది 20.59 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా ఈ ఏడాది 24,06,079 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

యూజీ రిజిస్ట్రేషన్ పెరగడంతో టాపర్ల సంఖ్య పెరిగిందని, ఈ ఏడాది పేపర్ సులువుగా ఉండటం కూడా టాపర్ల సంఖ్య పెరగడానికి దోహదపడిందని సీనియర్ అధికారి తెలిపారు.

నీట్ యూజీ పేపర్ లీకే ఆరోపణలను తోసిపుచ్చిన సదరు ఎన్​టీఏ అధికారి.. నీట్ యూజీ 2024 టాపర్లపై బ్యాక్​గ్రౌండ్​ చెక్ కూడా చేశామని తెలిపారు. నీట్ టాపర్లు 10వ తరగతి, 12వ తరగతిలో ఎక్కువ మార్కులు సాధించారని తెలిపారు.

Whats_app_banner

సంబంధిత కథనం