NEET UG 2024 Results: వైద్య విద్య కు సంబంధించిన అండర్ గ్రాడ్యుయేట్స్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే నీట్ యూజీ 2024 (NEET UG 2024) ఫలితాలను జూన్ 4, 2024 న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల కోసం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET UG 2024) కు హాజరైన అభ్యర్థులందరూ న్ టీఏ నీట్ అధికారిక వెబ్ సైట్ exams.nta.ac.in/NEET ఎ ద్వారా స్కోర్ కార్డులను చెక్ చేసుకోవచ్చు. ఎన్టీఏ నీట్ యూజీ ఫలితాలను కూడా neet.ntaonline.in తెలుసుకోవచ్చు.
నీట్ యూజీ 2024 స్కోర్లను చెక్ చేసుకోవడానికి అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ అవసరం. ప్రవేశ పరీక్షకు హాజరైన అభ్యర్థులు స్కోర్ కార్డులను చెక్ చేసుకుని డౌన్ లోడ్ చేసుకోవడానికిి కింది స్టెప్స్ ఫాలో కావాలి.
మే 5 న పరీక్ష
ఈ ఏడాది నీట్ యూజీ ప్రవేశ పరీక్షను 2024 మే 5న దేశవిదేశాల్లో నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు ఒకే షిఫ్టులో పరీక్ష నిర్వహించారు.నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ (యూజీ)-2024ను 14 నగరాలతో సహా దేశవ్యాప్తంగా 557 నగరాల్లోని వివిధ కేంద్రాల్లో 24 లక్షల మందికి పైగా అభ్యర్థులు రాశారు. నీట్ యూజీ 2024 ప్రొవిజనల్ ఆన్సర్ కీని మే 29న విడుదల చేయగా, 2024 జూన్ 1న అభ్యంతరాల విండోను మూసివేశారు. తుది ఆన్సర్ కీని 2024 జూన్ 3న విడుదల చేశారు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఎన్టీఏ నీట్ అధికారిక వెబ్ సైట్ ను చూడవచ్చు.