UPSC Prelims Admit Card : యూపీఎస్సీ ప్రిలిమ్స్​ అడ్మిట్​ కార్డులు విడుదల- ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి..-upsc prelims admit card 2024 civil services hall tickets out direct link here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Upsc Prelims Admit Card : యూపీఎస్సీ ప్రిలిమ్స్​ అడ్మిట్​ కార్డులు విడుదల- ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి..

UPSC Prelims Admit Card : యూపీఎస్సీ ప్రిలిమ్స్​ అడ్మిట్​ కార్డులు విడుదల- ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి..

Sharath Chitturi HT Telugu
Jun 07, 2024 01:40 PM IST

UPSC Prelims Admit Card download : యూపీఎస్సీ ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డు 2024 విడుదలైంది. సివిల్ సర్వీసెస్ హాల్​టికెట్లను డౌన్​లోడ్​ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్​తో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

యూపీఎస్సీ ప్రిలిమ్స్​ అడ్మిట్​ కార్డులు విడుదల..
యూపీఎస్సీ ప్రిలిమ్స్​ అడ్మిట్​ కార్డులు విడుదల..

UPSC Prelims Admit Card download link : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, యూపీఎస్సీ.. 2024 జూన్ 16న నిర్వహించనున్న సీఎస్ఈ (ప్రిలిమినరీ) ఎగ్జామినేషన్ 2024 అడ్మిట్ కార్డులను తాజాగా విడుదల చేసింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ upsc.gov.in ద్వారా హాల్​టికెట్లను డౌన్​లోడ్​ చేసుకోవచ్చు. ప్రత్యామ్నాయంగా.. upsconline.nic.in నుంచి కూడా హాల్ టికెట్లను డౌన్​లోడ్ చేసుకోవచ్చు.

యూపీఎస్సీ సీఎస్ఈ ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డ్ 2024 డౌన్​లోడ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

యూపీఎస్సీ సీఎస్ఈ ప్రిలిమ్స్ అడ్మిట్​ కార్డును ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి..

  • స్టెప్​1- upsc.gov.in అధికారిక వెబ్సైట్​ని సందర్శించండి.
  • స్టెప్​ 2- హోమ్ పేజీలో అడ్మిట్ కార్డు డౌన్​లోడ్ చేసుకోవడానికి లింక్​ని వెతికి దానిపై క్లిక్ చేయండి.
  •  UPSC admit card 2024 dowload  స్టెప్​ 3- అవసరమైన లాగిన్ వివరాలు నమోదు చేయాలి.
  • స్టెప్​ 4- అడ్మిట్ కార్డులను స్క్రీన్​ చూడొచ్చు.
  • స్టెప్​ 5- వివరాలను ధృవీకరించండి. తదుపరి అవసరం కోసం పేజీని డౌన్​లోడ్​ చేయండి.

ఇదీ చూడండి:- NEET UG 2024 : నీట్​ పేపర్​ లీక్​ అయ్యిందా? 67మందికి ఫస్ట్​ ర్యాంక్​పై ఎన్​టీఏ స్పందన ఇది..

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్ష 2024 ఆబ్జెక్టివ్ టైప్ పరీక్ష, దీనిని 2 సెషన్లలో నిర్వహిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు తదుపరి రౌండ్​కు వెళతారు. యూపీఎస్సీ సీఎస్​ఈ మెయిన్స్ రెండు భాగాలను కలిగి ఉంటుంది - రాత పరీక్ష, ఇంటర్వ్యూ (పర్సనాలిటీ టెస్ట్).

UPSC admit card 2024 CSE prelims : ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్), ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్), ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) సహా వివిధ కేంద్ర ప్రభుత్వ సర్వీసులు, విభాగాల్లో సుమారు 1056 పోస్టులను భర్తీ చేయాలని యూపీఎస్సీ యోచిస్తోంది.

రిక్రూట్మెంట్​లో పర్సన్స్ విత్ బెంచ్మార్క్ డిజేబిలిటీ కేటగిరీకి 40 ఖాళీలు ఉన్నాయి.

మరింత సమాచారం కోసం అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్​ని సందర్శించవచ్చు.

యూపీఎస్సీ నోటిఫికేషన్​- పోస్టుల వివరాలు..

డిప్యూటీ సూపరింటెండింగ్ ఆర్కియాలజికల్ కెమిస్ట్, డిప్యూటీ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్, సివిల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీసర్, స్పెషలిస్ట్ గ్రేడ్ 3, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఫోరెన్సిక్ మెడిసిన్ తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ని కొన్ని రోజుల క్రితం విడుదల చేసింది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ). అర్హులైన అభ్యర్థులు జూన్ 13, 2024లోగా యూపీఎస్సీ అధికారిక వెబ్​సైట్​ upsconline.nic.in లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

పోస్టుల వివరాలు..

ఆర్కియాలజీలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్: 4 పోస్టులు

ఆర్కియాలజీలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్: 67 పోస్టులు

సివిల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీసర్, ఇంటిగ్రేటెడ్ హెడ్క్వార్టర్స్ (నేవీ), డైరెక్టరేట్ ఆఫ్ సివిలియన్ పర్సనల్: 4 పోస్టులు

UPSC recruitment 2024 : స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఫోరెన్సిక్ మెడిసిన్): 6 పోస్టులు

స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ (జనరల్ మెడిసిన్): 61 పోస్టులు

స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ (జనరల్ సర్జరీ): 39 పోస్టులు

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం