తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Sharad Pawar : ‘అదానీని టార్గెట్​ చేశారు.. దర్యాప్తు అనవసరం’- కాంగ్రెస్​కు శరద్​ పవార్​ షాక్​!

Sharad Pawar : ‘అదానీని టార్గెట్​ చేశారు.. దర్యాప్తు అనవసరం’- కాంగ్రెస్​కు శరద్​ పవార్​ షాక్​!

Sharath Chitturi HT Telugu

08 April 2023, 7:19 IST

    • Sharad Pawar on Adani : అదానీ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్​. ఇవి విపక్షాలకు షాక్​ ఇచ్చే విధంగా ఉన్నాయి.
శరద్​ పవార్​
శరద్​ పవార్​ (HT_PRINT)

శరద్​ పవార్​

Sharad Pawar on Adani : కాంగ్రెస్​తో పాటు ఇతర విపక్షాలకు షాకిస్తూ.. అదానీ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్​. అదానీని టార్గెట్​ చేసినట్టు అనిపిస్తోందని, హిన్​డెన్​బర్గ్​ నివేదిక ఆధారంగా.. అదానీ కంపెనీలపై విపక్షాలు కోరుతున్నట్టు జేపీసీ (జాయింట్​ పార్లమెంటరీ కమిటీ) దర్యాప్తు అనవసరం అని అన్నారు.

‘అదానీని టార్గెట్​ చేశారు’

ఓ జాతీయ మీడియాకు ఇటీవలే ఇంటర్వ్యూ ఇచ్చారు శరద్​ పవార్​. దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన హిన్​డెన్​బర్గ్​- అదానీ వ్యవహారంపై ఈ మేరకు వ్యాఖ్యానించారు పవార్​.

Sharad Pawar NDTV : "ఎవరో ఏదో స్టేట్​మెంట్​ ఇచ్చారు. అది దేశంలో గందరగోళానికి దారితీసింది. ఇలాంటి స్టేట్​మెంట్స్​ ముందు కూడా వచ్చాయి. కానీ ఇలాంటి వాటికి ఈసారి చాలా ప్రాముఖ్యత ఇస్తున్నారు. అసలు ఈ నివేదికను ఎవరు లేవనెత్తారు? అని ఆలోచించాలి. నివేదిక వెనుక ఎవరున్నారో మనకి తెలియదు. వారి బాక్​గ్రౌండ్​ ఏంటి? అన్నది తెలియదు. ఇలాంటివి బయటకొస్తే ఆందోళనలు మొదలవుతాయి. ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ విషయాలను మనం పట్టించుకోకుండా ఉండలేము. అదానీని టార్గెట్​ చేస్తున్నట్టు అనిపిస్తోంది," అని శరద్​ పవార్​ అన్నారు.

అదానీ గ్రూప్​ ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉందని, ఆ సంస్థ స్టాక్​ మేన్యుప్యులేషన్​కు పాల్పడుతోందని ఈ ఏడాది జనవరిలో ఓ నివేదికను విడుదల చేసింది హిన్​డెన్​బర్గ్​ సంస్థ. ఇది ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టించింది. అదానీ సంస్థల విలువ, స్టాక్స్​ ధరలు అమాతం పడిపోయాయి. మరోవైపు ఈ వ్యవహారంపై పార్లమెంట్​తో పాటు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాయి విపక్షాలు. ముఖ్యంగా.. అదానీకి వ్యతిరేకంగా కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ తరుణంలో.. విపక్షంలోని కీలక నేతల్లో ఒకరైన శరద్​ పవార్​ ఈ విధంగా స్పందించడం గమనార్హం.

‘దర్యాప్తు ఎందుకు అవసరం లేదంటే..’

Adani Hindenburg issue : అయితే.. తన మాటలకు క్లారిఫికేషన్​ కూడా ఇచ్చారు ఎన్​సీపీ అధినేత. అదానీ వ్యవహారంపై సుప్రీంకోర్టు కమిటీ పరిశీలిస్తున్న నేపథ్యంలో జేపీసీ దర్యాప్తు అవసరం లేదన్నారు.

"ఈరోజున పార్లమెంట్​లో మెజారిటీ ఎవరికి ఉంది? అధికారపక్షానికే కదా. ఈ వ్యవహారం రూలింగ్​ పార్టికి వ్యతిరేకంగా ఉంది. జేపీసీలో అధికారపక్షానికి చెందిన నేతలో ఎక్కువగా ఉంటారు. మరి అలాంటప్పుడు నిజం ఎలా బయటకొస్తుంది? అందుకే జేపీసీ అవసరం లేదనిపిస్తోంది. అదానీ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఓ ప్యానెల్​ను ఏర్పాటు చేసింది. ఆ ప్యానెల్​ దర్యాప్తు చేస్తోంది. అక్కడ నిజయం బయటపడేందుకు అవకాశాలు కాస్త ఎక్కువగా ఉన్నాయి," అని శరద్​ పవార్​ అభిప్రాయపడ్డారు.

Congress Adani news : హిన్​డెన్​బర్గ్​- అదానీ వ్యవహారంపై గత నెలలో సర్వోన్నత న్యాయస్థానం ఏర్పాటు చేసిన ప్యానెల్​.. మరో నెల రోజుల్లో తన నివేదికను సమర్పించాల్సి ఉంది.

తదుపరి వ్యాసం