Omicron | దేశంలో బీఏ.4, బీఏ.5 వేరియంట్లు నిర్ధరణ..!
22 May 2022, 21:58 IST
- ఒమిక్రాన్ సబ్వేరింట్లైన బీఏ.4, బీఏ.5 దేశంలో ఉన్నట్టు ఐఎన్ఎస్ఏసీఓజీ నిర్ధరించింది. తమిళనాడు, తెలంగాణల్లో కేసులు వెలుగు చూసినట్టు పేర్కొంది.
దేశంలో బీఏ.4, బీఏ.5 వేరియంట్లు నిర్ధరణ
Omicron Sub variant | దేశంలోకి బీఏ.4, బీఏ.5 కొవిడ్ వేరియంట్లు ప్రవేశించినట్టు ఐఎన్ఎస్ఏసీఓజీ నిర్ధరించింది. తమిళనాడు, తెలంగాణల్లో ఈ కేసులు వెలుగు చూసినట్టు స్పష్టం చేసింది. ఈ రెండు.. ఒమిక్రాన్ సబ్వేరియంట్లు అని పేర్కొంది.
తమిళనాడుకు చెందిన 19ఏళ్ల యువతిలో ఒమిక్రాన్ బీఏ.4 సబ్ వేరియంట్‌ను గుర్తించారు. ఆమెకు స్వల్ప లక్షణాలే ఉన్నాయి. కాగా ఆమె కొవిడ్ టీకా రెండు డోసులు తీసుకుంది.
తెలంగాణలోని 80ఏళ్ల వృద్ధుడికి బీఏ.5 పాజిటివ్‌గా తేలింది. ఆయనకు కూడా లక్షణాలు స్వల్పంగానే ఉన్నాయి. ఆయనకు రెండు డోసుల టీకా ముందే ఇచ్చారు. ఎక్కడికి ప్రయాణించకపోయినా.. రోగికి ఈ కొత్త రకం వేరియంట్ సోకడం ఆందోళకరంగా మారింది.
ఈ క్రమంలో రంగంలోకి దిగిన ప్రభుత్వం.. కాంటాక్ట్ ట్రేసింగ్ చేపట్టింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వివరాలు సేకరిస్తోంది.
ఈ రెండు వేరియంట్లు.. తొలుత దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చాయి. కాగా.. ఇతర వేరియంట్లతో పోల్చుకుంటే ఈ రెండు.. అంత ప్రమాదకరం కాదని తేలింది. ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంది.
టాపిక్