తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Indonesia Earthquake : ఇండోనేషియాలో భారీ భూకంపం.. ఆస్ట్రేలియాను తాకిన ప్రకంపనలు!

Indonesia Earthquake : ఇండోనేషియాలో భారీ భూకంపం.. ఆస్ట్రేలియాను తాకిన ప్రకంపనలు!

10 January 2023, 6:56 IST

    • Indonesia Earthquake today : ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. ఆస్ట్రేలియా వరకు భూ ప్రకంపనలు వ్యాపించాయి! కాగా ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది.
ఇండోనేషియాలో భారీ భూకంపం
ఇండోనేషియాలో భారీ భూకంపం (HT_PRINT)

ఇండోనేషియాలో భారీ భూకంపం

Indonesia Earthquake today : భారీ భూకంపంతో ఇండోనేషియా మరోమారు గడగడలాడింది. రిక్టార్​ స్కేల్​పై 7.6 తీవ్రత నమోదైన ఈ భూకంపం.. అనేక భవనాలను నేలకూల్చినట్టు తెలుస్తోంది. తాజా ఘటనతో.. ఇండోనేషియా నుంచి దాదాపు 3,500 కి.మీల దూరంలో ఉన్న ఆస్ట్రేలియాలో కూడా ప్రకంపనలు వెలుగు చూశాయి.

ట్రెండింగ్ వార్తలు

Rain alert : తెలంగాణ, ఆంధ్రలో మరో వారం రోజుల పాటు వర్షాలు- ఆ ప్రాంతాల్లో మాత్రం..

Woman muscular photo: కండలు తిరిగిన యువతిపై ట్రోలింగ్.. అబ్బాయిలకు దిమ్మతిరిగే జవాబు ఇచ్చిన కోచ్

Diabetes medicine price cut: గుండెజబ్బులు, డయాబెటిస్ మందుల ధరలను తగ్గించిన ప్రభుత్వం

Uber ride horror: కారులో ఉబర్ డ్రైవర్ హస్తప్రయోగం; భయాందోళనలకు గురైన మహిళ

పపువా, తూర్పు నౌస టెంగ్గర రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో ప్రకంపనలు నమోదయ్యాయి. 7.6 తీవ్రతతో భూకంపం సంభవించడంతో.. ఇండోనేషియా అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. మూడు గంటల తర్వాత ఆ హెచ్చరికలను ఉపసంహరించుకున్నారు.

Indonesia Earthquake news : నైరుతి మలుకులోని పలు గ్రామాల్లో భవనాలు భారీగా దెబ్బతిన్నాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. కాగా.. ఇండోనేషియా భూకంపం ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది.

అమెరికా జియోలాజికల్​ సర్వే ప్రకారం.. సముద్రానికి 105 కి.మీల అడుగున భూకంపం సంభవించింది. భూకంపం కేంద్రీకృతమైన ప్రాంతం.. ఉత్తర ఆస్ట్రేలియాకు సమీపంలో ఉంది. సముద్రంలో లోతుగా వచ్చే భూకంపాల వల్ల.. భూమి మీద పెద్దగా ప్రభావం ఉండదు. కానీ చాలా దూరం వరకు ప్రకంపనలు నమోదవుతాయి. ఈసారి ఇదే జరిగింది.

Indonesia Earthquake news today : డార్విన్​ నగరం సహా ఉత్తర ఆస్ట్రేలియాలోని 1000కిపైగా మంది ప్రజలు.. భూ ప్రకంపనలతో భయపడినట్టు ఆ దేశ జియోసైన్స్​ విభాగం వెల్లడించింది. పలు ప్రాంతాల్లో.. ప్రజలు ప్రాణాలను అరచేతిలో పట్టుకుని అర్థరాత్రి వేళ ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. "నా జీవితంలో ఇంత సుదీర్ఘమైన భూ ప్రకంపనలను ఎప్పుడు చూడలేదు. చాలా భయమేసింది," అని ట్వీట్​ చేశారు ఆస్ట్రేలియాలోని ప్రముఖ సింగర్​ వాస్సి.

భూకంపం కారణంగా.. సునామీ వచ్చే ప్రమాదం లేదని ది జాయింట్​ ఆస్ట్రేలియన్​ సునామీ వార్నింగ్​ సెంటర్​ వెల్లడించింది.

భూకంపాల అడ్డా.. ఇండోనేషియా!

Earthquake in Indonesia : ఇండోనేషియాలో తరచూ భూకంపలు సంభవిస్తూనే ఉంటాయి. పెసిఫిక్​ 'రింగ్​ ఆఫ్​ ఫైర్​' ప్రాంతం మీద ఇండోనేషియా ఉండటమే ఆ దేశానికి శాపమైంది. ఈ ప్రాంతంలో చాలా అగ్నిపర్వతాలు కూడా ఉన్నాయి.

గతేడాది నవంబర్​లో సంభవించిన భూకంపంలో ఇండోనేషియాలోని 150కిపైగా మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. పర్వత ప్రాంతమైన పశ్చిమ జావాలోని సింజూర్​ పట్టణంలో సంభవించింది ఈ భూకంపం. ఈ ప్రాంతంలో 2.5మిలియన్​ మంది జీవిస్తున్నారు. భూకంపం ధాటికి అనేక భవనాలు నేలకూలాయి. ఇండోనేషియా విపత్త నిర్వహణ సంస్థ ప్రకారం.. భూప్రకంపనల ధాటికి 2,200కుపైగా ఇళ్లు కూలిపోయాయి. 5,300మంది ప్రజలు గల్లంతయ్యారు.

తదుపరి వ్యాసం