Texas earthquake : టెక్సాస్​లో అత్యంత శక్తివంతమైన భూకంపం..!-54 quake jolts west texas one of state s strongest ever ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Texas Earthquake : టెక్సాస్​లో అత్యంత శక్తివంతమైన భూకంపం..!

Texas earthquake : టెక్సాస్​లో అత్యంత శక్తివంతమైన భూకంపం..!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Dec 17, 2022 09:29 AM IST

Texas earthquake today : టెక్సాస్​లో భూకంపం సంభవించింది. రిక్టార్​ స్కేల్​పై 5.4 తీవ్రత నమోదైంది.

టెక్సాస్​లో శక్తివంతమైన భూకంపం..
టెక్సాస్​లో శక్తివంతమైన భూకంపం..

Texas earthquake today : అమెరికా టెక్సాస్​లో భూకంపం సంభవించింది. టెక్సాస్​ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన భూకంపాల్లో ఒకటిగా దీనిని పరిగణిస్తున్నారు. చమురు ఉత్పత్తి కేంద్రాలు అధికంగా ఉండే పశ్చిమ టెక్సాస్​ ప్రాంతంలో భూ ప్రకంపనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.

స్థానిక కాలమానం ప్రకారం.. శుక్రవారం సాయంత్రం 5:35 గంటలకు.. భూకంపం సంభవించింది. మిడ్​ల్యాండ్​ ప్రాంతానికి ఉత్తర-వాయువ్యం వైపు 14 మైళ్ల దూరంలో భూమికి 8కి.మీల దిగువన భూ ప్రకంపనలను గుర్తించినట్టు యూఎస్​ జీయోలాజికల్​ సర్వే ప్రకటన విడుదల చేసింది. రిక్టార్​ స్కేల్​పై దాని తీవ్రత 5.4గా నమోదైంది. టెక్సాస్​ చరిత్రలో ఇది 4వ అతిపెద్ద భూకంపం అని నేషనల్​ వెథర్​ సర్వీసెస్​ పేర్కొంది.

ఈ భూకంపం తర్వాత.. మూడు నిమిషాలకు.. 3.3 తీవ్రతతో మళ్లీ భూ ప్రకంపనలు నమోదైనట్టు తెలుస్తోంది.

West Texas earthquake : టెక్సాస్​లోని అమరిల్లో, అబిలెనె నుంచి న్యూ మెక్సికో కార్ల్​స్​బాద్​ వరకు భూ ప్రకంపనలను గుర్తించారు. దాదాపు 1500మంది ప్రజలు.. భూప్రకంపనలతో భయపడ్డారు.

"ఇలాంటి ప్రాంతాల్లో భూకంపం వస్తే.. దాని తీవ్రత 100 మైళ్ల దూరం వరకు కూడా తెలుస్తుంది," అని యూఎస్​జీఎస్​ జాతీయ భూకంప సమాచార కేంద్రానికి చెందిన జియోఫిసిసిస్ట్​ జన పుర్స్​లే పేర్కొన్నారు.

పశ్చిమ టెక్సాస్​లో గత నెల 16న భూకంపం సంభవించింది. రిక్టార్​ స్కేల్​పై దాని తీవ్రత 5.3గా నమోదైంది.

భూకంపాల ప్రపంచం..!

Indonesia earthquake news : ప్రపంచవ్యాప్తంగా భూకంపాల ఘటనలు ఇటీవలి కాలంలో పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఇండోనేషియాలో భూకంపాల సంఖ్య ఆందోళనకరంగా ఉంది. గత నెల 21న సంభవించిన భూకంపంలో 160కిపైగా మంది ప్రాణాలు కోల్పోయారు.

పర్వత ప్రాంతమైన పశ్చిమ జావాలోని సింజూర్​ పట్టణంలో ఈ భూకంపం సంభవించింది. రిక్టార్​ స్కేలుపై భూకంపం తీవ్రత 5.6గా నమోదైంది. ఈ ప్రాంతంలో 2.5మిలియన్​ మంది జీవిస్తున్నారు. భూకంపం ధాటికి అనేక భవనాలు నేలకూలాయి.

ఇండోనేషియా విపత్త నిర్వహణ సంస్థ ప్రకారం.. భూప్రకంపనల ధాటికి 2,200కుపైగా ఇళ్లు కూలిపోయాయి. 5,300మంది ప్రజలు గల్లంతయ్యారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం