Train cancellation refund : ట్రైన్ రద్దు అయితే.. రీఫండ్ ఎలా పొందాలి?
26 March 2024, 12:07 IST
- Train cancelled refund : మీరు ప్రయాణించాల్సిన ట్రైన్ క్యాన్సిల్ అయ్యిందా? రీఫండ్ వస్తుందా- లేదా? అని ఆలోచిస్తున్నారా? రీఫండ్ ఎలా పొందాలో తెలియదా? అయితే.. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ట్రైన్ క్యాన్సిల్ అయితే.. రీఫండ్ ఎలా పొందాలి?
How to get refund for cancelled train : రైల్వే ట్రాక్ మరమ్మత్తులనో, వర్షాలనో, మంచు కురుస్తోందనో.. అనేకమార్లు రైళ్లు రద్దవుతూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో ఇలాంటి వార్తలు తరచూ వింటూనే ఉంటున్నాము. మరి.. ట్రైన్ రద్దు అయితే.. టికెట్ డబ్బులు తిరిగొస్తాయా? రీఫండ్ ఎలా పొందాలి? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
ట్రైన్ రద్దు అయితే.. రీఫండ్ ఎలా పొందాలి?
రీఫండ్ ఎలిజిబులుటీని వెరిఫై చేసుకోండి:- మీరు ప్రయాణించాల్సిన రైలు మూడు గంటలు లేదా అంత కన్నా ఎక్కువ ఆలస్యమైతే.. మీకు ఫుల్ టికెట్ రీఫండ్ లభిస్తుంది. ఈ విషయం.. రైల్వే రూల్స్‌లోనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు టికెట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు.
రైల్వే కౌంటర్స్‌లో టికెట్‌ని బుక్ చేసుకుని ఉంటే.. మళ్లీ అదే కౌంటర్స్ దగ్గరికి వెళ్లి క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంది. ఆన్లైన్లో తీసుకుంటే మాత్రం.. ఐఆర్సీటీసీ వెబ్సైట్లోకి వెళ్లి అక్కడ చెప్పిన విధంగా టికెట్‌ని క్యాన్సిల్ చేసుకోవచ్చు.
టికెట్ డిపాజిట్ రిసిప్ట్:- ఛార్ట్ తయారైన తర్వాత.. మీరు ప్రయాణించాల్సిన రైలు మాటిమాటికి ఆలస్యమవుతుంటే.. టీడీఆర్ అప్లై చేసుకుని టికెట్‌ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఐఆర్‌సీటీసీలోకి లాగిన్ అయ్యి, అక్కడ చెప్పిన విధంగా టికెట్‌ని రద్దు చేసుకోవాలి.
If train is cancelled how to get refund : ట్రైన్ రద్దు అయితే రీఫండ్ పొందొచ్చా:- ఏదైన ట్రైన్‌ని భారతీయ రైల్వే రద్దు చేస్తే.. ప్యాసింజర్లకు ఆటోమెటిక్‌గా డబ్బులు రీఫండ్ అవుతాయి. ఆన్లైన్లో ఈ-టికెట్స్ బుక్ చేసుకున్న వారికి.. 3 నుంచి 7 రోజుల వ్యవధిలో బ్యాంక్ అకౌంట్లో డబ్బులు క్రెడిట్ అవుతాయి. కౌంటర్లలో టికెట్లు బుక్ చేసుకున్న వారు మాత్రం.. మళ్లీ కౌంటర్‌కు వెళ్లి, టికెట్‌ని చూపించి, రీఫండ్ పొందాల్సి ఉంటుంది. ట్రైన్ క్యాన్సిల్ అయిన 3 రోజుల లోపు. రీఫండ్ కోసం కౌంటర్‌కు వెళ్లి, టికెట్‌ని సరెండర్ చేయాల్సి ఉంటుంది. వీటన్నింటికీ క్యాన్సిలేషన్ ఛార్జీలు ఉండవు. మొత్తం డబ్బులు రీఫండ్ అవుతాయి.
అయితే.. ప్రయాణికులు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ట్రైన్ క్యాన్సిల్ అయితే.. ఆ సందర్భంలో ప్యాసింజర్లు వ్యక్తిగతంగా టికెట్‌ని క్యాన్సిల్ చేసుకునేందుకు ప్రయత్నించకూడదు. వాటికి ఆటోమెటిక్‌గా రీఫండ్ పడుతుంది. టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే మాత్రం.. డబ్బులు పడవు.
Refund for train cancellation : రైలు ఆలస్యమైన, వాతావరణం మార్పులు లేదా అవాంఛనీయ కారణాలతో రద్దు అయితేనే.. పైన చెప్పినవి అప్లై అవుతాయి. మీ వ్యక్తిగత ప్లాన్స్‌కి అనుగుణంగా.. రైలు టికెట్‌ని రద్దు చేసుకోవాలి అని అనుకుంటే.. అందుకే వేరే మార్గం ఉంటుంది. పైగా.. క్యాన్సిలేషన్ ఛార్జీ పడే అవకాశం ఉంది.
రైలుకు సంబంధించిన పూర్తి, తాజా వివరాల కోసం ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ఉండండి. తద్వారా.. ఏదైనా రైలు రద్దు అయితే, మీరు ముందుగానే అప్రమత్తమై.. అందుకు తగ్గట్టు ప్లాన్ చేసుకోవచ్చు.