IRCTC medical tourism services : అందుబాటులోకి ఐఆర్​సీటీసీ మెడికల్​ టూరిజం సేవలు!-irctc now offers online medical tourism services how to avail it ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Irctc Now Offers Online Medical Tourism Services. How To Avail It

IRCTC medical tourism services : అందుబాటులోకి ఐఆర్​సీటీసీ మెడికల్​ టూరిజం సేవలు!

Sharath Chitturi HT Telugu
Oct 06, 2022 07:19 AM IST

IRCTC medical tourism services : మెడికల్​ టూరిజం సేవలను ప్రారంభించింది ఐఆర్​సీటీసీ. ఆ వివరాలు..

అందుబాటులోకి ఐఆర్​సీటీసీ మెడికల్​ టూరిజం సేవలు
అందుబాటులోకి ఐఆర్​సీటీసీ మెడికల్​ టూరిజం సేవలు

IRCTC medical tourism services : ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించేందుకు నిత్యం కృషి చేసే ఐఆర్​సీటీసీ(ఇండియన్​ రైల్వే కేటరింగ్​ అండ్​ టూరిజం కార్పొరేషన్​).. మరో కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా.. ఆన్​లైన్​ మెడికల్​ టూరిజం ప్యాకేజీలను కస్టమర్ల కోసం తీసుకొచ్చింది!

పైలట్​ బేసిస్​లో చేపట్టిన ఈ పథకంలో భాగంగా మెడికో- టెక్నికల్​ ఆన్​లైన్​ సేవల కంపెనీతో భాగస్వామ్యం ఏర్పరచుకుంది ఐఆర్​సీటీసీ. వివిధ వైద్య, ఆరోగ్య ప్యాకేజీలు తీసుకున్న కస్టమర్లకు పూర్తిగా బ్యాక్​ ఎండ్​ సేవలను అందించడమే వీటి ముఖ్య ఉద్దేశం. ప్రయాణంలో వసతి, రోడ్డు రవాణా సహా వైద్య విలువలను కూడా జోడించి ప్రయాణికులకు సౌకర్యాన్ని ఇచ్చేందుకు ఈ మేరకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. చికిత్స అనంతరం ఆప్షనల్​ వెల్​నెస్​ ప్యాకేజీ కూడా అందుబాటులో ఉంటుంది.

IRCTC online medical tourism : ఇతరులకు పోటీగా.. ఐఆర్​సీటీసీ కూడా తన మెడికల్​ ట్రీట్​మెంట్​, వెల్​నెస్​ ప్యాకేజీల ధరలను నిర్ణయించింది. ఇందుకోసం ఆసుపత్రులు, నర్సింగ్​ హోమ్​లు, డయగ్నొస్టిక్​ సెంటర్లు వంటి నెట్​వర్క్​ను రూపొందించుకుంది.

ఐఆర్​సీటీసీ మెడికల్​ టూరిజం సర్వీసు ఎలా పొందాలంటే..

  • ముందుగా www.irctctourism.com/MedicalTourism వెబ్​సైట్​కి వెళ్లాలి.
  • అక్కడ కొన్ని వివరాలను ఫిల్​ చేయాల్సి ఉంటుంది.
  • మీకు ఎలాంటి చికిత్స కావాలో చెప్పాల్సి ఉంటుంది.
  • ఆ తర్వాత ఐఆర్​సీటీసీ బృందం మీకు ఫోన్​ చేసి, మీ పూర్తి వివరాలు, మీకు కావాల్సిన చికిత్స వంటి ఆప్షన్లు వివరిస్తుంది. బడ్జెట్​ అంశాలను కూడా చెబుతుంది.

IRCTC latest news : వైద్య చికిత్స కోసం విదేశాల నుంచి అనేకమంది ఇండియాకి వస్తూ ఉంటారు. ఐఐపీఏ(ఇండియన్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ పబ్లిక్​ అడ్మినిస్ట్రేషన్​) ప్రకారం.. ఒక్క 2019లోనే 6.97లక్షల మంది మెడికల్​ టూరిస్టులుగా ఇండియాకు వచ్చి చికిత్స చేయించుకున్నారు. 2023 నాటికి.. గ్లోబల్​ మెడికల్​ వాల్యూ టూరిజంలో ఇండియా వాటా 6శాతానికి చేరుతుందని అంచనా.

IPL_Entry_Point

సంబంధిత కథనం