తెలుగు న్యూస్  /  National International  /  Gujarat Polls: Only 139 Women Candidates In Fray Out Of Total 1,621 Contestants, 38 Of Them From Three Major Parties

Gujarat assembly elections : మొత్తం అభ్యర్థుల్లో.. మహిళలు 8శాతం మాత్రమే!

27 November 2022, 11:22 IST

  • Women candidates in Gujarat assembly elections : గుజరాత్​ ఎన్నికల్లో 1,621మంది బరిలో దిగుతున్నారు. వీరిలో 8శాతం మాత్రమే మహిళలు ఉన్నారు.!

బీజేపీ ప్రచారాల జోరు..
బీజేపీ ప్రచారాల జోరు.. (PTI)

బీజేపీ ప్రచారాల జోరు..

Gujarat assembly elections 2022 : 'రాజకీయాల్లో మహిళలకు ప్రాధాన్యత పెరగాలి,' అంటూ ప్రసంగాలు చేసే పార్టీల ప్రవర్తన.. ఎన్నికల విషయానికొచ్చేసరికి భిన్నంగా ఉంటోంది! త్వరలో జరగనున్న గుజరాత్​ ఎన్నికలే ఇందుకు ఉదాహరణ. గుజరాత్​లో దాదాపు 50శాతం మహిళా ఓటర్లు ఉన్నప్పటికీ.. ఈ దఫా ఎన్నికల్లో కనీసం 10శాతం మందికి కూడా టికెట్​ దొరకలేదు!

ట్రెండింగ్ వార్తలు

Crime news : 8ఏళ్ల బాలిక రేప్​- హత్య.. నిందితుడి వయస్సు 13ఏళ్లు!

Prajwal Revanna : కర్ణాటకను కుదిపేస్తున్న సెక్స్​ కుంభకోణం.. దేశాన్ని విడిచి వెళ్లిపోయిన రేవన్న!

Lok Sabha election : మొబైల్​ నెంబర్​తో మీ పోలింగ్​ స్టేషన్​ లొకేషన్​ని ఇలా తెలుసుకోండి..

Prachi Nigam : 'చాణక్యుడిని కూడా..'- ట్రోల్స్​పై స్పందించిన యూపీ క్లాస్​ 10 టాపర్​

నాడు.. నేడు..

182 సీట్లున్న గుజరాత్​ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం మీద 1620 మంది అభ్యర్థులు బరిలో దిగారు. వీరిలో కేవలం 139మంది మహిళలు ఉన్నారు. అంటే.. మొత్తం మీద మహిళల వాటా 8శాతం మాత్రమే! అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్​లు.. తమ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. కొందరికి మాత్రమే టికెట్లు కట్టబెట్టాయి. కానీ గత ఎన్నికలతో పోల్చుకుంటే.. పరిస్థితులు కాస్త మెరుగుపడటం ఊరటనిచ్చే విషయం.

Women candidates in Gujarat assembly elections : 2017 ఎన్నికల్లో.. 12మంది మహిళలకు టికెట్లు ఇచ్చింది బీజేపీ. ఈసారి ఆ సంఖ్య 18కి చేరింది. ఇక 2017 ఎన్నికల్లో 10మంది మహిళలను బరిలో దింపిన కాంగ్రెస్​.. ఈసారి 14మందికి టికెట్లు ఇచ్చింది. ఇందులోనూ.. దళిత, ఆదివాసి సంఘానికి ప్రాధాన్యతనిచ్చే విధంగా వ్యూహాత్మక చర్యలు చేపట్టాయి ఈ రెండు పార్టీలు.

పోటీలో ఉన్న 139మందిలో 56మంది మహిళలు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. ఆప్​ నుంచి ఆరుగురు మహిళలు మాత్రమే బరిలో నిలిచారు. అసదుద్దీన్​ ఓవైసీకి చెందిన ఏఐఎంఐఎం.. 13 సీట్లలో పోటీ చేస్తుండగా.. అందులో రెండు సీట్లను మహిళలకు కేటాయించింది. బీఎస్​పీకి చెందిన 13మంది మహిళలు ఎన్నికల్లో నిలిచారు.

2017 ఎన్నికల్లో మొత్తం మీద 1,828మంది ఎన్నికల బరిలో నిలిచారు. వీరిలో 126మంది మహిళలు ఉన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం.. 104మంది మహిళలు డిపాజిట్లు సైతం కోల్పోయారు. ఇక నాటి ఎన్నికల తర్వాత.. 13మంది మహిళలు అసెంబ్లీకి వెళ్లారు. వీరిలో నలుగురు కాంగ్రెస్​కు, మిగిలిన వారి బీజేపీకి చెందిన వారు ఉన్నారు. ఈసారి.. ఆ తొమ్మిది మందిలో నలుగురిని పక్కన పెట్టింది కమలదళం. కాంగ్రెస్​.. నలుగురిలో ఇద్దరిని విడిచిపెట్టేసింది.

'బిల్లు పాసైతే.. సీట్లు పెరుగుతాయి..'

రాజకీయాల్లో మహిళలకు ప్రాధాన్యత విషయంపై బీజేపీ, కాంగ్రెస్​లు స్పందించాయి.

BJP women candidates in elections : "మహిళలకు 33శాతం రిజర్వేషన్​ కల్పించాలని మేము పార్లమెంట్​లో బిల్లును ప్రవేశపెట్టాము. ఆ బిల్లును బీజేపీ పక్కన పెట్టేసింది. ఇంటి నుంచి బయటకు రాని రోజుల్లోనే.. స్వాతంత్ర్య ఉద్యమంలో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ కాంగ్రెస్​. అభివృద్ధి చెందిన దేశాల్లోనూ హక్కుల కోసం మహిళలు పోరాటం చేయాల్సి వస్తోంది," అని సయాజిగంజ్​ నుంచి పోటీచేస్తున్న కాంగ్రెస్​ అభ్యర్థి అమి రావత్​ పేర్కొన్నారు.

"ఈరోజు.. బీజేపీ నుంచి 18మంది సోదరీమణులు ఎన్నికల బరిలో నిలిచారు. రానున్న రోజుల్లో.. రాష్ట్ర కేబినెట్​లో వారికి అవకాశం లభిస్తుంది. వారిలో ఒకరు మహిళ-శిశు సంక్షేమశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు. రాజకీయాల్లో మహిళల ప్రాతినిథ్యం పెంచేందుకు బీజేపీ కట్టుబడి ఉంది. ప్రతి స్థాయిలో మహిళల ప్రాతినిథ్యం ఉన్న పార్టీ బీజేపీ," అని బీజేపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు దీపికాబెన్​ సర్వద తెలిపారు.

గుజరాత్​లో డిసెంబర్​ 1,5వ తేదీల్లో పోలింగ్​ జరగనుంది. డిసెంబర్​ 8న ఫలితాలు వెలువడనున్నాయి.