తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Dalit Woman Raped : దళిత మహిళపై సామూహిక అత్యాచారం- బీఫ్​ తినిపించి!

Dalit woman raped : దళిత మహిళపై సామూహిక అత్యాచారం- బీఫ్​ తినిపించి!

Sharath Chitturi HT Telugu

08 September 2023, 13:39 IST

google News
    • Dalit woman raped : యూపీలో దారుణం జరిగింది. దళిత మహిళను ఇద్దరు రేప్​ చేశారు. ఇందుకోసం మరో ముస్లిం మహిళ సాయం చేసింది!
దళిత మహిళపై అత్యాచారం..
దళిత మహిళపై అత్యాచారం..

దళిత మహిళపై అత్యాచారం..

Dalit woman raped : ఉత్తర్​ ప్రదేశ్​లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ దళిత మహిళను ఇద్దరు ముస్లింలు రేప్​ చేశారు. ఇందుకు మరో మహిళ సాయం చేసినట్టు తెలుస్తోంది.

ఇదీ జరిగింది..

ఉత్తర్​ ప్రదేశ్​ బరేలీ జిల్లాలో జరిగింది ఈ ఘటన. బాధితురాలికి ఓ ముస్లిం ఫ్రెండ్​ ఉంది. ఆమె నుంచి కొంత డబ్బు అప్పుగా తీసుకుంది. దానిని తిరిగి ఇవ్వాలని చెప్పి.. ఆ ముస్లిం మహిళను కలవాలని ఫోన్​ చేసింది.

ఈ నెల 2న వీరిద్దరు.. ఓ కేఫ్​లో కలిశారు. అయితే.. ఆ ముస్లిం మహిళతో పాటు మరో ఇద్దరు ముస్లింలు కూడా కేఫ్​కు వెళ్లారు. ఇక్కడే.. బాధితురాలని, ఆ ముస్లిం మహిళ ట్రిక్​ చేసినట్టు తెలుస్తోంది. దళిత మహిళను వారు ముగ్గురు హోటల్​కు తీసకెళ్లారు. ఆమె తిన్న ఫుడ్​లో డ్రగ్స్​ కలిపారు. ఆమె అపస్మారక స్థితిలోకి జారుకున్న తర్వాత.. మహిళపై ఆ ఇద్దరు ముస్లింలు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా.. ఆమెకు బీఫ్​ కూడా తినిపించినట్టు సమాచారం.

ఇదీ చూడండి:- Serial killer : వంట గదిలో 10 మృతదేహాలు.. ‘సీరియల్​ కిల్లర్’​ ఇంటిని చూసి పోలీసులే షాక్​!

Uttar Pradesh rape case : నిందితుల పేర్లు షోయబ్​, నజీమ్​. షోయబ్​.. స్థానికంగా బీ. ఫార్మా చదువుకుంటున్నాడు. షోయబ్​కు బార్బర్​గా పనిచేస్తున్నాడు. సామూహిక అత్యాచారానికి సంబంధించిన దృశ్యాలను.. నిందుతులు కెమెరాలో రికార్డ్​ చేశారు. వాటితో మహిళను బెదిరించడం మొదలుపెట్టారు. రూ. 5లక్షలు ఇవ్వాలని, లేదా వీడియోను లీక్​ చేస్తామని హెచ్చరించారు. అంతటితో ఆగకుండా.. ఆ దృశ్యాలను.. దళిత మహిళకు కాబోయే భర్తకు ఫార్వర్డ్​ చేశాడు.

తీవ్ర దుఖంలో ఉన్న మహిళకు ఏం చేయాలో అర్థం కాలేదు. చివరికి.. ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇద్దరు ముస్లింలను అరెస్ట్​ చేశారు. వారిద్దరు కశ్మీర్​కి పారిపోతుండగా.. పట్టుకున్నామని వెల్లడించారు. వారికి సాయం చేసిన మహిళను కూడా అదుపులోకి తీసుకున్నట్టు స్పష్టం చేశారు.

తదుపరి వ్యాసం