Woman paraded naked : మహిళను నగ్నంగా చేసి ఊరేగించిన భర్త!
Woman paraded naked : మహిళను నగ్నంగా చేసిన ఆమె భర్త, ఊరంతా ఊరేగించిన రాజస్థాన్‌లో వెలుగులోకి వచ్చింది. వేరే వ్యక్తితో ఆమె కలిసి జీవిస్తుండటమే ఇందుకు కారణం!
Woman paraded naked : రాజస్థాన్‌లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. భార్యను నగ్నంగా చేసిన ఓ వ్యక్తి, గ్రామంలో ఊరేగించాడు. ఇందుకు అతని కుటుంబసభ్యులు సాయం చేశారు!
ట్రెండింగ్ వార్తలు
ఇదీ జరిగింది..
సంబంధిత ఘటన రాజస్థాన్ ప్రతాప్‌గఢ్ జిల్లాలోని నిచాల్కోట అనే గ్రామంలో జరిగింది. బాధితురాలికి ఏడాది క్రితం వివాహమైంది. కానీ ఆమె అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో కలిసి ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో మహిళను, ఆమె భర్త తరఫు కుటుంబసభ్యులు గురువారం సాయంత్రం కిడ్నాప్ చేసి, వారి ఇంటి వద్దకు తీసుకెళ్లారు. అక్కడ, మహిళను ఆమె భర్త కొట్టాడు. అనంతరం ఆమెను నగ్నంగా చేశాడు. ఆ తర్వాత.. గ్రామంలో కిలోమీటర్ మేర ఊరేగించాడు. ఇందుకు.. అతని కుటుంబసభ్యులు కూడా సాయం చేశారు.
Woman paraded naked in Rajasthan : ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో ఆధారంగా పోలీసులు చర్యలు చేపట్టారు. గురువారం ఘటన జరగ్గా.. పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం తర్వాత సంబంధిత గ్రామానికి వెళ్లారు. పోలీసులను చూసి నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కొందరు గాయపడ్డారు. వారిని అరెస్ట్ చేసిన అధికారులు.. ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తోంది.
మహిళను నగ్నంగా చేసి, ఊరేగించిన ఘటనపై రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని హామీనిచ్చారు. ఈ మేరకు పోలీసులకు ఆదేశాలిచ్చారు. సీఎం ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
రాజకీయ దుమారం..
Rajasthan crime news : ఈ ఘటనపై రాజస్థాన్‌లో రాజకీయ దుమారం నెలకొంది. బీజేపీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు.
"ఈరోజు రాజస్థాన్ తలించుకునే ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. ఘటనపై పోలీసులకు అసలు సమాచారమే లేదు. మహిళలపై రేప్, నేరాల్లో రాజస్థాన్ నెం.1లో ఉండానికి కారణం ఇదే," అని బీజేపీ ఎంపీ సీపీ జోషి మండిపడ్డారు.
వాస్తవానికి ఇటీవలి కాలంలో రాజస్థాన్‌లో మహిళలపై నేరాలు నిత్యం వార్తల్లో నిలుస్తున్నాయి. అత్యాచారాలు, హత్యలు వంటి ఘటనలు రాష్ట్రంలోని ఏదో ఒక మూల వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. త్వరలోనే రాజస్థాన్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటనలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బందికి గురిచేస్తున్నాయి.
సంబంధిత కథనం