Serial killer : వంట గదిలో 10 మృతదేహాలు.. ‘సీరియల్ కిల్లర్’ ఇంటిని చూసి పోలీసులే షాక్!
Serial killer : ఓ ఇంట్లోని వంట గదిలో 10 మృతదేహాలను చూసి పోలీసులు షాక్ అయ్యారు. దారుణానికి ఒడిగట్టిన సీరియల్ కిల్లర్‌ను అరెస్ట్ చేశారు. ఈ ఘటన రువాండాలో వెలుగులోకి వచ్చింది.
Rwanda serial killer : రువాండా దేశంలో వెన్నులో వణుకు పుట్టించే ఉదంతం ఒకటి బయటకి వచ్చింది. ఓ సీరియల్ కిల్లర్.. 10మందిని అతి కిరాతకంగా చంపి, ఆ మృతదేహాలను తన ఇంటి వంటగదిలో పాతిపెట్టాడు! పలువురిని చంపే ముందు.. యాసిడ్ ఉన్న టిన్‌లో ముంచినట్టు తెలుస్తోంది.
ఇదీ జరిగింది..
ఈ సీరియల్ కిల్లర్ వయస్సు 34ఏళ్లు. కిగాలి నగరంలోని కికుకిరో అనే ప్రాంతంలో అతను ఓ ఇంట్లో రెంట్‌కి ఉంటాడు. అతడి ఇంట్లోని వంట గదిలో 10 మృతదేహాలను పోలీసులు గుర్తించారు. అయితే.. 10మృతదేహాలే ఉన్నాయా? ఇంకా ఎక్కువ ఉన్నాయా? అన్న విషయంపై రువాండా దర్యాప్తు సంస్థ స్పష్టతనివ్వలేదు. ఫోరెన్సీక్ దర్యాప్తు తరువాతే.. అసలు సంఖ్య బయటపడుతుందని అధికారులు చెప్పడంతో.. మృతదేహాల సంఖ్య 10 కన్నా ఎక్కువే ఉంటుందని అనుమానాలు మొదలయ్యాయి. ఈ వార్త దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది.
Rwanda serial killer arrested : వాస్తవానికి ఈ సీరియల్ కిల్లర్‌ను ఈ ఏడాది జులైలోనే పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగతనం, రేప్ కేసులో అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. కానీ సరైన ఆధారాలు లభించకపోవడంతో అతడికి బెయిల్ లభించింది. కానీ పోలీసుల్లో చాలా మందికి ఇతడిపై అనుమానం ఉంది. కాగా.. ఈ మంగళవారం నాడు పోలీసులు సీరియల్ కిల్లర్‌ను మళ్లీ అరెస్ట్ చేశారు. చివరికి.. ఇంట్లో సోదాలు నిర్వహించగా.. వంటింట్లోని నేల తవ్వి ఉండటాన్ని గమనించారు. ఆ నేలను తిరిగి తవ్వగా.. పెద్ద గొయ్యి కనిపించింది. అందులో ఉన్న మృతదేహాలను చూసి పోలీసులు షాక్ అయ్యారు.
"నిందితుడిని అరెస్ట్ చేశాము. తానే చంపినట్టు విచారణలో ఒప్పుకున్నాడు. కొందరిని యాసిడ్ ఉన్న టిన్‌లో ముంచినట్టు చెప్పాడు," అని రువాండా పోలీసులు వెల్లడించారు.
సీరియల్ కిల్లర్ టార్గెట్స్ వారే..!
చంపే ముందు.. ఈ సీరియల్ కిల్లర్, తన టార్గెట్స్‌ను స్టడీ చేసేవాడు. కుటుంబానికి దూరంగా ఉంటున్న వారు, ఫ్రెండ్స్ కూడా లేని మనుషులే ఇతడి టార్గెట్స్! మృతుల్లో పురుషులు, మహిళలు ఉన్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
Serial killer in Rwanda : "మృతుల్లో చాలా వరకు వ్యభిచారులే ఉన్నట్టు తెలుస్తోంది. వారిని తన ఇంటికి పిలిపించుకునేవాడు. ఆ తర్వాత వారి ఫోన్స్, విలువైన వస్తువులను దొంగలించే వాడు. చివరికి వారి గొంతు నులిమి హత్య చేసేవాడు. కిచెన్‌లో గొయ్యి తవ్వి.. వాటిని పాతిపెట్టేవాడు," అని పోలీసులు వెల్లడించారు. ఈ వ్యవహారం ఎంత కాలం నుంచి సాగుతోంది? అన్న ప్రశ్నకు ప్రస్తుతం సమాధానం లేదు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సీరియల్ కిల్లర్స్ నుంచి తాను హత్యలు చేయడం నేర్చుకున్నానని.. పోలీసుల విచారణలో నిందితుడు చెప్పాడు.
సంబంధిత కథనం