తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Cbse Class 10th Result 2024 : డిజీలాకర్​లో మీ మార్కులను ఇలా చెక్​ చేసుకోండి..

CBSE Class 10th result 2024 : డిజీలాకర్​లో మీ మార్కులను ఇలా చెక్​ చేసుకోండి..

Sharath Chitturi HT Telugu

26 March 2024, 7:26 IST

google News
    • CBSE Class 10th result Digilocker : సీబీఎస్​ఈ క్లాస్​ 10 ఫలితాల్ని.. డిజీలాకర్​లో ఎలా చెక్​ చేసుకోవాలి? ఇక్కడ తెలుసుకోండి..
సీబీఎస్​ఈ క్లాస్​ 10 పరీక్షల ఫలితాలు..
సీబీఎస్​ఈ క్లాస్​ 10 పరీక్షల ఫలితాలు..

సీబీఎస్​ఈ క్లాస్​ 10 పరీక్షల ఫలితాలు..

CBSE Class 10th result date 2024 : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10వ తరగతి ఫైనల్ పరీక్షను ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13 వరకు నిర్వహించింది. సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాల కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఫలితాల కోసం అధికారిక వెబ్​సైట్​ results.cbse.nic.in ని సందర్శించాలి.

అయితే.. సీబీఎస్​ఈ.. తన బోర్డు పరీక్ష ఫలితాలను డిజీలాకర్​లో కూడా పెడుతుందని తెలుస్తోంది. విద్యార్థులు తమ స్కోర్​ కార్డులను డౌన్​లోడ్​ చేసుకోవడానికి డిజీలాకర్ వెబ్​సైట్​ - digilocker.gov.in ని సందర్శించవచ్చు. లేదా ఫలితాల రోజున యాప్​ ఉపయోగించవచ్చు. డిజీలాకర్ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్​లలో పనిచేస్తుంది.

సీబీఎస్​ఈ క్లాస్​ 10 ఫలితాలను చెక్​ చేసుకోవడానికి కావాల్సిన డైరెక్ట్ లింక్ డిజీలాకర్​లో కనిపిస్తుంది.

CBSE Class 10th result Digilocker : మార్కుల షీట్లు, పాస్ సర్టిఫికెట్ల డిజిటల్ కాపీలను కూడా బోర్డు అందజేయనుంది. ఫలితాలు వెలువడిన కొద్ది రోజుల్లోనే ఇదే వేదికపై అందుబాటులోకి రానుంది.

ఈ ఏడాది 39 లక్షల మంది విద్యార్థులు సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు రాశారు. పదో తరగతి పరీక్షలు ముగియగా, 12వ తరగతి విద్యార్థుల ఫైనల్ పరీక్షలు ఏప్రిల్ 2 వరకు కొనసాగనున్నాయి. 10వ తరగతి, 12వ తరగతి ఫలితాలను బోర్డు ఒకే రోజు ప్రకటించే అవకాశం ఉంది.

ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉన్నందున, అధికారిక ప్రకటన తర్వాత కొంతమందికి సీబీఎస్​ఈ ఫలితాల పోర్టల్ స్లో డౌన్​ అయ్యే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో, ఆన్​లైన్​ మార్కుల షీట్లను యాక్సెస్ చేయడానికి డిజీలాకర్ ఒక ప్రత్యామ్నాయ మార్గం.

సీబీఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్ రిజల్ట్స్ చెక్ చేయడానికి అవసరమైన లాగిన్ క్రెడెన్షియల్స్ ఇవే:

  1. రోల్ నంబర్
  2. స్కూల్ నెంబర్
  3. పుట్టిన తేదీ.

CBSE Class 10th result 2024 : బోర్డు పరీక్ష ఫలితాలను తనిఖీ చేయడానికి డిజీలాకర్ రిజిస్ట్రేషన్ అవసరం లేదని, అయితే వారు మార్కుల షీట్లు, సర్టిఫికేట్లను డౌన్​లోడ్​ చేయాలనుకుంటే, వారు ముందుగా నమోదు చేసుకోవాలని విద్యార్థులు గమనించాలి.

డిజీలాకర్ రిజిస్ట్రేషన్ కోసం సీబీఎస్ఈతో రిజిస్టర్ అయిన ఫోన్ నంబర్, ఆధార్ నంబర్ అవసరం.

డిజీలాకర్, సీబీఎస్ఈ వెబ్​సైట్​తో పాటు ఉమాంగ్ యాప్, ఎస్ఎంఎస్ ద్వారా కూడా బోర్డు ఫలితాలను చూపించవచ్చు. ఫలితాల రోజున మరింత సమాచారం లభిస్తుంది.

తదుపరి వ్యాసం