CBSE recruitment: సీబీఎస్ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్; భర్తీ చేయనున్న పోస్ట్ ల వివరాలు..
05 March 2024, 15:15 IST
CBSE recruitment: వివిధ గ్రూప్ ఎ, బి, సి పోస్టుల భర్తీ కోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా వివిధ విభాగాల్లో 118 పోస్ట్ లను ఆలిండియా కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన భర్తీ చేస్తోంది.
సీబీఎస్ఈ రిక్రూట్మెంట్ 2024
CBSE recruitment: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) వివిధ గ్రూప్ ఎ, బి, సి కేటగిరీల్లో మొత్తం 118 ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ పోస్టుల భర్తీకి 'ఆల్ ఇండియా కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఇండియన్ సిటిజన్స్ నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సీబీఎస్ఈ మంగళవారం ప్రకటించింది. ఒకవేళ ఎంపికైతే, అభ్యర్థులను భారతదేశంలో ఎక్కడైనా నియమించవచ్చని నోటీసులో పేర్కొన్నారు.
మార్చి 12 నుంచి అప్లికేషన్స్
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు 2024 మార్చి 12 నుంచి 2024 ఏప్రిల్ 11 వరకు సీబీఎస్ఈ అధికారిక వెబ్సైట్ cbse.gov.in ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. అసిస్టెంట్ సెక్రటరీ, అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ ఇంజనీర్, జూనియర్ ట్రాన్స్ లేషన్ ఆఫీసర్, అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్ పోస్టులను ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా భర్తీ చేస్తున్నారు. విద్యార్హతలు, సూచనలు, ఫీజులు తదితర వివరాలను తెలియజేస్తూ సీబీఎస్ ఈ త్వరలో అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
ఇలా అప్లై చేసుకోవచ్చు..
- మార్చి 12వ తేదీన అప్లికేషన్ లింక్ ఓపెన్ అవుతుంది.
- ఆ తరువాత, cbse.gov.in అధికారిక వెబ్సైట్ ను ఓపెన్ చేయాలి.
- హోమ్ పేజీలో, రిక్రూట్ మెంట్ విభాగానికి వెళ్లండి.
- లైవ్ రిక్రూట్మెంట్లు/ ప్రకటనల జాబితాతో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
- వివిధ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కు సంబంధించిన లింక్ ను కనుగొని ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి క్లిక్ చేయండి.
- అప్లికేషన్ ఫారంలో అడిగిన వివరాలతో మీ దరఖాస్తును నింపండి. మీ రిజిస్టర్డ్ లాగిన్ ఐడి, పాస్ వర్డ్ ఉపయోగించండి.
- అవసరమైన డాక్యుమెంట్స్ ను అప్ లోడ్ చేయండి. అప్లికేషన్ ఫీజును ఆన్ లైన్ లో చెల్లించండి.
- అప్లికేషన్ ఫామ్ ను సబ్మిట్ చేయండి.