Bihar Honour killing : మరో పరువు హత్య- కూతుళ్లను చంపేసిన తల్లిదండ్రులు! పోలీసులు వచ్చేసరికి..
16 April 2023, 10:07 IST
- Bihar Honour killing : తమ కూతుళ్లకు వేరే కూలం అబ్బాయిలతో సంబంధం ఉందని తెలుసుకున్న ఆ తల్లిదండ్రులకు కోపం వచ్చింది. వారు నిద్రపోతున్న సమయంలో.. ఇద్దరిని చంపేశారు! ఈ పరువు హత్య ఘటన బిహార్‌లో కలకలం రేపింది.
మరో పరువు హత్య- కూతుళ్లను చంపేసిన తల్లిదండ్రులు
Bihar Honour killing : బిహార్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. సొంత కూతుళ్లను చంపేశారు తల్లిదండ్రులు. వేరే కులం వారితో సంబంధం పెట్టుకున్నారన్న కారణంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డారు!
అసలేం జరిగిందంటే..
18, 16ఏళ్ల వయస్సు ఉన్న అక్కచెళ్లళ్లు దారుణ హత్యకు గురైయ్యారన్న సమాచారంతో పోలీసులు.. హాజీపూర్‌లోని ఓ ఇంటికి వెళ్లారు. ఇంట్లోకి వెళ్లేసరికి షాక్‌కు గురయ్యారు.
Parents kill daughters in Bihar : రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాల పక్కన వారి తల్లి రింకు దేవీ కూర్చిన ఉంది. 'ఏం జరిగింది?' అని పోలీసులు ప్రశ్నించగా.. 'నా భర్త.. నా బిడ్డలను చంపేసి పారిపోయాడు,' అని ఆమె జవాబిచ్చింది. 'నా బిడ్డలకు వేరే కులం అబ్బాయిలతో సంబంధం ఉందని తెలుసుకుని, నా భర్తే చంపేశాడు,' అని వివరించింది.
అధికారులు.. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఈ పరువు హత్యపై దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక దర్యాప్తులో భాగంగా.. తండ్రి నరేశ్ భైతా, తల్లి రింకు దేవీలు కలిసే సొంత బిడ్డలను చంపేసినట్టు పోలీసులు తెలుసుకున్నారు. ఇదే విషయాన్ని ఆమె వద్ద ప్రస్తావించారు.
Bihar crime news today : "అవును.. మేమిద్దరం కలిసే మా బిడ్డలను చంపేశాము. వారిద్దరికి వేరే కులం అబ్బాయిలతో సంబంధం ఉంది. ఒక్కోసారి మాతో కూడా చెప్పకుండా, మా అనుమతి లేకుండా బయటకు వెళ్లిపోయేవారు. అందుకే కోపం వచ్చింది. వారు నిద్రపోతున్న సమయంలో చంపేశాము," అని చేసిన నేరాన్ని అంగీకరించింది రింకు దేవీ.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రింకు దేవీని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ఆమె భర్త నరేశ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు మీడియాకు చెప్పారు.
పరువు హత్యలు..
Father kill daughter : దేశంలో ఏదో ఒక మూల పరువు హత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లాలో గత ఫిబ్రవరి జరిగిన ఓ పరువు హత్య కలకలం సృష్టించింది. కుటుంబ పరువు తీసిందన్న కోపంతో... కుమార్తెను హత్య చేశాడు కన్నతండ్రి. తల, మొండేం వేరు చేసి వేర్వురు చోట్ల పడేశాడు. పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.