Father killed Daughter: తల ఓ చోట, మొండెం మరో చోట.. కన్న కూతురును దారుణంగా హత్య చేసిన తండ్రి! -father brutally killed his daughter at alamuru in nandyal district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Father Killed Daughter: తల ఓ చోట, మొండెం మరో చోట.. కన్న కూతురును దారుణంగా హత్య చేసిన తండ్రి!

Father killed Daughter: తల ఓ చోట, మొండెం మరో చోట.. కన్న కూతురును దారుణంగా హత్య చేసిన తండ్రి!

HT Telugu Desk HT Telugu
Feb 25, 2023 09:10 AM IST

Nandyal District Crime News: నంద్యాల జిల్లాలో దారుణం వెలుగు చూసింది. కుటుంబ పరువు తీసిందన్న కోపంతో... కుమార్తెను హత్య చేశాడు కన్నతండ్రి. తల, మొండేం వేరు చేసి వేర్వురు చోట్ల పడేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

నంద్యాల జిల్లాలో దారుణం
నంద్యాల జిల్లాలో దారుణం

father brutally killed his daughter: వారికి ఇద్దరు కుమార్తెలు..! రెండేళ్ల క్రితమే పెద్ద అమ్మాయికి స్టాఫ్ వేర్ ఇంజినీర్ తో వివాహం చేశాడు. వాళ్లు హైదరాబాద్ లో ఉండేవారు. సీన్ కట్ చేస్తే... కుమార్తె హైదరాబాద్ లో ఉండకుండా తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. గ్రామంలోనే ఉంటుంది. భర్త దగ్గరికి వెళ్లకుండా ఇక్కడి ఉండటానికి గల కారణం గతంలో ఆ అమ్మాయి ఒకరిని ప్రేమించింది. అతనితో సాన్నిహత్యం కారమంగానే గ్రామానికి వచ్చినట్లు భావించాడు తండ్రి. భర్త దగ్గరికి వెళ్లకుండా ఊరిలోనే ఉండటంతో తండ్రి తట్టుకోలేకపోయాడు. పది మందిలో పరువు పోయిందన్న బాధతో రగిలిపోయాడు. కట్ చేస్తే కన్న కుమార్తెను కడతేర్చాడు. ఈ ఘటన నంద్యాల జిల్లాలో సంచలనం సృష్టించింది. పోలీసుల విచారణలో కీలక విషయాలు బయటికి వచ్చాయి.

ఏం జరిగిందంటే...?

నంద్యాల జిల్లా పాణ్యం మండలంలో ఆలమూరు గ్రామానికి చెందిన దేవేంద్రరెడ్డికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. పెద్ద అమ్మాయి ప్రసన్న(21) కు ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుతో రెండేళ్ల క్రితం పెళ్లి చేశారు. వీరు హైదరాబాద్‌ నగరంలో నివాసం ఉండేవారు. పెళ్లికి ముందే ప్రసన్న మరో వ్యక్తిని ప్రేమించింది ప్రసన్న. ఈ కారణంతో తిరిగి గ్రామానికి వచ్చి ఇక్కడి ఉంది. భర్త దగ్గరకు వెళ్లటం లేదు. దీంతో తన పరువు పోయిందని భావించిన తండ్రి దేవేంద్రరెడ్డి కోపం పెంచుకున్నాడు. ఈనెల 10న ఇంట్లో కుమార్తె ప్రసన్న గొంతు నులిమి హతమార్చాడు.

తల, మొండెం వేరు...

కన్న కుమార్తెను హత్య చేసిన తండ్రి... మృతదేహాన్ని కారులో అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఇందుకోసం పలువురి సాయం కూడా తీసుకున్నాడు. తల, మొండెం వేరు చేశారు. తల ఒకచోట, మొండేన్ని మరోచోట పడేశారు. ఆ తర్వాత ఇంటికి వచ్చేశాడు. కుమార్తె విషయం ఏం తెలియనట్లు ఉన్నాడు. ఈ మధ్య మనవరాలు ప్రసన్న ఫోన్‌ చేయకపోవడంతో తాత శివారెడ్డికి అనుమానం వచ్చింది. దేవంద్రరెడ్డి ఆరా తీశాడు. గట్టిగా నిలదీయటంతో అసలు విషయం చెప్పాడు. వెంటనే తాత శివారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తండ్రి దేవేంద్రరెడ్డి దేవేంద్రరెడ్డిని అదుపులోకి తీసుకుని ప్రసన్న మృతదేహాన్ని పడేసిన ప్రాంతానికి తీసుకెళ్లారు. తల, మొండెం దొరకబట్టారు. తండ్రిని అరెస్ట్ చేశారు.

మరోవైపు దొరికిన తల, మొండెంను పోస్టుమార్టం కోసం పంపించారు. మిగతా వారి పాత్రపై కూడా ఆరా తీస్తున్నారు. కన్న కుమార్తెను తండ్రి అత్యంత దారుణంగా హత్య చేయటం స్థానికంగా కలకలం రేపింది.

Whats_app_banner