తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Cauvery Water Dispute : కర్ణాటక- తమిళనాడు మధ్య నెలకొన్న కావేరీ జలాల వివాదం ఏంటి?

Cauvery water dispute : కర్ణాటక- తమిళనాడు మధ్య నెలకొన్న కావేరీ జలాల వివాదం ఏంటి?

Sharath Chitturi HT Telugu

26 September 2023, 9:23 IST

google News
    • Cauvery water dispute :  కావేరీ జలాల వివాదం.. కర్ణాటక, తమిళనాడు రాజకీయాలు కుదిపేస్తోంది. బెంగళూరు బంద్​ నేపథ్యంలో అసలేంటి ఈ వివాదం? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..
కర్ణాటక- తమిళనాడు మధ్య నెలకొన్న కావేరీ జలాల వివాదం ఏంటి?
కర్ణాటక- తమిళనాడు మధ్య నెలకొన్న కావేరీ జలాల వివాదం ఏంటి? (ANI)

కర్ణాటక- తమిళనాడు మధ్య నెలకొన్న కావేరీ జలాల వివాదం ఏంటి?

Cauvery water dispute : మంగళవారం జరుగుతున్న బెంగళూరు బంద్​ నేపథ్యంలో కర్ణాటక- తమిళనాడుల మధ్య నెలకొన్న కావేరీ జలాల వివాదం మరోమారు చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో అసలు ఈ వివాదం ఏంటి? ఇప్పుడు మళ్లీ ఎందుకు తెరపైకి వచ్చింది? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

బ్రిటీష్​ పాలన నాటి వివాదం..

కర్ణాటక- తమిళనాడుల మధ్య నెలకొన్న కావేరీ జలాల వివాదం ఇప్పటిది కాదు. బ్రిటీష్​ పాలన నాటి నుంచి ఇది.. రెండు ప్రాంతాలను ఇబ్బంది పెడుతూనే ఉంది. నదీ జలాల కేటాయింపే శతాబ్దాలుగా ఇక్కడ ఉన్న ప్రధాన సమస్య! 

కాగా.. 1924లో ఈ వివాదంపై ఓ ఒప్పందం కుదిరింది. నాటి మైసూర్​ రాష్ట్రం, మద్రాస్​ ప్రెసిడెన్సీలు రాజీకి వచ్చాయి. ఈ ఒప్పందం ప్రకారం.. కన్నంబది గ్రామంలో ఓ డ్యామ్​ను నిర్మించుకునే అవకాశం మైసూరుకు లభించింది. 44.8 వేల మిలియన్​ క్యూబిట్​ అడుగల నీటని నిల్వచేసుకునే విధంగా ఈ డ్యామ్​ను రూపొందించుకోవచ్చని ఒప్పందంలో ఉంది. అయితే.. 50 తర్వాత దీనిని రివ్యూ చేయాలి అని కూడా ఉంది.

ఆ తర్వాత కొంతకాలం ఈ వివాదం కనుమరుగైంది. కానీ స్వాతంత్ర్యం తర్వాత.. ఈ వివాదం మరింత ముదిరి, సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. అయినా పెద్దగా ఫలితం దక్కలేదని చెప్పుకోవాలి.

కావేరీ వాటర్​ డిస్ప్యూట్​ ట్రిబ్యునల్​..

Bengaluru bandh today : 1990లో.. అప్పటి ప్రభుత్వం సీడబ్ల్యూడీటీని ఏర్పాటు చేసింది. కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చెరిల మధ్య నెలకొన్న కావేరీ జలలా వివాదాన్ని పరిష్కరించడమే ఈ ట్రిబ్యునల్​ ప్రధాన లక్ష్యం. వీటిపై దర్యాప్తు చేపట్టిన సీడబ్ల్యూడీటీ.. నెలవారీగా లేదా వారంలో ఒకసారి.. 205 మిలియన్​ క్యూబిక్​ అడుగల నీటిని తమిళనాడుకు విడిచిపెట్టాలని కర్ణాటకకు ఆదేశాలిచ్చింది. ఆ తర్వాత ఈ వివాదం మరింత ముదిరినట్టు తెలుస్తోంది.

ఇదీ చూడండి:- Bengaluru Bandh : నేడు బెంగళూరు బంద్​.. తెరపైకి మళ్లీ ఆ వివాదం..!

'నీళ్లు లేవు.. ఎలా ఇవ్వాలి?'

ఈ నదీ జలాలపై కర్ణాటకకు సీడ్ల్యూఎంఏ (కావేరీ వాటర్​ మేనేజ్​మెంట్​ అథారిటీ).. ఇటీవలే కర్ణాటకకు మరో అదేశాన్ని ఇచ్చినట్టు కనిపిస్తోంది. 15 రోజుల పాటు అదనంగా మరో 5వేల క్యూసెక్కుల నీటిని తమిళనాడుకు విడుదల చేయాలని చెప్పింది.

తమకే సరిపడా నీళ్లు లేవని, ఇక ఇతర రాష్ట్రానికి ఎలా ఇవ్వాలని కర్ణాటకలోని అధికారులు ప్రశ్నిస్తున్నారు.

కాంగ్రెస్​ ఏం చెబుతోందంటే..

ఇక తాజా బెంగళూరు బంద్​కు అధికార కాంగ్రెస్​ మద్దతివ్వలేదు. కానీ కావేరీ నదీ జలాల వివాదం తీవ్రత తమకు తెలుసని, ఈ విషయంపై రాజకీయాలు పక్కనపెట్టి, అందరు కలిసి చర్చలు జరపలాని హస్తం పార్టీ చెబుతోంది.

Cauvery water row : "సీడబ్ల్యూఎంఏ ఆదేశాలపై స్టే విధించాలని మేము సుప్రీంకోర్టుకు వెళతాము. నీళ్లే లేకపోతే.. అసలు వేరే రాష్ట్రానికి ఎలా వదలాలి? కర్ణాటకలో ఆగస్ట్​ తర్వాత వర్షాలు పడవు. కానీ తమిళనాడులో ఆగస్ట్​ తర్వాత కూడా వర్షాలు పడతాయి. అక్కడ భూగర్భ జలాలు నిండుగా ఉంటాయి. మా పరిస్థితి అలా కాదు. ప్రధాని మోదీ ఈ విషయంపై జోక్యం చేసుకోవాలి," అని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు.

సీడబ్ల్యూఎంఏ ఆదేశాల విషయంలో తాము జోక్యం చేసుకోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

తదుపరి వ్యాసం