Road accident : మోదీ ర్యాలీకి వెళుతుండగా ఘోర ప్రమాదం.. 39మంది బీజేపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలు!
Road accident : మధ్యప్రదేశ్‌లో సోమవారం ఉదయం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో 39మంది బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారు. మోదీ ర్యాలీలో పాల్గొనేందుకు వెళుతుండగా.. వీరు బస్సు, ఓ ట్రక్‌ను ఢీకొట్టింది.
Madhya Pradesh Road accident : మధ్యప్రదేశ్‌లో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. పార్క్ చేసిన ఉన్న ఓ ట్రక్‌ను.. ఓ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో 39మంది గాయపడ్డారు. కాగా.. వీరందరు బీజేపీ కార్యకర్తలని, ఇంకొన్ని గంటల్లో జరగనున్న మోదీ ర్యాలీలో పాల్గొనేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.
బీజేపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలు..
ఖర్గోన్ జిల్లాలో.. బీజేపీ కార్యకర్తలు ప్రయాణిస్తున్న ఓ బస్సు ప్రమాదానికి గురైంది. పార్కింగ్‌లో ఉన్న ట్రక్‌ను ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం వారందరు ఆయా హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్నారు.
గాయపడిన వారు.. ఖపర్జమ్లి, రూప్‌గఢ్, రాయ్ సాగర్ ప్రాంతాలకు చెందిన వారని సమాచారం.
మోదీ సభకు వెళుతుండగా..
Karyakarta Mahakumbh : మధ్యప్రదేశ్‌లో త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భోపాల్‌లో సోమవారం 'కార్యకర్త మహాకుంభ్' పేరుతో ఓ మెగా ఈవెంట్‌ను నిర్వహిస్తోంది బీజేపీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు బీజేపీ అగ్రనేతలు ఈ సభలో పాల్గొంటున్నారు. స్థానిక బీజేపీ యంత్రాంగం.. ఈ ఈవెంట్‌ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పరిగణిస్తోంది. రాష్ట్రం నలుమూలల నుంచి తమ కార్యకర్తలను పోగేస్తోంది. ఈ ఈవెంట్‌కు కనీసం 10లక్షల మందినైనా తీసుకురావాలని కమలదళం టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తోంది.
ఈ తరుణంలో బీజేపీ కార్యకర్తలకు గాయాలవ్వడంపై పలువురు బీజేపీ నేతలు విచారం వ్యక్తం చేశారు. వారు త్వరగా కోరుకోవాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.
సంబంధిత కథనం