PM Modi : బీజేపీ మహిళా కార్యకర్తలకు ప్రధాని మోదీ పాదాభివందనం!-pm modi bows before bjp women workers to pay them respect ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Pm Modi : బీజేపీ మహిళా కార్యకర్తలకు ప్రధాని మోదీ పాదాభివందనం!

PM Modi : బీజేపీ మహిళా కార్యకర్తలకు ప్రధాని మోదీ పాదాభివందనం!

Sharath Chitturi HT Telugu
Sep 24, 2023 01:30 PM IST

PM Modi : మహిళా రిజర్వేషన్​ బిల్లుకు పార్లమెంట్​ ఆమోద ముద్ర వేసిన నేపథ్యంలో.. దిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో సంబరాలు జరిగాయి. ఈ నేపథ్యంలో మహిళా కార్యకర్తలకు మోదీ పాదాభివందనం చేశారు.

బీజేపీ మహిళా కార్యకర్తలతో ప్రధాని మోదీ..
బీజేపీ మహిళా కార్యకర్తలతో ప్రధాని మోదీ.. (PTI)

PM Modi latest news : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. మహిళలకు పాదాభివందనం చేశారు. దిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఉదయం జరిగిన ఓ ఈవెంట్​లో ఈ సంఘటన జరిగింది.

మహిళలకు మోదీ పాదాభివందనం..

దశాబ్దాలుగా పక్కన పడి ఉన్న కీలకమైన మహిళా రిజర్వేషన్​ బిల్లుకు గురువారం పార్లమెంట్​ ఆమోద ముద్రవేసింది. ఈ నేపథ్యంలో బీజేపీ కార్యాలయంలో శుక్రవారం ఉదయం ఓ ఈవెంట్​ జరిగింది. వందలాది మంది బీజేపీ మహిళా కార్యకర్తలు, నేతలు ఈ వేడుకలో పాల్గొని సంబరాలు చేసుకున్నారు.

మరోవైపు ఈ వేడుకలో ప్రధాని మోదీ సైతం పాల్గొన్నారు. ఆయనను కొందరు మహిళలు సన్మానించారు. ఈ క్రమంలోనే.. వారికి ఆయన పాదాభివందనం చేశారు. అదే సమయంలో తన కాళ్లను పట్టుకునేందుకు ప్రయత్నించిన ఓ మహిళను మోదీ ఆపారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

ఆ సమయంలో ఆ ప్రాంగణం అంతా 'జై మోదీ.. జై బీజేపీ' నినాదాలతో మారుమోగిపోయింది.

సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారిన దృశ్యాలను ఇక్కడ చూడండి :

మహిళలకు శుభాకాంక్షలు..

మహిళా రిజర్వేషన్​ బిల్లును నారీ శక్తి వందన్​ అధినియన్​గా పిలుస్తోంది కేంద్రం. లోక్​సభ, రాజ్యసభలో ఈ బిల్లు గట్టేక్కింది. రాష్ట్రపతి ఆమోదంతో ఈ బిల్లులు చట్టంగా మారుతుంది. బిల్లు ఆమోదం నేపథ్యంలో.. బీజేపీ కార్యాలయంలో మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు ప్రధాని మోదీ.

Women's reservation bill : "మహిళా రిజర్వేషన్​ బిల్లుకు ఆమోదం లభించినందుకు దేశంలోని నారీ శక్తికి నా హృదయ పూర్వక శుభాకాంక్షలు. సెప్టెంబర్​ 21, 22 తేదీల్లో కొత్త చరిత్రను రాశాము. ఇలా చరిత్ర రాసేందుకు ప్రజలు మాకు అవకాశం ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. దేశ భవిష్యత్తునే మార్చేయగలిగే శక్తి.. కొన్ని నిర్ణయాలకు ఉంటుంది. అలాంటిదే.. ఇది! ఇలాంటి బిల్లు పార్లమెంట్​లో గట్టెక్కడం.. దేశంలో మెజారిటీ కలిగిన ప్రభుత్వం సత్తాను చాటిచెబుతోంది. దేశాభివృద్ధికి మెజారిటీ కలిగిన ప్రభుత్వం ఉండటం ఎంత అవసరమో ఈ బిల్లు చెబుతోంది," అని మోదీ అన్నారు.

బిల్లు చట్టంగా మారుతున్నప్పటికీ.. ఎప్పటి నుంచి అమలవుతుందనే విషయంపై ఎన్​డీఏ ప్రభుత్వం సరైన సమాచారం ఇవ్వలేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కాగా.. అమల్లోకి వస్తే మాత్రం.. లోక్​సభలో ప్రస్తుతం 82గా ఉన్న మహిళా ఎంపీల సంఖ్య 181కి చేరుతుంది. ఇక రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33శాతం వాటా లభిస్తుంది.

అసలు మహిళా రిజర్వేషన్​ బిల్లు అంటే ఏంటి? ఈ బిల్లుకు ఇంతకాలం ఎందుకు ఆమోదం లభించలేదు? వంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం