PM Modi | ఇది ఒక బంగారు క్షణం.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రధాని మోదీ-pm modi on women reservation bill ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Pm Modi | ఇది ఒక బంగారు క్షణం.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రధాని మోదీ

PM Modi | ఇది ఒక బంగారు క్షణం.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రధాని మోదీ

Published Sep 21, 2023 03:48 PM IST Muvva Krishnama Naidu
Published Sep 21, 2023 03:48 PM IST

  • లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇదో బంగారం క్షణం అని ప్రధాని అభివర్ణించారు. సభలోని సభ్యులందరూ ఆ బంగారు క్షణానికి అర్హులని మోదీ అన్నారు. ఈ బిల్లుతో మహిళలు అపూర్వమైన శక్తిగా ఉద్భవిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలని కోరారు. ఇక బుధవారం ఈ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది ఇద్దరు సభ్యులు మినహా.. మిగిలిన సభ్యులంతా మహిళ రిజర్వేషన్ బిల్లుకు, మద్దతు తెలిపారు. ఇవాళ ఇదే బిల్లుపై రాజ్యసభలో చర్చ జరుగుతోంది. అక్కడ కూడా ఈ బిల్లుకు ఎటువంటి ఆటంకం లేకుండా గట్టెక్కనుంది.

More