RITES Recruitment 2024 : ఆర్ఐటీఈఎస్ జాబ్ నోటిఫికేషన్.. ఈ క్వాలిఫికేషన్ ఉన్నవారు అప్లై చేయెుచ్చు!
RITES Recruitment 2024 : రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్‌లో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వెలువడింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్. రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్ (RITES) ఇంజనీర్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు 9 జనవరి 2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు rites.com అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి అప్లై చేయెుచ్చు.
అర్హతలు
ఈ రిక్రూట్‌మెంట్‌లో అసిస్టెంట్ మేనేజర్ (సివిల్) 9 పోస్టులు, అసిస్టెంట్ మేనేజర్ (ఎస్అండ్‌టీ) 4 పోస్టులు, అసిస్టెంట్ మేనేజర్ (ఎలక్ట్రికల్) 2 పోస్టులపై నియామకాలు జరుగుతాయి. ఈ పోస్టులకు అభ్యర్థులు BE/B.Tech/Diploma (సివిల్, ఎలక్ట్రికల్ లేదా ఇతర సంబంధిత శాఖ) కలిగి ఉండటం తప్పనిసరి. దీనితో పాటు అభ్యర్థి గరిష్ట వయస్సు 40 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు. వయస్సు 9 జనవరి 2025న చివరి తేదీగా లెక్కిస్తారు.
దరఖాస్తు ఫీజు
దరఖాస్తు రుసుము జనరల్ కేటగిరీకి రూ. 600 ప్లస్ ట్యాక్స్, SC, ST, EWS, మరియు PWD కేటగిరీ అభ్యర్థులకు రూ. 300 ప్లస్ ట్యాక్స్‌గా నిర్ణయించారు. రుసుము జమ చేయకపోతే దరఖాస్తు అంగీకరించరని గుర్తుంచుకోవాలి.
ముఖ్యమైన తేదీలు
ఈ రిక్రూట్‌మెంట్ కోసం అభ్యర్థుల ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది. మొదటి దశలో రాత పరీక్ష ఉంటుంది. ఇది 13 జనవరి 2025న నిర్వహిస్తారు. రాత పరీక్షలో విజయం సాధించిన అభ్యర్థులను రెండో దశలో ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూ 19 జనవరి 2025న ఉంటుంది. రెండు దశల ఫలితాల ఆధారంగా అభ్యర్థుల తుది జాబితాను రెడీ చేస్తారు.
దరఖాస్తుకు చివరి తేదీ: 9 జనవరి 2025
రాత పరీక్ష: 13 జనవరి 2025
ఇంటర్వ్యూ: 19 జనవరి 2025
దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు ముందుగా RITES అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి నమోదు చేసుకోవాలి. దరఖాస్తు ఫారమ్‌లో అవసరమైన మొత్తం సమాచారాన్ని నింపాలి. సూచించిన దరఖాస్తు రుసుమును డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.